India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం ఎంపీగా గెలుపొందిన కలిశెట్టి అప్పలనాయుడు డబుల్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇంతవరకు ఇక్కడ MPలుగా గెలిచిన వారెవరికీ రాని మెజార్టీ అప్పలనాయుడు సాధించడం ఒకటి కాగా, శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం MPగా ఎన్నికైన తొలి నాయకుడిగా రికార్డు సృష్టించారు. అప్పలనాయుడు YCP ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మీద 2,38,216 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే.
ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుతో కలిసి ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఫోటో దిగారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం పార్లమెంటు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ నేత, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.
జిల్లా పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో(ఐటిఐ) ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటిఐ, జిల్లా ప్రవేశాల కన్వీనర్ ఎల్.సుధాకర్‌రావు శుక్రవారం తెలిపారు. జిల్లాలో 3816సీట్లు ఉండగా, 2107మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 752మంది మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారన్నారు. మిగిలిన1355 మంది ఈనెల10వ తేదీలోగా హాజరుకావాలి.
పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన పాలీసెట్ -2024 కౌన్సిలింగ్‌కు మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు 2,307 మంది హాజరయ్యారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో 1,08,001 నుంచి చివరి ర్యాంకు వరకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన గురువారం నిర్వహించగా, 256 మంది హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీలు 181, ఎస్సీ ఎస్టీలు 75 మంది ఉన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి.దామోదర్ రావు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మూగి యర్రయ్య (55) శుక్రవారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎర్రయ్య తన సహచరులతో వేటకు వెళ్లిన కొద్దిసేపటికి పడవ అదుపుతప్పి నడి సముద్రంలో బోల్తా పడింది. మత్స్యకారులు ఈదుకుంటూ బోల్తా పడిన తెప్ప పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోగా ఎర్రయ్యకు గాయాలు కావడంతో నీటిలో మునిగి మృతి చెందాడు.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు అనురాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన 60 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు శ్రీకాకుళంలో 80 అడుగుల రోడ్డులో గల స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలని సూచించారు.
టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇద్దరూ టెక్కలి నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. కాగా ఇద్దరూ బాబాయి-అబ్బాయిలు కావడం మరో విశేషం. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడు కింజరాపు అచ్చెన్నాయుడు కాగా, కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఇరువురు టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ గ్రామానికి చెందినవారు.
డా.బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఐదో సెమిస్టర్ ఫలితాలను డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల్లో 10,822 మంది విద్యార్థులకు 5,316 మంది ఉత్తీర్ణత (49.12శాతం) సాధించారని తెలిపారు. పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్ సైట్‌లో పొందుపరిచామని, పునఃమూల్యాంకనం కొరకు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ గురువారంతో ముగిసింది. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాదాపు 50 రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో జిల్లా ఎస్పీ రాధిక, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆధ్వర్యంలో ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ముగియనున్న నేపథ్యంలో అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగనున్నాయి.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో రెండేళ్ల బీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జూలై 31 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని AU పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
Sorry, no posts matched your criteria.