India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 28982 మంది ప్రైవేటు విద్యార్థులు 1592 మంది హాజరు కానున్నట్లు చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, ఇచ్చాపురం కోటబొమ్మాలి, నరసన్నపేట పాలకొండ, పలాస, పాతపట్నం రాజాం, సోంపేట, టెక్కలి, కొత్తూరు పొందూరు కోర్టులలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ మొత్తం 1782 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేసినందుకు అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జీలాని సమూన్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికలు నిభందనలు అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జిల్లాలో 18,63520 మంది ఓటర్లు ఉండగా వారిలో 9,23,498 మంది పురుషులు, 9,39,891 స్త్రీల ఓటర్లు ఉన్నారని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. 131 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని 2357 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయన్నారు. ఓటర్లకు ఆయా పోలింగ్ కేంద్రాలలో పలు సౌకర్యాలు సమకూర్చామన్నారు.
సాధారణ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినందున నేటి నుంచి నూతన కలెక్టర్ కార్యాలయం స్పందన భవనంలో కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ విభాగం, సోషల్ మీడియా విభాగము, ఫిర్యాదుల పరిశీలన విభాగం, 24X7 ఫిర్యాదులు స్వీకరణ విభాగానికి టోల్ ఫ్రీ నెంబర్ 18004256625 ఏర్పాటు చేశారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. ఒడిశా సరిహద్దు వెంబడి దాదాపు 112 కి.మీ మేర శ్రీకాకుళం జిల్లా ఉందని, ఇరు రాష్ట్రాల మధ్య జిల్లా వెంబడి 52 రహదారుల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయని వీటిలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇవి కాకుండా నిరంతరం పెట్రోలింగ్ బృందాలు తిరుగుతున్నాయని అన్నారు.
కాసేపట్లో YCP ఎమ్మెల్యే, MP అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇడుపులపాయలో సీఎం జగన్ సమక్షంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ నందిగం సురేశ్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ వీళ్లిద్దరే అభ్యర్థులను ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. దీన్ని, సెంటిమెంట్‌గా భావిస్తున్న వైసీపీ మరోసారి వీరితోనే అభ్యర్థులను ప్రకటించనుంది.
Sorry, no posts matched your criteria.