India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జి.కృష్ణారావు గుండెపోటుతో మృతి చెందారు. నందిగాం మండలం కల్లాడ గ్రామానికి చెందిన కృష్ణారావు కాకినాడ డీసీఆర్బీలో ఏఎస్సైగా పని చేశారు. కాకినాడలోని రాయుడుపాలెంలో తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం కృష్ణారావుకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రే ఎస్పీ నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఎస్పీలు శనివారం బదిలీ అయిన విషయం తెలిసిందే. ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి విధుల్లో చేరనుండటంతో ఇంతకు ముందు పనిచేసిన ఎస్పీ జీఆర్ రాధిక సోమవారం రిలీవ్ అయ్యి నేరుగా డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయనున్నారు.
ఒడిశాలోని పర్లాఖెముండి జిల్లా కేంద్రానికి సమీపంలో పాతపట్నం, కె.గోపాలపురం, హెచ్.గోపాలపురం ఉన్నాయి. పర్లాఖెముండికి పెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ప్లాస్టిక్, ఆసుపత్రిలోని వస్తువులు శివారులోని కాలువలోకి వెళ్లేలా అనుసంధానం చేశారు. వారి సరిహద్దు వరకు కాలువలను చేసి గోపాలపురం వరకు వదులుతున్నారు. ఈ సమస్య కొన్నేళ్లుగా ఉండటంతో ఇరురాష్ట్రాల సరిహద్దు వద్ద అడ్డుగోడ నిర్మించారు. అయినా పరిస్థితి మారలేదు.
మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి బ్రహ్మ కమలం పుష్పాలు. ఇవి సాధారణంగా హిమాలయ పర్వతాలు, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మొక్కలపై ఆకులే ఏడాదికి ఒక్కసారి పువ్వులా వికసిస్తాయి. అలాంటి బ్రహ్మ కమలం పుష్పాలు బారువలో కరుమోజు జీవనరావు పెరటిలో నిన్న రాత్రి బ్రహ్మ కమలం చెట్టుకు ఆరు పుష్పాలు విరిసాయి. బ్రహ్మ కమలం చూడటం వలన శివుడిని చూసినంత – ఆనందంగా ఉందని పలువురు భక్తులు అన్నారు.
విజయవాడ డివిజన్‌లో ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (నం.11019) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఆగస్టు 2, 3, 5, 7, 9, 10వ తేదీలలో విజయవాడ-ఏలూరు మీదుగా కాక రాయనపాడు-గుడివాడ- భీమవరం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.
టెక్కలి మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. టెక్కలి-శ్రీకాకుళం మార్గంలో బొప్పాయిపురం గ్రామం వద్ద లారీ ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మొదట నేషనల్ హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన శివ(52)గా పోలీసులు గుర్తించారు.
సరుబుజ్జిలి మండలం గోనెపాడు అగ్రహారంలో 1893 జులై 14న జన్మించిన గరిమెళ్ల సత్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి, పాత్రికేయుడు. తన గళాన్ని, కాలాన్ని ఆయుధంగా మలిచి తెల్లదొరలపై అస్త్రం సంధించిన ప్రజాకవి. గృహాలక్ష్మి, వాహిని, ఆంధ్రప్రభ, ఆనందవాణి పత్రికల్లో సంపాదకుడిగా పనిచేశారు. శ్రీకాకుళం ప్రెస్ క్లబ్‌కు గరిమెళ్ల భవన్‌గా 2001లో నామకరణం చేశారు. జిల్లా గ్రంథాలయ భవనానికి ఆయన పేరు పెట్టారు.
మాజీ మంత్రి అప్పలరాజుపై MLA గౌతు శిరీష కాశీబుగ్గ PSలో శనివారం ఫిర్యాదు చేశారు. ‘అప్పలరాజు మంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో నోరు పారేసుకున్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదని ఒక వైద్యుడిగా ధ్రువీకరిస్తానన్నారు. జగన్ ప్రాపకం కోసం చంద్రబాబును ఆసుపత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తరువాతే అసెంబ్లీలోకి అడుగు పెట్టించాలన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రజలే నాయకులై ముందుండి నడిపించిన సోంపేట ధర్మల్ పోరాటం దేశంలోనే ప్రజా ఉద్యమాల్లో ఒకటిగా పేరుపొందింది. కార్పొరేట్ల ధనదాహానికి పచ్చని బీల ప్రాంతం కనుమరుగు కావడమే కాకుండా పరిసర ప్రాంత ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుందన్న భయాందోళన నేపథ్యంలో ప్రజలే ముందుండి విజయవంతం చేసిన ఉద్యమంగా సోంపేట ధర్మల్ ఉద్యమం ఖ్యాతికెక్కింది. ధర్మల్ పోరాటంలో మృతుల జ్ఞాపకార్థం జులై 14న ఏటా సభను నిర్వహిస్తారు.
ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ శనివారం సాయంత్రం వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించామని ఆయన పేర్కొన్నారు. వర్షాల కారణంగా చెట్లు కింద ఉండరాదని, విద్యుత్ స్తంభాలు వద్ద వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.