India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని తహాశీల్దార్ కార్యాలయంతో పాటుగా గొబ్బూరు గ్రామ పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో ఓటింగ్ శాతం పెరిగే విధంగా ఓటర్లను చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలన్నారు.
టెక్కలి నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీని వీడి షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, టీడీపీ కూటమి అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు పోటీలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. 2024లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది.
జిల్లా వ్యాప్తంగా 46,743.63 ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. అందులో ఒక్క పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోనే సుమారు 24,753 ఎకరాల్లో జీడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 15 వేల టన్నుల జీడి పిక్కలు దిగుబడి వస్తుండగా, సుమారు 13వేల మందికి ఈ పంట ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కొన్ని తెగుళ్ల వల్ల పంటకు భారీ నష్టం వాటిల్లింది.
టెక్కలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిల్లి కృపారాణి పోటీచేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం మరో 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేయగా.. కృపారాణి పేరు అందులో ఖరారైంది. వైసీపీని వీడిన ఆమె ఇటీవలే వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం తెలిసిందే.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంతో పాటు నరసన్నపేట, పలాస, ఇతర ప్రాంతాల్లో బంగారం దుకాణాలు కళకళలాడాయి. పసిడి ధరలు పరుగులు పెడుతున్నా ఏమాత్రం వెనుకాడకుండా బంగారం, ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపారు. తెలుగు వారు చేసుకునే తొలి పండుగ ఉగాది. ఉగాది రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే ఏడాది పొడవునా అదే తరహాలో కొనుగోలు చేస్తుంటారని ఒక నమ్మకం.
రణస్థలం మండలంలోని పైడిభీమవరం చెక్‌పోస్ట్ వద్ద ఎటువంటి రసీదులు, ఆధారాలు లేని వ్యక్తి నుంచి రూ.6,75,000 జేఆర్ పురం ఎస్సై కే. గోవిందరావు, ఎస్సై ఉమామహేశ్ పట్టుకున్నారు. ఆ వ్యక్తి అనపర్తి నుంచి కోటబొమ్మాళికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న నగదును ఆర్వోకు అందజేశామని ఎస్సై తెలిపారు. సంబంధిత రసీదులు అందజేస్తే నగదు అందజేస్తామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా భారత చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మంగళవారం ఆ పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ప్రకటించారు. శ్రీకాకుళం అభ్యర్థి పొనీల ప్రసాద్, ఇచ్ఛాపురం అభ్యర్థి బడ్డి మురళి, ఆమదాలవలస అభ్యర్థి సీపాన శ్రీనివాసరావులను ఆయన ప్రకటించారు. మొదటి జాబితాలో మొత్తం 32 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు.
ఉమ్మడి శ్రీకాకుళంలో జిల్లాలో 2019ఎన్నికలలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది. ఇచ్ఛాపురం- 69.5, పలాస-72.8, టెక్కలి-78.5, పాతపట్నం-70, ఆమదాలవలస-79, ఎచ్చెర్ల-84, నరసన్నపేట-79.6, రాజాం-73.8 పాలకొండ -73.9 శాతంగా నమోదైంది. కాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా 69 శాతం నమోదైంది. ఈ సారి ఆ శాతం పెరిగేలా అధికారుల చర్యలెలా ఉన్నాయి. కామెంట్ చేయండి.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ సోమవారంతో ముగిసిందని డీఈవో వెంకటేశ్వరరావు వెల్లడించారు. జిల్లాకు కేటాయించిన 1,98,449 జవాబు పత్రాలను మొత్తం మూడు కేంద్రాలలో మూల్యాంకన ప్రక్రియ చేపట్టామన్నారు. 1,075 మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు.
బ్రహ్మపురం- ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలు(06087/06088) సేవలు సోమవారం ఇచ్చాపురంలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 22 సెకండ్ క్లాస్ భోగిలతో కూడిన ఈ రైలు ఇచ్చాపురం స్థానిక రైల్వే స్టేషన్లో ఆగింది. బ్రహ్మపురలో మధ్యాహ్నం 12:40 నిమిషాలకు ప్రారంభమైన ఈ రైలు ఇచ్చాపురం, పలాస,శ్రీకాకుళం, విజయనగరం, దువ్వాడ, విజయవాడ, గూడూరు, మీదుగా తమిళనాడు, ఎర్నాకులం కు చేరుతుంది.
Sorry, no posts matched your criteria.