India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిబంధనలు పాటించకుంటే ‘భరత్ అనే నేను’ మూవీలో ఫైన్స్ ఎంత కఠినంగా ఉన్నాయో మనం చూశాం. ఇకపై మన శ్రీకాకుళంలోనూ అదే జరగనుంది. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నట్లు రాజాం CI మోహన్ రావు తెలిపారు. ఓవర్ స్పీడ్‌తో పట్టుబడితే రూ.1000-రూ.2000, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్-రూ.500, మైనర్లు వాహనం నడిపితే రూ.25వేల ఫైన్‌తో పాటు మైనర్‌కు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే ఛాన్స్ ఉండదన్నారు.
ఎచ్చెర్లలోని శ్రీశివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 2కి.మీ పరిధి వరకు రెడ్ జోన్ అమలు చేస్తున్నట్లు SP రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 8 అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి సంబంధించి వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. రెడ్ జోన్ అమలు చేస్తున్న నేపథ్యంలో డ్రోన్లు, బెలూన్లు ఎగరవేయడం నిషేధించినట్లు చెప్పారు. నిబంధనలు అతిక్రమించరాదన్నారు.
ఏపీ ఈసెట్ ఫలితాల్లో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆమదాలవలస మండలం శ్రీహరిపురానికి చెందిన కూన జ్యోత్స్న 8వ ర్యాంకు (బ్రాంచ్ ర్యాంక్), ఇంటిగ్రేటెడ్ ర్యాంక్-826 సొంతం చేసుకుంది. ఈ విద్యార్థిని 200 మార్కులకు గాను 105 మార్కులు సాధించింది. 10వ తరగతి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదవగా.. డిప్లొమా అనకాపల్లిలో పూర్తి చేసింది. మంచి ర్యాంక్ రావడంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
2019లో శ్రీకాకుళం MP అభ్యర్థిగా YCP నుంచి బరిలో దిగిన దువ్వాడ శ్రీనివాస్ తాజా ఎన్నికల్లో టెక్కలి నుంచి అచ్చెన్నపై పోటీ చేస్తున్నారు. అటు టెక్కలిలో 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్.. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. 2019లో పరాజయం పాలైన వీరిద్దరికి వైసీపీ అధిష్ఠానం మరలా టికెట్ ఇచ్చింది. స్థానాల మార్పు వైసీపీకి ఇక్కడ విజయం అందిస్తుందా..? దీనిపై మీ కామెంట్?
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పెనసాం గ్రామానికి చెందిన వివాహిత బెవర మేరీ సలోమి(22) గురువారం ఉరివేసుకొని మృతి చెందింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన సలోమికి, పెనసాంకు చెందిన జగదీశ్‌తో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కుమార్తె. సలోమి ఉరివేసుకొని ఉన్నట్లు సమాచారం అందడంతో SI మధుసూదనరావు వెళ్లి పరిశీలించారు. ఆమె తల్లిదండ్రులు విజయవాడలో ఉండటంతో ఫిర్యాదు అందాల్సి ఉందన్నారు.
శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే ట్రైన్ నంబర్ 12513 సికింద్రాబాద్- సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను జూన్ 1న రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ రైలు ప్రయాణించే మార్గంలో ట్రాక్ సస్పెన్షన్ కారణంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండలోగాం పంచాయతీ పరిధి రామరాయి సమీప పొలాల్లో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక గిరిజనులు గుర్తించారు. అనంతరం మందస పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే మందస పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
జిల్లా ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు జిల్లాలో శుక్రవారం, శనివారం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఆ రెండు రోజుల పాటు జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని తేలికపాటి మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీనితో 30 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను నమోదవుతాయని APSDMA తెలిపింది.
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా గ్రూప్స్‌లో ఉద్దేశపూర్వకంగా కుల, మత, రాజకీయ పార్టీలను, వ్యక్తులను రెచ్చగొట్టేలా పోస్టులు, అవాస్తవాలు షేర్ చేయకూడదన్నారు. అలా ఎవరైనా చేస్తే అడ్మిన్స్‌తో పాటు ఆ సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
సార్వత్రిక ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజినీరింగ్‌లో జూన్ 4వ తేదిన స్ట్రాంగ్ రూముల చుట్టు పక్కల పరిసర ప్రాంతాల నుంచి 2 KM వరకు రెడ్ జోన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ జి.ఆర్.రాధిక గురువారం తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద జరగనున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.