Srikakulam

News May 24, 2024

శ్రీకాకుళం జిల్లాలో పాలిటెక్నిక్ సీట్ల వివరాలు

image

శ్రీకాకుళం జిల్లాలో 5 ప్రభుత్వ , 5 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలో 780 సీట్లు, ప్రైవేట్ కళాశాలలో 1811 సీట్లు మొత్తం 10 కళాశాలలో 2,591 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 300 సీట్లు, శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్‌లో 120 సీట్లు, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌-120 సీట్లు, ఆమదాలవలస-120 సీట్లు, సీతంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 120 సీట్లు, ఉన్నాయి.

News May 24, 2024

శ్రీకాకుళం: పోలింగ్ రోజు కొట్లాట.. 28మంది అరెస్ట్

image

పొందూరు మండలం గోకర్ణపల్లిలో ఈనెల 13న ఎన్నికల సమయంలో జరిగిన కొట్లాటకు సంబంధించి 28 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక ఎస్సై వై.రవికుమార్ తెలిపారు. గోకర్ణపల్లిలో జరిగిన కొట్లాటలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని రిమ్స్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధ, గురువారాల్లో 28 మందిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం కోర్టు రిమాండ్ విధించగా, అంపోలు జైలుకు తరలించారు.

News May 24, 2024

శ్రీకాకుళం: 100 మీటర్లు వెనక్కెళ్లిన సముద్రం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ తీరంలో గురువారం సముద్రం దాదాపు 100మీ వరకు వెనక్కి వెళ్లింది. ఈ ఘటనపై స్థానిక మత్స్యకారులు భయాందోళనలకు గురయ్యారు. ఇటువంటి ఘటన ఇటీవల కాలంలో ఎప్పుడూ జరగలేదని వారు తెలిపారు. కొందరు పర్యాటకులు సముద్ర స్నానం చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

News May 24, 2024

శ్రీకాకుళం: పటిష్ఠమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలి

image

పటిష్ఠమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు ఆయన ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భద్రత, సి.సి. టివిలు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు.

News May 24, 2024

శ్రీకాకుళం: ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు పలాస మీదుగా చెన్నై ఎగ్మోర్, సత్రాగచ్చి(పశ్చిమ బెంగాల్) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 4 నుంచి జులై 2 వరకు ప్రతి మంగళవారం చెన్నై ఎగ్మోర్-సత్రాగచ్చి (నం.06079), జూన్ 5 నుంచి జూలై 3 వరకు ప్రతి బుధవారం సత్రాగచ్చి-చెన్నై ఎగ్మోర్ (నం.06080) ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలోని విజయనగరం, దువ్వాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News May 23, 2024

శ్రీకాకుళం జిల్లాకు రేపు వర్ష సూచన

image

రేపు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న పార్వతీపురం, అల్లూరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.

News May 23, 2024

శ్రీకాకుళం: మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: APSDMA

image

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శనివారం నాటికి క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తుఫాను కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని APSDMA అధికారులు ఈ మేరకు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. మే 26 సాయంత్రానికి బంగ్లాదేశ్ & పశ్చిమబెంగాల్ తీరాలకు ఈ తుఫాను తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని APSDMA స్పష్టం చేసింది.

News May 23, 2024

శ్రీకాకుళం: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

బీఈడీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తులలో తప్పులు దొర్లి ఉంటే ఏపీ ఉన్నత విద్య మండలి సవరించుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులలో కరెక్షన్స్ ఉంటే ఈ నెల 25లోపు సరిదిద్దుకోవచ్చని సూచించింది. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.

News May 23, 2024

REWIND: ఎచ్చెర్లలో అత్యధికం, ఆముదాలవలసలో అత్యల్పం

image

2019 ఎన్నికలలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎచ్చెర్లలో “NOTA”కు అత్యధిక ఓట్లు పడగా, ఆముదాలవలసలో అత్యల్ప ఓట్లు పడ్డాయి. ఈ మేరకు ఎచ్చెర్ల స్థానంలో “NOTA”ను 4,628 మంది ఎంచుకోగా, ఆముదాలవలస స్థానంలో 2,656 మంది “NOTA”కు ఓటేశారు. ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో “NOTA” ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుందో జూన్ 4న తెలియనుంది.

News May 23, 2024

శ్రీకాకుళం: పీజీ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు

image

విజయనగరంలోని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ అందించే పలు పీజీ కోర్సుల దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు ఆయా పీజీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్శిటీ వర్గాలు తెలిపాయి. అడ్మిషన్లకై https://ctuapcuet.samarth.edu.in/pg/ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సెంట్రల్ వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి.

error: Content is protected !!