Srikakulam

News July 13, 2024

నేడు, రేపు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు

image

జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలో శని, ఆదివారం శ్రీకాకుళంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2024 పేరిట నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలో మొత్తం ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహించానున్నారు. అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17, అండర్-19 బాలికలకు, పురుషులు పోటీలు జరుగుతాయి.

News July 13, 2024

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే అధికారులు

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా 2 జనరల్ కోచ్‌లు జత చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12704/12703 సికింద్రాబాద్- హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లకు మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12704 ట్రైన్‌ను నవంబర్ 10 నుంచి, 12703 ట్రైన్‌ను నవంబర్ 12 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News July 12, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✦ మూలపేట పోర్టు నిర్వాసితుల ఆందోళన ✦ ఆమదాలవలసలో ఇద్దరు బైక్ దొంగల అరెస్టు ✦ కారు ఆపి ఆమదాలవలస కార్యకర్తను పలకరించిన సీఎం ✦ జలుమూరులో బైక్‌ను ఢీకొన్న వ్యాన్ ✦ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పనులు అడ్డగింత ✦ మంత్రి అచ్చెన్నతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే భేటీ ✦ వసుంధర లేఅవుట్లను సందర్శించిన సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ ✦ పూండి రైల్వే స్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

News July 12, 2024

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే అధికారులు

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా 2 జనరల్ కోచ్‌లు జత చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12704/12703 సికింద్రాబాద్- హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లకు మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12704 ట్రైన్‌ను నవంబర్ 10 నుంచి, 12703 ట్రైన్‌ను నవంబర్ 12 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News July 12, 2024

ఎల్.ఎన్.పేట: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

image

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వెలుగు ఏపీఎం ఎస్ రవిరాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం ఆవరణంలో బంగారు సంతోషి సంస్థలు ఉచితంగా అందించిన మొక్కలను సిబ్బందితో కలిసి ఆయన నాటారు. మొక్కలు నాటడం వలన పర్యావరణానికి మేలు చేకూరుతుందని తెలియజేశారు. వాతావరణంలో కాలుష్యం తగ్గాలంటే మొక్కలు ప్రాధాన్యత ఎంతో ఉందని ఏపీఎం చెప్పారు. ఈయనతో పాటు విజయలక్ష్మి, శంకర్, పాండురంగనాథరాజు పాల్గొన్నారు.

News July 12, 2024

శ్రీకాకుళంలో జాబ్ మేళా.. 31 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూ నిర్వహించగా.. నిరుద్యోగ యువత 170 మంది హాజరయ్యారు. ఇందులో 31 మందిని ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు సుధా తెలిపారు.

News July 12, 2024

రేపు తోటపల్లి పాత ఆయకట్టు నీటి విడుదల

image

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 64 వేల ఎకరాల పాత ఆయకట్టును సస్యశ్యామలం చేస్తున్న తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఈనెల 13న సాగునీరు విడుదల చేయనున్నట్లు జలవనరులశాఖ ఏఈ రాజేశ్ శుక్రవారం తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వీరఘట్టం, పాలకొండ, బూర్జ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, వంగర మండలాలకు సాగునీటిని ప్రణాళికాబద్ధంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

News July 12, 2024

శ్రీకాకుళం: రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లా పూండి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతిచెందాడు. మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించిన స్థానికులు పలాస జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై షరీఫ్ మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 12, 2024

ఆమదాలవలస: IIITకి 13 మంది విద్యార్థుల ఎంపిక

image

ఆముదాలవలస లక్ష్మీ నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఒకే పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎంపిక కావడంతో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల కృషితో ఈ విజయం సాధించినట్లు హెచ్ఎం రామకృష్ణ తెలిపారు.

News July 12, 2024

కందిపప్పు రాయితీ విక్రయ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్ఓ

image

ప్రభుత్వం నిరుపేదలకు నిత్యవసర సరుకులను తక్కువ ధరలకు అందించే విధంగా చర్యలు చేపట్టిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శాంతి శ్రీ తెలిపారు. గురువారం నరసన్నపేట మండల కేంద్రంలోని బజారు వీధిలో ప్రారంభించిన కందిపప్పు రాయితీ విక్రయ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కందిపప్పు బయట దుకాణాలలో రూ.190 వరకు అమ్మకాలు జరుపుతున్నారని, అయితే ఈ విక్రయ కేంద్రాలలో రూ.160కే అందిస్తున్నామన్నారు.