India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) రెండేళ్ల కాలవ్యవధితో హిందీ మాధ్యమంలో ఓపెన్/డిస్టెన్స్ విధానంలో భగవద్గీతపై ఎంఏ కోర్సు అందిస్తోంది. డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్స్ చేసేందుకు అర్హులు కాగా రెండేళ్లకు ఫీజు రూ.12,600 చెల్లించాల్సి ఉంటుంది. కోర్స్ అడ్మిషన్, వివరాలకు శ్రీకాకుళంలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouadmission.samarth.edu.in/ వెబ్‌సైట్ చూడాలని ఇగ్నో కోరింది.
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక బదిలీ అయ్యారు. నూతన ఎస్పీగా కె.వి మహేశ్వర రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 37 మంది IPSల బదిలీలు జరగగా, అందులో శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న జి.ఆర్ రాధిక ఉన్నారు. బదిలీ అయిన రాధికకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమెను DGP కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించారు.
శ్రీకాకుళం నగరం మొండేటివీధిలో శ్రీఃలలిత సహిత శివకామేశ్వర ఆలయం వద్ద రథయాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జగన్నాథ, సుభద్ర, బలభద్రుల విగ్రహాలకు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేంకన్న అవతారంలో స్వామివారిని అలకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో DR.BRAU ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ B.Ed.M.R కోర్సులకు సంబంధించి నాలుగో సెమిస్టర్ (2022-24) పరీక్షలకు సంబంధించి పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు నాలుగో సెమిస్టర్ విద్యార్థులు నేడు సాయంత్రంలోగా రూ.1,150 లను చెల్లించవచ్చు. పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఈనెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. సెమిస్టర్ పరీక్షలు 30వ తేదీన నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. గత తమ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, తిరిగి మళ్లీ ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతి మంగళ, బుధవారంలో చేపడతామన్నారు. రైతు వద్దకే వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి సూచనలు ఇవ్వాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ఏయూ పరిధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) మొదటి సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కార్యాలయం నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా 19 కోర్సుల ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు తమ యొక్క ఫలితాల కోసం https://drbrau.in/ వెబ్సైట్ ను సందర్శించాలని పేర్కొన్నారు.
ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురంలో 1908 జులై 13న జన్మించిన చౌదరి సత్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు. 13 ఏళ్ల వయసులోనే ఉప్పు సత్యాగ్రహం, కల్లు వేలం పాటలకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో దూసి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహాత్మా గాంధీని పొందూరు ఖాదీతో సత్కరించారు. 1955, 1967లో కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు రెండో శనివారం సెలవు దినం పాటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం తెలిపారు. సెలవు ప్రకటించని పక్షంలో ఆయా పాఠశాల, కళాశాలలపై apscpcr2018@gmail.com మెయిల్ ఐడీ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతున్న రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. కాగా శుక్రవారం 40 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం రెండు రోజుల్లో 70 మంది హాజరయ్యారు. ఈ కౌన్సెలింగ్ గురువారం ప్రారంభం కాగా శనివారంతో ముగియనుంది. మొదటి విడత సీట్లు లభించిన విద్యార్థులు బ్రాంచ్‌లు మార్చుకునే వెసులుబాటు ఉంది.
జిల్లా హాకీ సంఘం ఎన్నికలు ఆదివారం నిర్వహించనున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి షైనీ మధు తెలిపారు. శ్రీకాకుళంలోని తిలక్ నగర్ వద్ద యూటీఎఫ్ భవనంలో ఉదయం 10 గంటలకు జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సంఘ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.