India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ మూడు జాబితాల్లో గొండు శంకర్-శ్రీకాకుళం, కింజారపు అచ్చెన్నాయుడు-టెక్కలి, బెందాళం అశోక్ కుమార్-ఇచ్ఛాపురం, కూన రవికుమార్-ఆమదాలవలస, బగ్గు రమణమూర్తి-నరసస్నపేట, కొండ్రు మురళీ మోహన్- రాజాం, పలాస-గౌతు శిరీషాను ఖరారు చేసింది. అయితే పాతపట్నం నుంచి మాజీ ఎమ్మెల్యే కలమట, మామిడి గోవింద రావుకు మధ్య పోటీ జరగగా గోవింద వైపు అధిష్ఠానం మొగ్గు చూపింది. ఎచ్చెర్ల, పాలకొండ అభ్యర్థులు ఎవరో తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం నియోజకవర్గానికి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గొండు శంకర్‌ను టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో ఆయన ఇంటి వద్ద సంబరాలు జరుపుకోగా.. ఈ రోజు వరకు టికెట్ వారికే వస్తుందని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆమె వర్గం ఆశతో ఉండగా ఆ ఆశలన్నీ ఒక్కసారిగా నీరుగారిపోయాయి. దీనిపై గుండ కుటుంబం, ఆమె సామాజిక వర్గం తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది.
TDP మూడో అభ్యర్థుల జాబితాలో.. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం MLA అభ్యర్థిగా గొండు శంకర్, పాతపట్నం నుంచి మామిడి గోవింద్ కుమార్, పలాస నుంచి గౌతు శిరీషా ఖరారయ్యారు. కాగా శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్, MLA అభ్యర్థిగా వైసీపీ ధర్మాన ప్రసాద్ ఉన్నారు. పాతపట్నంలో రెడ్డి శాంతి, పలాసలో సిదిరి అప్పలరాజు బరిలో ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఐదుగురు పోలీసులకు ఉగాది పురస్కారాలు దక్కాయి. అందులో గార మండలం కళింగపట్నం పోస్టల్ సెక్యూరిటీ విభాగం ఏఎస్ఐ జైమోహన్ రావు ఉత్తమ సేవా పతకం వరించింది. హెచ్ సీ ఏఆర్ ఎచ్చెర్ల నుంచి సద్గుణ మూర్తి, జి.రాజశేఖర్ ( అగ్నిమాపక శాఖ సిబ్బంది, విశాఖ), పీవీ రమణ ( ఏఎస్ఐ ఎచ్చెర్ల పీఎస్), సీహెచ్ పాపారావు ( కానిస్టేబుల్ కొత్తూరు పీఎస్) సేవా పతకాలు పొందారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలో 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా TDP ఆరుసార్లు గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ధర్మానప్రసాద్ రావు.. టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై విజయం సాధించారు. ఈసారి YCP తరఫున ధర్మానకే టిక్కెట్ ప్రకటించారు. పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. ఉమ్మడి అభ్యర్థిగా ఎవరుంటే ధర్మానకు పోటీగా నిలిస్తారని మీరు భావిస్తున్నారు?
చెక్‌పోస్టుల వద్ద పటిష్ఠమైన నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అమ్మకాలు, ఎక్కడైనా ఎక్కువ మోతాదులో నిల్వ చేసిన అక్రమ మద్యం, అక్రమ మద్యం రవాణా, ఎక్సైజ్, సెబ్ కలసి నివారణ చర్యలుపై గురువారం సమీక్షించారు. షాపులు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. షాపుల్లో రోజు వారీ రిజిస్టర్లు మెంటైన్ చేయాలన్నారు
సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా ఎన్నికల అధికారులకు జిల్లా స్థాయి ముఖ్య శిక్షణ బృందం అధికారులు ఎం.కిరణ్ కుమార్, బాలాజీ నాయక్, శేషగిరిలు కలిసి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్స్ మిషన్ వినియోగంపై అవగాహన కల్పించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. పోలింగ్ ప్రారంభానికి ముందు తప్పనిసరిగా ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు.
మండలంలోని భోగాపురం పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ అగ్గున్న దేవేంద్రను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సంచాలకుడు జివి.చిట్టిరాజు గురువారం తెలిపారు. దేవేంద్ర రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పలాస రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో భరత్ నాయక్ దాన్ని ధ్రువీకరించారు. దీంతో దేవేంద్రను సస్పెండ్ చేశారు.
రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఒడిశా చెక్‌పోస్టు వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జీలాని సమూన్ అన్నారు. మెలియాపుట్టి మండలం వసుంధర గ్రామం వద్ద ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర సరిహద్దును గురువారం కలెక్టర్ పరిశీలించారు. సరిహద్దుపై నిఘా నిరంతరం ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై మండల స్థాయి అధికారులతో సమీక్ష చేశారు. ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు.
కోటబొమ్మాళి మండలం విశ్వనాధపురం గ్రామంలోని ఓ కొండ సమీపంలో గురువారం గుర్తుతెలియని అస్థిపంజరం గ్రామస్థుల కంటపడింది. దీంతో గ్రామస్థులు స్థానిక వీఆర్వో పైల దాలప్పకు సమాచారం ఇవ్వటంతో ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దీంతో గ్రామస్థులు భయాందోళనలు గురయ్యారు.
Sorry, no posts matched your criteria.