India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖలు కేటాయించారు. కాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఈయన ఒక్కరికే కేబినెట్లో చోటు దక్కిన విషయం తెలిసిందే.
కొత్తూరు మండలం కుంటిభద్రకు చెందిన ఓ యువకుడు చిట్టీల పేరిట రూ.కోటికి పైగా టోపీ పెట్టాడని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు యువకుడు కొందరి నుంచి ప్రతి నెల చిట్టీపాట పేరుతో నగదు తీసుకొని తిరిగి చెల్లించకుండా గత కొన్ని నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. బాధితులు వెళ్లి ఊరి పెద్దల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో బీటెక్(కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్) 4వ ఏడాది విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (2020-21 నుంచి అడ్మిట్ అయిన బ్యాచ్‌లు) స్పెషల్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జూన్ 24 నుంచి 28 మధ్య ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని AU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు AU అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించింది.
ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా సత్రాగచ్చి- చెన్నై సెంట్రల్ (నం.06006) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే(ECOR) తెలిపింది. ఈ ట్రైన్ శనివారం రాత్రి 9.50 గంటలకు పలాస, 11.20కి శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుందని, ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై చేరుకుంటుందని పేర్కొంది. విజయవాడ, గూడూరు, నెల్లూరు, ఒంగోలు తదితర స్టేషన్లలో ఆగుతుందని ECOR తెలిపింది.
శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామపంచాయతీ సర్పంచ్ గోండు శంకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన గోండు శంకర్.. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై గెలుపొందారు. దీంతో గోండు శంకర్ సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని డీపీఓ వెంకటేశ్వరరావుకు అందజేశానని ఆయన తెలిపారు.
సోంపేట మండలం జింకిభద్రకు చెందిన లోకనాథ్(31) నిన్న కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందాడు. చిరంజీవి, నారాయణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు లోకనాథం ఉన్నారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కువైట్‌కు వెళ్లి పనుల్లో చేరాడు. పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో నెల రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 8న బయలుదేరి వెళ్లాడు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
వీరఘట్టం మండలం బూరుగ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాలకృష్ణ(38) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ కృష్ణంనాయుడు గురువారం తెలిపారు. మద్యానికి బానిసైన బాలకృష్ణను భార్యతో పాటు తన తల్లి మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో సుమారు 50 రోజుల సెలవులు అనంతరం గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాలు పాఠశాలలు మొత్తం 3,055 ఉండగా.. వీటిల్లో తొలిరోజు 63.75 శాతం మంది విద్యార్థులు బడులకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 2,57,274 మంది విద్యార్థులు చదువుతుండగా.. తొలి రోజు 1,32,949 మంది హాజరై, 76,330 మంది గైర్హాజరయ్యారని డీఈవో కే.వెంకటేశ్వరరావు వెల్లడించారు.
జాతీయ లోక్ అదాలత్‌ను ఈనెల 29న నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా వెల్లడించారు. జిల్లా కోర్టుతో పాటు ఆముదాలవలస, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, సోంపేట, టెక్కలి, కోటబొమ్మాలి, నరసన్నపేట, కొత్తూరు, పొందూరు, పాలకొండ, రాజాం కోర్టులలోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అసెంబ్లీ స్పీకర్ పదవి రేసులో ఉన్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన తమ్మినేని సీతారామ్‌ను రవి ఓడించారు. చంద్రబాబు కేబినెట్లో శ్రీకాకుళం నుంచి అచ్చెన్నకు చోటు దక్కగా.. స్పీకర్ పదవి సైతం జిల్లా నేతకు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పీకర్ పదవికి రవితో పాటు అయ్యన్న, కళా వెంకట్రావు, తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.