Srikakulam

News October 18, 2024

సరసమైన ధరలకే వంట నూనె: జాయింట్ కలెక్టర్

image

ఇటీవల బహిరంగ మార్కెట్‌లో వంట నూనె ధరలు పెరిగినందున సామాన్య ప్రజలకు వంట నూనె ధరలు సరసమైన ధరలకు అందజేస్తామని జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పామోలిన్ ఆయిల్ 1లీ రూ.110/-, సన్ ఫ్లవర్ ఆయిల్ 1లీ రూ.124/- విక్రయించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 84 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆ కౌంటర్ల వద్దకు వెళ్లి తక్కువ ధరలో నూనె ప్యాకెట్లను తీసుకోవాలన్నారు.

News October 18, 2024

SKLM: వాటికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి- కలెక్టర్

image

బాలల సంరక్షణ కేంద్రాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాలల రక్షిత గృహాల నిర్వహణపై ఆయన సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల సంరక్షణ కేంద్రాలు నిబంధనలు మేరకు నడపాలని సూచించారు. 

News October 17, 2024

శ్రీకాకుళం: అలాంటి వారిపై చర్యలు తీసుకోండి 

image

శ్రీకాకుళం జిల్లాలో 11 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 13 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ లేకుండా బాలల సంరక్షణ కేంద్రాలు నిర్వహించే కేంద్రాలపై కేసు నమోదు చేయాలన్నారు. అనుమతులు లేని బాలల సంరక్షణ కేంద్రాలను తక్షణమే మూయించాలని ఆదేశించారు.

News October 17, 2024

SKLM: ఈ నెల 18న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

image

ఈ నెల అక్టోబర్ 18న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఫిర్యాదుదారుల నుంచి వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 17, 2024

ఆదిత్యుని సేవలో తనికెళ్ల భరణి

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారిని సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి గురువారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వదించారు. ఆయనకు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేశారు. ఆలయ డీసీ వై.భాద్రజీ పాల్గొన్నారు.

News October 17, 2024

ఇసుక రీచ్ సీల్డ్ టెండర్లకు రేపే చివరి అవకాశం

image

శ్రీకాకుళం జిల్లాలో మరో 6 రీచ్‌ల నిర్వహణ హక్కులకు సీల్డ్ టెండర్లు కోరుతున్నట్టు మైన్స్ శాఖ DD మోహనరావు తెలిపారు. పురుషోత్తపురం-1, పురుషోత్తమపురం-2 (సరుబుజ్జిలి), ముద్దాడపేట (ఎచ్చెర్ల), కిల్లిపాలెం(శ్రీకాకుళం), ముద్దాడపేట(అమదాలవలస), పర్లాం(నరసన్నపేట) రీచ్‌ల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 18న ఉదయం11 గంటల లోపు టెండర్లు దాఖలు చేయాలన్నారు.

News October 17, 2024

ట్రామాకేర్ విభాగంపై నిర్లక్ష్యం నీడలు

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలోని ట్రామాకేర్ విభాగంపై నిర్లక్ష్యం ఉందని పలువురు రోగులు వాపోతున్నారు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సత్వర చికిత్స అందించేందుకు ఈ విభాగం పని చేస్తుంది. ప్రస్తుతం ఈ విభాగంలో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదని రోగులు వాపోతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యారావు మాట్లాడుతూ.. ట్రామాకేర్‌లో ప్రస్తుతం ఐదుగురు ఉన్నారన్నారు.

News October 17, 2024

శ్రీకాకుళం జిల్లాకు హెచ్చరికలు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినప్పటికీ మధ్యాహ్నం వరకు సముద్రంపై ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించింది. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది. సాధారణ రోజుల కంటే 1.5 మీటర్ల ఎత్తు అదనంగా అలలు ఎగసిపడే అవకాశం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలు బీచ్‌ల వద్దకు వెళ్లకపోవడం మంచిది.

News October 17, 2024

SKLM: బాలికకు గర్భం.. యువకుడిపై కేసు 

image

బాలికను మోసం చేసిన ఓ యువకుడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. సారవకోట మండలానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో తన గ్రామంలోని బాలికకు దగ్గరయ్యాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భం దాల్చినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో, అత్యాచారం, అట్రాసిటీ కేసులు నమోదు చేశామని SI అనిల్ కుమార్ తెలిపారు.

News October 17, 2024

శ్రీకాకుళం: ‘జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు’

image

శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు నిక్షిప్తమైన సీసీ కెమెరాలు పూర్తిగా పరిశీలించి, జిల్లాలోని నిర్మానుష్యమైన ప్రదేశాలలో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని సీసీ కెమెరాలు జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షణలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.