India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ, ప్రైవేటు ITIలో చేరేందుకు ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్ ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటిఐలో నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ సుధాకరరావు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఒక ఏడాది, రెండేళ్ల వ్యవధిగల కోర్సుల అడ్మిషన్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 3 ప్రభుత్వం ఐటిఐల్లో 716 సీట్లు ప్రైవేటు ఐటిఐల్లో 2,892 సీట్లు ఉన్నాయి.
శ్రీకాకుళం ఆర్టీసీ బస్సు ప్రయాణికులు తమ సందేహాలు, ఫిర్యాదులు, అభిప్రాయాలు, సూచనలు, సమాచారానికి APSRTC కాల్ సెంటర్ నంబర్ 149కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు RTC అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కాల్ చేస్తున్నట్లైతే 0866- 149 నంబరుకు డయల్ చేయాలని APSRTC అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా సత్రాగచ్చి- విశాఖపట్నం(నెం.08505) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే పేర్కొంది. ఈ నెల 18, 23, 25, 30 వ తేదీల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు విజయనగరం, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్ తదితర స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
భోగాపురం ఎయిర్‌పోర్టును రికార్డ్ స్థాయిలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు అవమానం జరిగిన చోటే రికార్డు మెజారిటీ సాధించామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు వస్తే అభివృద్ధి జరిగి ఎన్నో కంపెనీలు వస్తాయన్నారు. తప్పు చేసిన వారిని దేవుడు సైతం క్షమించడని వైసీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో MSC గణితం కోర్సు 2వ సెమిస్టర్ (2020- 21 నుంచి అడ్మిట్ అయిన బ్యాచ్‌లు) పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 27 నుంచి ఆగస్టు 1 మధ్య 5 రోజులపాటు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని AU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు AU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
రేపు మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న పార్వతీపురం, అల్లూరి, విజయనగరం జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 18వ తేదీ మంగళవారం నాటి పర్యటన వివరాలను కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. జిల్లా స్థాయి అధికారులతో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 12 గంటల నుంచి కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయం వద్ద ప్రజలకు అందుబాటులో ఉంటారు.
రోడ్డుపై హత్యచేయడానికి యత్ననించిన నిందితుడిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. పట్టణంలోని బలగ హాస్పిటల్ రోడ్డులో ఈనెల 13న నల్లపిల్లి గౌరీశంకర్‌ను మంగలవీధికి చెందిన గిరి కొడవలితో హత్య చేసేందుకు యత్నించగా శంకర్ తప్పించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. పరారీలో ఉన్న గిరిని ఎస్సై పట్టుకున్నారు. నేరం ఒప్పుడకోవడంతో అరెస్టు చేశారు.
వ్యవసాయం, ఆక్వా రంగాల్లో ప్రోత్సాహం, నిరుద్యోగులకు ఉపాధి లేక శ్రీకాకుళం జిల్లా నుంచి 6 లక్షల మందికిపైగా వలస వెళ్లారు. అలా అక్కడే మరణిస్తే కుటుంబ సభ్యులకు చివరిచూపు కూడా దక్కడం లేదు. కేంద్ర, రాష్ట్ర కేబినేట్‌లో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడుకు చోటు లభించడంతో జిల్లా ప్రజలు వీరిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సిక్కోలు వ్యవసాయం, ఆక్వా రంగానికి అనుకూలంగా ఉండటంతో వీటిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
టెక్కలి మండలం జెండాపేట గ్రామం సమీపంలో ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని టెక్కలి పోలీసులు గుర్తించారు. అతని వద్ద లభ్యమైన గుర్తింపు కార్డు ఆధారంగా మృతుడిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన హుమయున్ మియా (37)గా గుర్తించారు. మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.