India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎన్ని రాజు, ఆయన ఇద్దరు అనుచరులపై సంతకవిటి పోలీసులు శనివారం కేసు నమోదుచేశారు. ఇద్దరు మైనర్లను బెదిరించి, జైలులో పెడతామని భయపెట్టి చేతులతో కొట్టిన ఘటనలో బాలుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతకవిటి ఎస్ఐ షేక్ శంకర్ కేసు నమోదు చేశారు. ఎన్ని రాజుతోపాటు ఆయన అనుచరులు మీసం శ్రవణ్, తూముల యోగేంద్ర పై కేసు నమోదు అయినట్లు ఎస్సై తెలిపారు.
ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలను ఎస్పీ జీ.ఆర్.రాధిక శనివారం రాత్రి సందర్శించి, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు, భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాలు ద్వారా నిఘాను ఆమె పర్యవేక్షించారు. అనంతరం గార్డు సిబ్బందితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. నిరంతరం నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తతో విధులు నిర్వహించాలని ఆమె సూచించారు.
పోలాకి మండలం పల్లిపేట గ్రామానికి సమీపంలో గల వంశధార నది రేవు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు స్థానిక పోలీసులు శనివారం తెలిపారు. మృతుని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో తుఫాన్ (రెమాల్)గా మారే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది రేపటికి తీవ్ర తుఫాన్‌గా మరి అవకాశం ఉందని తాజా ప్రకటనలో వెల్లడించారు. ఈ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కావున మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహణ చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉదయం జరిగిన పరీక్షలకు 3,422 మంది హాజరు కావాల్సి ఉండగా 176 మంది గైర్హాజరై 3,246 మంది పరీక్ష రాశారని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 926 మంది హాజరు కావాల్సి ఉండగా 80 మంది గైర్హాజరై 846 మంది పరీక్ష రాశారని వారు పేర్కొన్నారు.
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే SSC సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు APOSS పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూన్ 1, 3, 5, 6, 7, 8 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసాయి.
ఇచ్ఛాపురం చీకటి బలరాంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం బలరాంపురం గ్రామ సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్లి ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం కారును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇరు పార్టీలకు అత్యంత నమ్మకమైన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించే దిశగా అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇతర ఏజెంట్లకు దీటుగా వారిని తట్టుకునే శక్తియుక్తులున్న వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. విశ్వసనీయుల పేర్లనే రిటర్నింగ్ అధికారులకు పంపించేందుకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు.
కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కొందరు ఏజెంట్లు నమ్మించిన ఘటనలో పలాస వాసి
ఉన్నట్లు సమాచారం. ఆ యువకుడి నుంచి రూ.1.50 లక్షలు తీసుకుని చైనా, కాంబోడియా కంపెనీల ఏజెంట్లకు అప్పగించారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. భారత రాయబార, విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో కొందరు రెండు విమానాల్లో శుక్రవారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. వారిలో పలాస వాసి ఉన్నట్లు గుర్తించారు.
ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. తాజా లెక్కల ప్రకారం అన్ని జిల్లాల నుంచి 5,39,189 ఓట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 ఓట్లు పోలయ్యాయని, తరువాత స్థానంలో నంద్యాల జిల్లా (25,283) ఓట్లు రాగా, మూడో స్థానంలో కడప జిల్లా (24,918) ఓట్లు పోలయ్యాయి. ఇక అత్యల్పంగా నరసాపురంలో (15,320) ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.