Srikakulam

News June 17, 2024

శ్రీకాకుళం: విద్యార్థులకు శుభవార్త చెప్పిన కేంద్ర విద్యాశాఖ

image

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని స్వయం పోర్టల్‌లో 9-12 తరగతుల విద్యార్థులకు సైన్స్, గణితం తదితర సబ్జెక్టులలో ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నట్లు NCERT తెలిపింది. ఈ కోర్సులు నేర్చుకునే వారు https://swayam.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 1లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఈ పోర్టల్‌లో కోర్సు పూర్తైన అనంతరం అసెస్‌మెంట్, సర్టిఫికేషన్ ఉంటాయని NCERT స్పష్టం చేసింది.

News June 16, 2024

అచ్చెన్నాయుడికి అభినందనలు: చంద్రబాబు

image

TDP రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యాలయం నుంచి ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రఅధ్యక్షుడిగా పార్టీని నడిపంచడంలో అద్భుత పనితీరు కనబరిచారంటూ కింజరాపు అచ్చెన్నాయుడుకి అభినందనలని చంద్రబాబు ప్రశంసించారు. గత ప్రభుత్వ కాలంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

News June 16, 2024

విజయనగరం పై శ్రీకాకుళం జట్టు విజయం

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి సమీపంలో జరుగుతున్న అంతర్ జిల్లాల అండర్-23 క్రికెట్ పోటీల్లో భాగంగా ఆదివారం శ్రీకాకుళం-విజయనగరం జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం జట్టు 44.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేశారు. 195 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీకాకుళం జట్టు 36 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి విజయం సాధించింది.

News June 16, 2024

కవిటి: హోరాహోరీ మ్యాచ్.. విజేత బోడర్

image

కవిటి మండలం శవసానపుట్టుగలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నేటితో ముగిశాయి. కత్తివరం- బోడర్ మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో బోడర్ జట్టు విజయం సాధించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీపీ అభ్యర్థి ప్రకాశ్.. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రామారావు అన్నారు.

News June 16, 2024

శ్రీకాకుళం: జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు

image

వచ్చేనెల 1వ తేదీ నుంచి దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయని జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ మెట్ట మల్లేశ్వరరావు అన్నారు. జిల్లా కోర్టులో ప్రాసిక్యూషన్ కార్యాలయంలో ఆయన పీపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్షి అధినీయం, భారతీయ నాగరిక సురక్ష సంహిత మొదలైన కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు.

News June 16, 2024

శ్రీకాకుళం: ఫార్మసీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని బీ-ఫార్మసీ నాలుగో ఏడాది 2వ సెమిస్టర్(2017- 18 రెగ్యులేషన్) థియరీ పరీక్షలను జూలై 25 నుంచి నిర్వహించనున్నారు. జూలై 25 నుంచి ఆగస్టు 1 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, ఆగస్టు 3 నుంచి 6వ తేదీ వరకు ప్రాజెక్టు వర్క్ నిర్వహిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థులు సబ్జెక్టువారీగా పరీక్షల షెడ్యూల్ వివరాలకు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

News June 16, 2024

ఈనెల 17న పలు రైళ్ల రద్దు

image

రైల్వే ట్రాక్‌ పై వంతెన మరమ్మతుల కారణంగా ఈ నెల 17న పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి. అలాగే పలాస-విశాఖ-పలాస ప్యాసింజర్ రైళ్లనూ రద్దు చేశారు. ఈ మేరకు వాల్తేరు డీసీఎం సందీప్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

News June 16, 2024

శ్రీకాకుళం: పూరి- ఓఖా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పుల

image

ఖాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే నం.20819,నం.20820 పూరి- ఓఖా ట్రైన్లు ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 23 నుంచి జూలై 3 మధ్య విజయవాడ- విశాఖపట్నం మీదుగా కాక విజయనగరం-రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్‌పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదన్నారు

News June 16, 2024

శ్రీకాకుళం: ఈ నెల 16 నుంచి చేపల వేట ప్రారంభం

image

సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయంలో రెండు నెలల పాటు చేపల వేటను నిషేధించిన సంగతి తెలిసిందే. గడువు ముగియడంతో ఈ నెల 16వ తేదీ నుంచి మళ్లీ సముద్రంలో వేట ప్రారంభించేందుకు శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, ఎచ్చెర్ల మండలాల మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. వలలు, బోట్ల మరమ్మతుల పనుల్లో వారంతా నిమగ్నమయ్యారు.

News June 16, 2024

ఈనెల 17న పలు రైళ్లు రద్దు

image

రైల్వే ట్రాక్ పై వంతెన మరమ్మతులు కారణంగా ఈ నెల 17వ తేదీన పలు రైళ్లు అధికారులు రద్దు చేశారు. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి. అలాగే పలాస-విశాఖ-పలాస ప్యాసింజర్ రైళ్లను కూడా రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ సందర్భంగా వాల్తేరు డీసీఎం సందీప్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.