Srikakulam

News June 27, 2024

కవిటి: కేరళలో కరాపాడు వలస కూలీ మృతి

image

కవిటి మండలం జి.కరాపాడ గ్రామానికి చెందిన నర్తు కాళీప్రసాద్ మృతి చెందారు. మృతుడు 4 రోజుల క్రితం కేరళ రాష్ట్రానికి వలస కూలీగా వెళ్లి గురువారం ఉదయం తాను పనిచేస్తున్న చోట పైనుంచి జారిపడి తలకు బలమైన గాయమవ్వడంతో మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు. కాళీప్రసాద్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైందని, ఇంతలోనే ఇలా జరిగే సరికి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

News June 27, 2024

శ్రీకాకుళం: ప్రత్యేక రైళ్లను పొడిగించిన రైల్వే అధికారులు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా న్యూ టిన్‌సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జూలై 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి మంగళవారం, నం.05951 SMVB- NTSK రైలును జూలై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News June 27, 2024

శ్రీకాకుళం: పీజీ పరీక్షలు రాసిన వారికి ముఖ్య గమనిక

image

ఆంధ్ర యూనివర్శిటీ పరిధిలో మే- 2024లో నిర్వహించిన MSC (హోమ్ సైన్స్)నాలుగవ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 27, 2024

శ్రీకాకుళం: ఉపాధి హామీ నిధులు ఉద్యాన పంటలకు అనుసంధానం

image

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన పంటలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి నిధులను ఉద్యాన పంటలకు అనుసంధానం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తొలి సంతకం చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 46,743 ఎకరాల్లో ఉద్యానవన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 24,753 ఎకరాల్లో జీడి, 5,315 ఎకరాల్లో మామిడి, 16,675 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయలు వంటివి పండిస్తున్నారు.

News June 27, 2024

మరో 48 గంటల పాటు శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు

image

ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 48 గంటలు వరకూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గురువారం సాయంత్రం, రాత్రివేళ వర్షాలు జోరందుకోనున్నాయి. ఈ వర్షాలు ఖరీఫ్ పనులకు ఉపకరిస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉంది.

News June 27, 2024

సోంపేట: ఆ కుటుంబంలో అందరూ డాక్టర్లే

image

సోంపేట మండలం కర్రివానిపాలెం గ్రామానికి చెందిన కర్రి కృష్ణమూర్తి, తులసీ దంపతులకు 3 కుమార్తెలు, 2 కుమారులు. వీరందరూ డాక్టర్లు కావడం విశేషం. వృత్తి రీత్యా కృష్ణమూర్తి కుటుంబం ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో స్థిరపడింది. పెద్ద కుమార్తె సుప్రియ, 2వ కుమార్తె సోనాల్, 3వ కుమార్తె స్తుతి MBBS పూర్తిచేశారు. పెద్దకుమారుడు శుభమ్ 3వ సంవత్సరం, చిన్నకుమారుడు శివమ్ కూడా అదే కోర్స్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.

News June 27, 2024

శ్రీకాకుళం: మంత్రి ఆదేశాలు..వచ్చే డిసెంబర్‌కు పూర్తి

image

జిల్లాలోని సాగుకు నీరు అందించే ప్రధాన కాలువల పూడిక తీయకపోవడంతో నీరు అందకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు వ్యయసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రిని కలిసి పరిస్థితిని వివరించారు. మంత్రి అచ్చెన్న ఆదేశాలతో డిసెంబర్ చివరి నాటికి జిల్లాలోని కాలువలో సాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతామని అధికారులు పేర్కొనారు.

News June 27, 2024

శ్రీకాకుళం: ఇంటర్ సప్లమెంటరీలో 42.84 శాతం ఉత్తీర్ణత

image

ఇంటర్మీడియట్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ జనరల్ కోర్సుల విభాగం నుంచి 7,113 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 3,047 మంది ఉత్తీర్ణులై 42.84 శాతం ఫలితాలు సాధించారు. ఒకేషనల్ విభాగంలో 341 మంది పరీక్షలు హాజరై 174 మంది ఉత్తీర్ణులై 51.03 శాతం ఫలితాలు సాధించారని అధికారలు తెలిపారు.

News June 27, 2024

జలుమూరులో 20 తులాల బంగారు చోరీ

image

జలుమూరు మండలంలోని నగరి కటకంలో జరిగిన చోరీలో 20 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురి అయ్యాయని బాధితుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలకు వెళితే స్థానికంగా ఉన్న రేజేటి శ్రీనివాసరావు తన కుమారుడు హైదరాబాదులో అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో కుటుంబ సభ్యులు కలిసి వెళ్లాడు. తిరిగి బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చేసేసరికి చోరీ జరిగినట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 27, 2024

పది అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో శ్రీకాకుళం 19వ స్థానం

image

కాసేపటి క్రితం పది అడ్వాన్స్‌డ్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీకాకుళం బాలబాలికలు 2,218 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,338 మంది పాసయ్యారు. మొత్తం 60.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో శ్రీకాకుళం 19వ స్థానం కైవసం చేసుకుంది.