India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికి సమయం దగ్గర పడుతోంది. ఇందులో భాగంగా నిబంధన ప్రకారం తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గం లెక్కింపు ముందుగా చేపట్టాలి. అతి తక్కువ పోలింగ్ కేంద్రాల 259 ఉన్న ఆమదాలవలసలో ఈవీఎంలను తెరిచి ముందుగా ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఎచ్చెర్ల, టెక్కలి చివరిగా అధికంగా 332 పోలింగ్ కేంద్రాల ఉన్న పాతపట్నం నియోజకవర్గం ఫలితాలు వస్తాయి.
కౌటింగ్ పక్కాగా జరగాలని, ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేసే సిబ్బంది, అలాగే వాటిని క్రాస్ చెక్ చేసే మరో బృందం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సిబ్బందితో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు.
అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు జూన్ 4 తేదీ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని, ప్రతీ ఏజెంటు పెన్ను, పెన్సిల్, నోట్ పేడ్ తీసుకురావాలన్నారు. రిటర్నింగ్ అధికారులు అనుమతి లేకుండా ఏజెంట్లు ఎవరూ లోపలికి బయటకు వెళ్లరాదని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అంతా సహకరించాలని కోరారు.
శ్రీకాకుళం – ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్‌గా పరమేశ్వర్ ఫంక్వల్ నియమితులయ్యారు. ఈ మేరకు సంబంధిత అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పరమేశ్వర్ 1998 బ్యాచ్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్(IRSE)కు చెందినవారు. గతంలో ఈయన రాజ్‌కోట్, అహ్మదాబాద్ రైల్వే డివిజన్లలో కీలక పదవుల్లో పనిచేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) తెలిపింది.
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 1,3, 5, 6, 7, 8 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల ఉంటాయి. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసాయి.
1982 ఆగస్టులో ఎన్టీఆర్ నరసన్నపేట వచ్చారు. చైతన్యరథంపై ప్రచారం చేపట్టారు. కార్మికుడి డ్రెస్ వేసుకుని.. లక్ష్మీథియేటర్ సెంటర్లో ఉపన్యాసాలతో హోరెత్తించారు. ఎన్టీఆర్‌ను చూసేందుకు పేట వాసులతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. ప్రచార సభ అనంతరం.. ఎన్టీఆర్ నరసన్నపేట నుంచి తామరాపల్లి మీదుగా కోటబొమ్మాళి మండలం సుబ్బారాయుడుపేట వద్ద శివాలయంలో రాత్రి బస చేశారు.
ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 1300 మంది సూపర్‌వైజర్లు, మైక్రోఅబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్‌వైజర్‌లను నియమించినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. రౌండ్లవారీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గానికి 19 రౌండ్లు, పాతపట్నం 24, ఇచ్ఛాపురం 22, పలాస 21, టెక్కలి 23, శ్రీకాకుళం 20, ఎచ్చెర్ల 23, నరసన్నపేట 21 రౌండ్లుగా లెక్కింపు జరగనుంది.
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రాజమ్మ కాలనీకి చెందిన పదేళ్ల బాలుడు కుమార్ తన తల్లిని కలిసేందుకు సమీపంలో ఉన్న జీడి పరిశ్రమకు సోమవారం వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి బాలుడికి మాయమాటలు చెబుతూ తన వెంట ద్విచక్ర వాహనంపై తీసుకుపోయాడు. పలాస రైల్వే స్టేషన్ వైపు వెళుతున్న సమయంలో బాలుడు బిగ్గరగా ఏడుస్తూ ఉండటాన్ని స్థానికులు ప్రశ్నించడంతో బాలుడును వదిలి వెళ్లాడు.
జిల్లా వ్యాప్తంగా మంగళవారం భానుడి ప్రతాపం వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ 11 గంటల సమయంలో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పాటు ఉక్కపోత తోడవ్వడం సాధారణ జనజీవనానికి ఒకింత ఆటంకంగా ఏర్పడింది. పది, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, వారి సహాయకులు ఎండ తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విశాఖపట్నం, పారాదీప్ మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(నం.22810, 22809) ట్రైన్‌కు LHB(లింక్డ్ హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు అమర్చామని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. అధునాతన LHB కోచ్‌లతో ఈ రైలులో ప్రయాణం సౌకర్యవంతంగా సాగుతుందని విశాఖపట్నం డివిజన్ రైల్వే మేనేజర్ సౌరబ్ ప్రసాద్ తెలిపారు. కాగా ఈ ట్రైన్ జిల్లాలో శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.
Sorry, no posts matched your criteria.