India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖరిఫ్ 2023-24 సీజన్ ముగింపు దశ కారణంగా ఈ నెలాఖరులోగా రైతులు వద్ద ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన RBKల ద్వారా ప్రభుత్వానికి విక్రయించాలని జాయింట్ కలెక్టర్ నవీన్ సూచించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాని రైతు భరోసా కేంద్రాల వద్ద మద్దతు ధరకు విక్రయించాలన్నారు. మార్చి 31 దాటితే రైతులు వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరగదన్నారు.
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల ప్రచారాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ వెల్లడించారు. అనుమతులు లేకుండా ప్రచారాలు చేపడితే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేస్తామన్నారు. జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, ఎంసీసీ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే విషయమై పునరాలోచన చేస్తున్నామని మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం సాయంత్రం టీడీపీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ తమతో భేటీ అయ్యారని, పార్టీ పునఃపరిశీలన అనంతరం నిర్ణయం వెలువడే దాకా వేచి ఉండాలని సూచించారన్నారు. ఆ మేరకు తాము ఆలోచన చేస్తున్నామన్నారు.
మందస మండలం చిన్న సువర్ణపురం గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లోకి సాలిని గున్నయ్య (40) అనే వ్యక్తి పనికి వెళ్లాడు. పని చేస్తూ అక్కడే ఉన్న ఓ ఇనుప చువ్వను ముట్టుకున్నాడు. దానికి కరెంట్ ప్రసరించడంతో ఆయన కరెంట్ షాక్‌కు గురయ్యాడు. సహచరులు గమనించి 108 అంబులెన్స్ సమాచారం అందిచారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరీక్షించించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ వెనుక చక్రాల కింద సోంపేట మండలం జీడీపుట్టుక గ్రామానికి చెందిన చెల్లురి చైతన్య తీవ్ర గాయాలపాలయ్యాడు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతుడు ఇటీవల సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఎం జగన్ చేపట్టనున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం రాజశ్యామల హోమం నిర్వహించనున్నట్లు కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సురిబాబు తెలిపారు. నగరంలోని రామలక్ష్మణ కూడలి వద్ద ఉన్న దుర్గా మహాలక్ష్మీ దేవాలయంలో ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ యాగంలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు, మహిళలు, అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
జాతీయ రహదారిపై కొత్తపేట కూడలి వద్ద ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళంవైపు చేపలలోడుతో వెళ్తున్న వ్యాను టైరుపంక్చర్ కావడంతో సోమవారం బోల్తా పడింది. ఆక్సిజన్ సిలెండర్లు, నీటి ట్యాంకులు చెల్లాచెదురుకావడంతో చేపలు రహదారి పక్కన పడిపోయాయి. వాటిని ఏరుకునేందుకు స్థానికులు పోటీపడ్డారు. హైవే సిబ్బంది అక్కడికి చేరుకుని ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు చేపట్టారు. వాహనంలో డ్రైవర్, మరోవ్యక్తి గాయాలు కాలేదు.
ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో గోతుల రహదారిలోనే ప్రయాణించాల్సి వస్తుందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. తాజాగా సోమవారం రాత్రి గోతిలో దిగబడిన ఆటో ముందు చక్రం విరిగిపడింది. అయితే ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ తెలిపారు. రహదారిని బాగు చేయాలని కోరారు.
పర్లాకిమిడి గజపతి రాజులుచే నిర్మించిన లివిరి గోపీనాధస్వామి ఆలయంలో ఒడిశా సంప్రదాయం ప్రకారం మంగళవారం హోలీ జరుపుకుంటారు. తిరువీధి, వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గోపినాధస్వామి హోలీ ఉత్సవానికి ఆంధ్రా, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవంలో పర్లాకిమిడి మహారాజు వంశీయులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ చిన్న హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన చింతాడ చెల్లమ్మ (46) పాము కాటుతో సోమవారం మృతి చెందింది. ఇటీవల పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. మృతురాలి కుమారుడు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.
Sorry, no posts matched your criteria.