Srikakulam

News May 29, 2024

పలాస: విశాఖ-పలాస రైళ్లు రద్దు

image

పలాస-విశాఖ-పలాస పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈనెల 31న పలాస నుంచి విశాఖ వెళ్లే పాసింజర్ రైలును, విశాఖ నుంచి పలాస వచ్చే పాసింజర్ రైలును రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News May 29, 2024

పలాస: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

image

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి రైల్వే గేట్ సమీప జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, వెనుక నుంచి గుర్తు తెలియని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని ఓ ప్రైవేట్ వాహనంలో పలాస ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును వెతికే పనిలో ఉన్నారు.

News May 29, 2024

శ్రీకాకుళం: ఓట్లు లెక్కింపు ప్రక్రియపై శిక్షణ

image

జూన్ 4వ తేదీన జరుగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓట్లు లెక్కింపు ప్రక్రియపై సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇచ్చారు . పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్లు ఓట్లు లెక్కింపు ఎలా చేయాలన్న దానిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి మాక్ డ్రిల్ జూన్ 3వ తేదీన ఉంటుందని తెలిపారు.

News May 29, 2024

శ్రీకాకుళం: ప్రజానీకానికి SP రాధిక కీలక హెచ్చరికలు

image

జూన్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రానుందని జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. ఈ మేరకు ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చట్ట ప్రకారం మైనర్లు వాహనాలు నడిపితే రూ.25,000 జరిమానా, మద్యం సేవించి వాహనాన్ని నడిపితే 6 నెలల జైలు, రూ.10,000 ఫైన్ విధిస్తామన్నారు. మైనర్లయిన పిల్లలకు వాహనాలను ఇస్తే కొత్త నిబంధనలు మేరకు తల్లిదండ్రులకు శిక్ష తప్పదని, ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.

News May 29, 2024

మరో 6 రోజులే.. శ్రీకాకుళంలో ఆధిపత్యం ఎవరిది.?

image

సార్వత్రిక ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 6 రోజులే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 8 అసెంబ్లీ, టీడీపీ 1 MP, 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోన్నాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 29, 2024

శ్రీకాకుళం: ఇటీవల ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లు ఇవే

image

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లు గణనీయంగా పెరుగుతూ వస్తుంది.నియోజకవర్గం 2014 – 2019 ఇచ్ఛాపురం 845 – 3,880 పలాస 728 – 3,044 టెక్కలి 871 – 2,935 పాతపట్నం 998 – 4,217 శ్రీకాకుళం 875 – 3,082 ఆమదాలవలస 586 – 2,656 ఎచ్చెర్ల 854 – 4,628 నరసన్నపేట 819 – 3,491 మొత్తం 6,576 – 27,993.

News May 29, 2024

సారవకోట: గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

సారవకోట మండలం అన్నుపురం గ్రామానికి చెందిన యడ్ల పోలీసు(65) డాబా పై నుంచి జారిపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసు ఈ నెల 23న రాత్రి భోజనం చేసి డాబాపై నిద్రించాడు. మూత్ర విసర్జనకు కిందకు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో కేజీహెచ్‌కు తరలించగా వైద్య సహాయం పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News May 29, 2024

పోలాకి: వేట నిషేధకాలంలో భృతి నిధులు విడుదల

image

సముద్ర తీర గ్రామాల్లోని మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ఇవ్వవలసిన భృతి నిధులు మంజూరు అయ్యాయని పోలాకి మత్స్యశాఖ విస్తరణ అధికారి డా. ఢిల్లేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వేట నిషేధకాలం 61 రోజులు పాటు వేటకు వెళ్లని వారికి పరిహారంగా ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేలు వంతున రూ.1.47 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ఓట్లులెక్కింపు అనంతరం మత్స్యకారులకు వారి బ్యాంకు ఖాతాలో నిధులు జమచేస్తామన్నారు.

News May 29, 2024

ఎచ్చెర్ల: కొనసాగుతున్న పాలిటెక్నిక్ కౌన్సిలింగ్

image

పాలిసెట్-2024 కౌన్సిలింగ్ 12001నుంచి 27000మధ్య ర్యాంకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరీశీలించారు. పరీశీలనకు 372 మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారం 27001నుంచి 43000ర్యాంకు మధ్య ధ్రువీకరణ పత్రాలు పరీశీలించనున్నారు. కౌన్సిలింగ్ 27న ప్రారంభించగా, ఇప్పటి వరకు 615 మంది హాజరయ్యారు. కౌన్సిలింగ్ జూన్ 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఈనెల 31నుంచి జూన్ 4వ తేదీ వరకు కళాశాలలు, బ్రాంచ్‌ల ఆప్షన్ల ఎంచుకోవాలి.

News May 29, 2024

పలాస గెలుపుపై ఒడిశాలో బెట్టింగులు?

image

జిల్లాలో పలాస నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం గురించి ఒడిశాలో కూడా బెట్టింగులు జోరందుకున్నాయి. పలాసలో వైసీపీ నుంచి సీదిరి అప్పలరాజు, కూటమి నుంచి గౌతు శీరిష బరిలో ఉన్నారు. గత ఎన్నికలో సీదిరి 16,000 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో 73.35శాతం ఓటింగ్ నమోదవ్వగా, ఈసారి 76.42శాతం నమోదైంది. పెరిగిన 3శాతం పోలింగ్ ఎవరికి కలిసివస్తుందో జూన్4 వరకు వేచి చూడాల్సిందే.

error: Content is protected !!