India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా (జీరో వయలెన్స్.. నో రీపోల్), పూర్తి స్వేచ్ఛగా, సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సమూన్ అన్నారు. శనివారం ఆయన మందస, పలాస, నందిగాం మండలాల్లో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
బొడ్డపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పోతనపల్లి సరోజవర్మ విధుల నుంచి తప్పించినట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సంచాలకులు జి.వి.చిట్టి రాజు తెలిపారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పలాస రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో భరత్ నాయక్ ఉల్లంఘించినట్లు స్పష్టం చేశారు. దీంతో అతని విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు.
కోటబొమ్మాళి మండల కేంద్రం స్టేట్ బ్యాంకు సమీపంలో పలాసకు చెందిన బతకల పార్వతి(45) శనివారం ఆటోనుంచి జారిపడి మృతి చెందింది. రెండు రోజుల క్రితం కోటబొమ్మాళి వంట పనులకు వచ్చి తిరిగి వెళుతుండగా ఆటోలో నుంచి జారిపడి తలకు దెబ్బ తగిలింది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కోటబొమ్మాళి ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో శనివారం పలువురు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గొండు శంకర్, కూన రవికుమార్, గౌతు శిరీష, బెందాళం అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్స్, తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జి.ఆర్ రాధిక హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన జారీ చేశారు. అలాంటి వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచామని, అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి, చీపురుపల్లి సమీపంలో ఘోర ఘటన జరిగింది. ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి చెందగా.. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. జీడి తోటలో పనులకు వెళ్లిన సీహెచ్.లోకనాథం, అప్పికొండ కుమార్ అనే రైతులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 1952 నుంచి 2019 వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం ఎంపీగా కె.రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. ఈసారి కూడా కూటమి కె.రామ్మోహన్ నాయుడుకే టికెట్ కేటాయించింది. అటు వైసీపీ నుంచి పేరాడ తిలక్‌ను జగన్ బరిలో దింపారు. వైసీపీని ఓడించి కె.రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ కొడతారా..? కామెంట్ చేయండి.
నరసన్నపేటలోని మారుతీనగర్‌కు చెందిన ఉదండ్రావు వెంకట భాస్కరరావు(70) భార్య కృష్ణవేణితో కలిసి శుక్రవారం అరసవల్లి ఆలయానికి వచ్చారు. సెల్‌ఫోన్ డిపాజిట్ చేసి స్వామి దర్శనానికి క్యూలైనులోకి వెళ్లగా.. గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. ఆ వాహనం వచ్చేలోగా ఆర్ఎంపీ వైద్యుడిని పిలిచి చూపించగా.. అప్పటికే భాస్కరరావు మృతి చెందినట్లు తెలిపారు.
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల ప్రచారాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ శుక్రవారం వెల్లడించారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న సమావేశాలకు, లౌడ్‌స్పీకర్లకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. అభ్యర్థులు ఒక వాహనానికి నియోజకవర్గంలో తిరగడానికి తీసుకున్న అనుమతి ఆ నియోజకవర్గంలో మాత్రమే ఆ వాహనాన్ని వినియోగించాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. మొత్తం 29,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,358 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 1036 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.