India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కవిటి పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి మీడియాతో వివరాలు వెల్లడించారు. ఇదే వ్యక్తి కవిటి, కంచిలి, ఇచ్చాపురం పట్టణాల్లో చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. రూ.7,76,958 మొత్తం విలువ గల ఎనిమిదిన్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

శ్రీకాకుళం కిన్నెర కాంప్లెక్స్ వద్ద కాకి వీధిలోని గోవింద్ ఇంటిలో శనివారం రాత్రి దొంగలు కత్తులతో హల్చల్ చేశారు. ఇంట్లోని బాలుడు, ఓ మహిళ కూరగాయల కత్తితో ప్రతిఘటించారు. దీంతో దొంగలు పారిపోయేందుకు యత్నించగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇంటి సభ్యుల కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. DSP వివేకానంద, సీఐ పైడిపు నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మందస మండలం హరిపురం సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం శనివారం లభ్యమైందని కాశీబుగ్గ జీఆర్పీ ఎస్‌ఐ ఎస్‌కె షరీఫ్ తెలిపారు. మృతురాలి వయస్సు 55 ఉంటుందని, బిస్కెట్ కలర్ జాకెట్, చింత పిక్క రంగు చీర కట్టుకుని ఉన్నట్లు ఎస్‌ఐ చెప్పారు. రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పలాస సామాజిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎన్నికల క్లెయిమ్స్‌పై సూపర్ చెక్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం నిర్వహించారు. గడిచిన ఎన్నికలలో ఫారం 6, 7, 8 క్లెయిమ్స్‌కు సంబంధించి డిస్పోజ్ అయి క్లయిమ్స్‌లలో భారత ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన 23 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వయంగా సూపర్ చెక్ చేశారు. ఆయా క్లెయిమ్స్ కింద అర్జీ పెట్టుకున్న వారి ఇంటి వద్దకు బిఎల్ఓలు వెళ్లారా? లేదా? అడిగి తెలుసుకున్నారు.

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.

వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని అన్ని అంగనవాడీలకు సెలవు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సంబంధిత అంగన్వాడీ సిబ్బంది ముందస్తుగా చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని అన్ని స్కూళ్లలో టీచర్లు అప్రమత్తంగా ఉండాలని.. ఇబ్బందిగా ఉన్న చోట ఎంఈవోలు సెలవులు ప్రకటించాలని డీఈఓ తిరుమల చైతన్య ఆదేశించారు.

బొంబై ఐఐటీలో మార్కెట్ బజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ & టెక్నాలజీ ప్రదర్శనలో సిక్కోలు జిల్లా సోంపేట పట్టణానికి చెందిన మరిడీ ఆదర్శ్ కుమార్ 3 వ స్థానంలో అవార్డు సొంతం చేసుకున్నారు. సముద్ర మార్గాల ద్వారా పయనించే పెద్ద ఓడలు దిగువన, వివిధ మైక్రో ఆర్గాన్స్ అతుక్కోవడంతో వాటి వల్ల సముద్ర తీరం కలుషితం అవుతుందని వాటిని క్లీన్ చేసేందుకు కొత్త పరికరం తాలూకా ప్రదర్శన చేశానని విద్యార్థి తెలిపారు.

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97055 22122కు వాట్సాప్ చేయండి.

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చిన్నబడాంలో శుక్రవారం ఉదయం అట్టాడ మురళి అనే యువకుడు చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం టెక్కలి పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై గతంలో దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని టెక్కలి పీఎస్‌లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై తాజాగా టెక్కలి పోలీసులు దువ్వాడ కు 41-ఏ నోటీసులు జారీచేశారు. దీనిపై శుక్రవారం ఆయన పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.