India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో జరగుతున్న సార్వత్రిక ఎన్నికల ఓట్లు కౌంటింగ్ సరళిని మంగళవారం మధ్యాహ్నం విశాఖ రేంజ్ DIG విశాల్ గున్ని సందర్శించారు. అనంతరం బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించి, కౌంటింగ్ జరగుతున్న తీరుపై అధికారులును అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నందు ఆయన పర్యవేక్షించారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేసిన అభ్యర్థులలో కూటమి నాయకులు మంగళవారం జరుగుతున్న ఓట్లు లెక్కింపులో ప్రతి రౌండ్‌లో కూడా స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆమదాలవలస.. కూన రవికుమార్, టెక్కలి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం బి అశోక్, పలాస, శిరీష, పాతపట్నం.ఎం గోవిందరావు, శ్రీకాకుళం.. గొండు శంకర్, నరసన్నపేట.. బి రమణమూర్తి, రాజాం..కే మురళీమోహన్ ఆధిపత్యంలో ఉన్నారు.
ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో జరగుతున్న సార్వత్రిక ఎన్నికల ఓట్లు కౌంటింగ్ సరళిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక మంగళవారం ఉదయం స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల లోపల, పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ప్రతి పాయింట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేశారు.
శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీలో ఉన్నారు. 3వ రౌండ్‌లో రామ్మోహన్‌కు 17,824 ఓట్లు పోలవ్వగా.. పేరాడ తిలక్‌కి 9584 ఓట్లు పడ్డాయి. దీంతో రామ్మోహన్ 8240 మెజార్టీ పొందారు.
శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీలో ఉన్నారు. 1వ రౌండ్‌లో రామ్మోహన్‌కు 6138 ఓట్లు పోలవ్వగా.. పేరాడ తిలక్‌కి 3495 ఓట్లు పడ్డాయి. దీంతో రామ్మోహన్ 2643 మెజార్టీ పొందారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీలో ఉన్నారు. 1వ రౌండ్‌లో రామ్మోహన్‌కు 5377 ఓట్లు పోలవ్వగా.. పేరాడ తిలక్‌కి 3516 ఓట్లు పడ్డాయి. దీంతో రామ్మోహన్ 1861 మెజార్టీ పొందారు.
ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఆమదాలవలస నియోజకవర్గం నుంచి తొలి ఫలితం, చివరగా పాతపట్నం ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. జిల్లాలో కౌంటింగ్ కోసం 17 కౌంటింగ్ హాళ్లు, 112 ఈవీఎంలను లెక్కించే టేబుళ్ళు, 30 పోస్టల్ బ్యాలెట్ లెక్కించే టేబుళ్లు ఉన్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కాగా, అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది.
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు మొత్తం 49,176 గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక పోస్టల్ బ్యాలెట్లు నమోదైన జిల్లాగా సిక్కోలు పేరు నమోదు చేసుకుంది. మరో అరగంటలో ప్రారంభంకానున్న కౌంటింగ్ ప్రక్రియకు మొత్తం 1996 మంది శ్రమించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా జిల్లా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు.
సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు మరికొద్ది సేపట్లో తెలియనున్నాయి. ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు 9 మంది రిటర్నింగ్ అధికారులు, 77 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 492 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 582 మంది కౌంటింగ్ అసిస్టెంట్‌లు, 397మంది మైక్రో అబ్జర్వర్లు, 439 మంది క్లాస్-4 ఉద్యోగులు మొత్తం 1996 మంది సిబ్బంది ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశారు. శ్రీకాకుళం 8 నియోజకవర్గాలో మొత్తం 86 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్నారు. ఇచ్ఛాపురం అసెంబ్లీకి 9 మంది, పలాస-10, టెక్కలి-7, పాతపట్నం-10, శ్రీకాకుళం-7, ఆమదాలవలస-13, ఎచ్చెర్ల-10 నరసన్నపేట-7 మంది పోటీ చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి 13 మంది నిలిచారు. తొలుత ఆమదాలవలస, చివరగా పాతపట్నం ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.