Srikakulam

News June 15, 2024

శ్రీకాకుళం: చెట్టు విరిగిపడి వ్యక్తి మృతి

image

జి. సిగడాం మండలంలోని పెనసాంలో ఈదురు గాలులకు చెట్టు విరిగిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన గేదెల రమణ (39) పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తుండగా చెట్టు విరిగి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అతనికి భార్య, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. ఎస్సై మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 15, 2024

శ్రీకాకుళం: ప్రారంభమైన పాలిటెక్నిక్ క్లాస్ వర్క్

image

పాలిటెక్నిక్ మొదటి ఏడాది క్లాస్ వర్క్ ప్రారంభమైంది. పాలీసెట్ 2024 సీట్లు అలాట్మెంట్‌ను షెడ్యూల్ మేరకు ప్రకటించారు. మొదటి విడత కౌన్సిలింగ్‌లో సీట్లు లభించిన విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్‌లో కళాశాలలు, బ్రాంచ్‌లు మార్చుకోవచ్చని శ్రీకాకుళం ప్రభుత్వం పాలిటెక్నిక్ ఇన్‌ఛార్జ్ దామోదర్ రావు తెలిపారు.

News June 15, 2024

శ్రీకాకుళం: ఇద్దరిపై ‘పోక్సో’ కేసు నమోదు

image

ఎచ్చెర్ల మండలంలోని తోటపాలెం పంచాయితీ దుప్పలవలసకు చెందిన ఇద్దరిపై శుక్రవారం ఎచ్చెర్ల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తనపై ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఫిర్యాదులో తన తల్లి పేరును కూడా చేర్చడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

News June 15, 2024

SKLM: రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్లను మార్చినట్లు సదరన్ రైల్వే తెలిపింది. ఈ మేరకు బెంగుళూరు కంటోన్మెంట్ – అగర్తల హమ్‌సఫర్ ట్రైన్‌కు నం.12503 బదులు 15673 నెంబరు, అగర్తల- బెంగుళూరు కంటోన్మెంట్ ట్రైన్‌కు 12504 బదులు 15674 నంబరు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ ఈ మేరకు తాజాగా విషయాన్ని వెల్లడించారు.

News June 14, 2024

శ్రీకాకుళం: పలు పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో డిసెంబర్-2023లో జరిగిన బీపీఈడీ, ఎంపీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని ఆంధ్రా యూనివర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై విద్యార్థులు యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/లో చూడొచ్చు.

News June 14, 2024

నాడు కళా వెంకట్రావు.. నేడు అనిత

image

పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు హోంశాఖ కేటాయించి ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఈ ప్రాంతంవారికి హోంశాఖ రావడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో ఎన్టీఆర్ కేబినేట్‌లో చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు హోంమంత్రిగా పనిచేశారు. నాడు ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నేడు రాజాం నియోజకవర్గంలో భాగమైంది.

News June 14, 2024

వంగర: పిడుగుపాటుకు యువకుడి మృతి

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుతో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పొలంలో పశువులు మేపడానికి వెళ్లి వర్షం పడడంతో చెట్ల కింద నిలబడ్డారు. అదే సమయంలో సీతారాం (33) నిలపడిన చెట్టుపై పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. చెట్టుకు కూతవేటు దూరంలో ఉన్న వెంకటనాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

News June 14, 2024

ఆదివారం రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికలు

image

శ్రీకాకుళం నగరం అరసవల్లి కన్నయ్య కాలనీలోని ఆదిత్య ఆర్చరీ అకాడమీలో ఆదివారం రాష్ట్రస్థాయి ఆర్చరీ జట్టు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు శుక్రవారం తెలిపారు. అండర్ 15 బాల, బాలికల విభాగంలో నిర్వహించనున్న ఈ ఎంపికలకు ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫొటోలతో పాటు రూ.300 ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.

News June 14, 2024

జగన్ మళ్లీ ఫేక్ ప్రచారం మొదలెట్టాడు: మంత్రి అచ్చెన్న

image

చంద్రబాబు మంత్రివర్గంలో సొంత సామాజికవర్గానికి చెందిన 15 మందికి అవకాశం కల్పించారని కొన్ని ఛానళ్లలో వస్తున్న కథనాలు పూర్తిగా ఫేక్ అని మంత్రి అచ్చెన్న ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలు వైసీపీని 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసినా జగన్‌కు సిగ్గు రాలేదని ట్విటర్(X) వేదికగా ఫైరయ్యారు. 15 మంది కమ్మ కులానికి చెందిన మంత్రులంటూ మళ్లీ ఫేక్ ప్రచారం మొదలెట్టారంటూ దుయ్యబట్టారు.

News June 14, 2024

శ్రీకాకుళం: ఈ నెల 17న జిల్లాకు రానున్న రాష్ట్ర, కేంద్ర మంత్రులు

image

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఈనెల 17వ తేదీన జిల్లాకు వస్తున్నట్లు ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటనలో తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 4 గంటలకు శ్రీకాకుళం ఆర్చి, డే&నైట్ కూడలి, 7 రోడ్లు జంక్షన్, సూర్యమహల్ జంక్షన్, అరసవల్లి జంక్షన్, 80 అడుగుల రోడ్డులో ఉన్న ఎంపీ కార్యాలయంకి ర్యాలీగా వెళ్తారు. అచ్చెన్నాయుడు సాయంత్రం 5 గంటలకు MP కార్యాలయం నుండి పెద్దపాడు మీదుగా నిమ్మాడ చేరుకుంటారు.