India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండలంలోని సంగమేశ్వర కొండ సమీపంలో ఉన్న గాజుల కొల్లివలస గ్రామానికి చెందిన గేదెల హరికృష్ణ అనే సైకత శిల్పి ఎవరిది సింహాసనం అనే సైకత శిల్పం పలువురుని ఆకట్టుకుంది. దేశం పాటు రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఫలితాల సందర్భంగా మోదీ, రాహుల్ గాంధీ, రాష్ట్రానికి సంబంధించి వైఎస్ జగన్, చంద్రబాబు రూపాలతో మధ్యలో సింహాసనం కుర్చీ ఆకారంలో రూపొందించిన సైకిత సందర్శకులను ఆకర్షించింది.
రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఈసీకి తాజాగా లేఖ రాశారు. కొందరు గుత్తేదారుల బిల్లుల చెల్లింపునకు ఇష్టానుసారం ప్రభుత్వం అప్పులు చేస్తోందని అచ్చెన్న లేఖలో పేర్కొన్నారు. సీఈసీ జోక్యం చేసుకుని అప్పులు, చెల్లింపులు లేకుండా చూడాలని, సంబంధిత అధికారులపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 1459 మంది పోలీసు సిబ్బందిని ఈ బందోబస్తులో వినియోగిస్తున్నారు. జిల్లా పోలీసులతో పాటు ఆర్మడ్ రిజర్వు, ఏపీఎస్పీ, కేంద్ర బలగాలను ఎక్కడికక్కడా మోహరించారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది. కౌంటింగ్ ఏజెంట్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేసిన తర్వాతనే లోపలకి అనుమతించనున్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-7, YCP-3 స్థానాలో గెలుస్తుందని తెలిపారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, రాజాం స్థానాల్లో TDP పాగా వేస్తుందని, ఎచ్చెర్ల, నరసన్నపేట, పాలకొండ YCP గెలిచే అవకాశం ఉందన్నారు. రేపు కౌటింగ్ సదర్భంగా అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోని పలు డివిజన్లలో భద్రతా పనులు జరుగుతున్నందున అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే ట్రైన్ నం.18525 బ్రహ్మపూర్- విశాఖపట్నం ట్రైన్‌ను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఈ అంశాన్ని గమనించాలని ఆయన కోరారు.
వీరఘట్టం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం రాత్రి పడిన భారీ పిడుగులకు పిడుగులకు భారీ సంఖ్యలో పక్షులు మృత్యువాత పడ్డాయి. సుమారు 60 రామచిలుకలు, 48 కాకులు, 5 గద్దలు మృతి చెందాయి. మృతి చెందిన పక్షులన్నింటినీ పోలీస్ సిబ్బంది సమీపంలో ఖననం చేశారు. పిడుగుపాటుకు పోలీస్ క్వార్టర్స్‌తో పాటు పోలీస్ స్టేషన్లోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
జిల్లాలో పాలీసెట్ 2024 అభ్యర్థుల కౌన్సెులింగ్‌కు స్వల్ప విరామం ప్రకటించినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ జి.దామోదరరావు తెలిపారు. ఆదివారం 92,001 నుంచి 1,08,000 ర్యాంకు మధ్య విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌంటింగ్ నేపథ్యంలో సోమవారం నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను 6వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. 6వ తేదీన 1,08,001 నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు హాజరు కానున్నారు.
వజ్రపుకొత్తూరు మండలం అక్కపల్లి శివసాగర్ తీరంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం మిరాజ్ సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. కేఎంసీ ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత కే.సత్యభాస్కర్ నిర్మిస్తున్న ఆ చిత్రానికి విష్ణుదేవ్ దర్శకత్వం వహించనున్నారు. వారు మాట్లాడుతూ.. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న శివసాగర్ తీరంలో మొదటి సినిమా చిత్రీకరణ చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఎన్నికల అంకం తుది దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నేతల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌తో నేతలతో పాటు బెట్టింగ్ రాయుళ్లలోను తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కౌంటింగ్‌కు చిలకపాలెం సమీపంలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మనజీర్ జీలానీ సామూన్ తెలిపారు. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ పోటీల్లో ఆదివారం విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లా జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు 97 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేశారు. తదుపరి బ్యాటింగ్ చేసిన తూ.గో జట్టు 45.5 ఓవర్లకు 182 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో విశాఖ జట్టు విజయం సాధించింది.
Sorry, no posts matched your criteria.