India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం శాసనాం గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఓ బొలెరో లగేజీ వ్యాన్ అదుపుతప్పి వంతెన గోడకు ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
సీతంపేట మండలం కొత్తగూడ పంచాయతీ వంబరెల్లి సమీపంలో సోమవారం సంత ముగించుకొని వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఆటోలో ఉన్న 17 మందికి తీవ్ర గాయాలవ్వగా.. హుటా హుటిన సీతంపేట ఆసుపత్రికి తరలించారు. వారిలో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
ఇచ్ఛాపురానికి చెందిన ఏడేళ్ల పార్థివ్ శ్రీవత్సల్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో రెండు సార్లు స్థానం సాధించారు. తండ్రి అప్పలనాయుడు గణిత టీచర్‌గా పని చేస్తుండగా..తల్లి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడో తరగతికే టెన్త్ స్థాయి లెక్కల్లో ప్రావీణ్యం చూపుతున్నాడు. రెండు నిమిషాల్లో 197 జాతీయ జెండాలను గుర్తించడంతో పాటు ఈ బాలుడు 1నిమిషంలో క్యూబ్ చేయగలడు.
టెక్కలి సమీప జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ నుంచి ఝార్ఖండ్ ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో అంబులెన్స్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
శ్రీకాకుళంలో జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ రాధిక ఆదేశాల మేరకు సోమవారం పోలీస్ స్టేషన్ల పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరూ కూడా ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అల్లర్లు సృష్టించరాదని సూచించారు. దీనిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 2,591 సీట్లు ఉన్నాయి. మే 27వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. జూన్ 5వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలి. జూన్ 7న సీట్ల కేటాయింపులు వివరాలను పాలిసెట్ కన్వీనర్ ప్రకటిస్తారు. జూన్ 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2024 కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడే ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. జిల్లాలో 10,871 మంది పాలిసెట్ రాయగా 9,596 మంది ఉత్తీర్ణత సాధించారు. 5 ప్రభుత్వ కళాశాలలో 780, 5 ప్రైవేట్ కళాశాలలో 1,811 సీట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, విధుల్లో పాల్గొనే వివిధ అధికారులతో కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్, జేసీ మల్లారపు నవీన్ ఆదివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వివిధ శాఖల సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాట్లు పై వివరించారు. ఈ నెల 28న మైక్రో అబ్జర్వర్స్‌కు శిక్షణ ఉంటుందని, 29న ఈవీఎం కౌంటింగ్ అసిస్టెంట్లకు, సూపర్వైజర్లకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లాలో రేపటి నుంచి ఎండ ప్రభావం చూపనుందని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఈమేరకు సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, హిరమండలం, లక్ష్మీనర్సుపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు (రెడ్అలెర్ట్ ) వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ మండలాల్లో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మిగిలిన మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది.
అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆదివారం ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి వారికి టికెట్ల రూపంలో రూ.9,06,700, పూజలు, విరాళాల రూపంలో రూ.83,523, ప్రసాదాల ద్వారా రూ.3,82,840 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.