Srikakulam

News May 23, 2024

టెక్కలి: 25న రగ్బీ జిల్లా స్థాయి అండర్-18 ఎంపికలు

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25వ తేదీన అండర్-18 జిల్లాస్థాయి రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పార్వతీశంలు గురువారం తెలిపారు. 2006 నుంచి 2008 మధ్య కాలంలో జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణరావును సంప్రదించాలని కోరారు.

News May 23, 2024

శ్రీకాకుళం: ప్రయాణికుల రద్దీ మేరకు సమ్మర్ స్పెషల్ రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా నాగర్‌కోయిల్(NCJ), డిబ్రుగర్(DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06103 NCJ-DBRG రైలును జూన్ 7, 14, 21 తేదీలలో, నం.06104 DBRG-NCJ రైలును జూన్ 12, 19, 26 తేదీలలో నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.

News May 23, 2024

శ్రీకాకుళం: తలనొప్పి తట్టుకోలేక వివాహిత సూసైడ్

image

ఇచ్చాపురం మండలం డోంకూరులో బుధవారం అర్ధరాత్రి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. వాసుపల్లి ఉష(30) కొద్దిరోజులుగా తలనొప్పితో బాధపడుతుంది. బుధవారం తీవ్రమైన తలనొప్పి రాగా, భరించలేక ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వాసుపల్లి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులకు నందన(10), రిత్విక్(5) సంతానం.

News May 23, 2024

SKLM: కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. స్వస్థలాలకు విద్యార్థులు!

image

కిర్గిస్థాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న రాజాం విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీన మొదలైన అల్లర్లు ఇంకా సద్దుమణగకపోవడంతో అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని భావించి ఇంటి దారి పట్టారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ నెలాఖరుకు స్వదేశం వచ్చేలా విమాన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో వర్సిటీలకెళ్లి చదువుకోలేకపోతున్నామని వారు తెలిపారు.

News May 23, 2024

నేటితో ముగియనున్న ఈఏపీసెట్ పరీక్షలు

image

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను నిర్వహిస్తున్న ఈఏపీసెట్ 2024 పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. ఈనెల 16 నుంచి బైపీసీ, ఎంపీ విభాగాలకు గాను జరుగుతున్న పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. జిల్లాలోని చిలకపాలెం, ఎచ్చెర్ల, టెక్కలి, నరసన్నపేట ప్రాంతాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. జేఎన్టీయూ కాకినాడ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

News May 23, 2024

శ్రీకాకుళం: ఐటీఐలో 550 ఉద్యోగాలతో జాబ్ మేళా

image

ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో నేడు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18-35 వయసు గల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ మేళాలో 550 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ ఒరిజినల్ పత్రాలు, ఆధార్ కార్డుతో పాటు బయోడేటా జిరాక్స్ కాపీలు 2 సెట్లు, పాస్‌పోర్టు సైజు ఫోటోలతో ఉ. 9 గంటలకు హాజరు కావాలాని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.

News May 23, 2024

శ్రీకాకుళం: వీడిన మర్డర్ మిస్టరీ .. భార్య అరెస్ట్

image

నగర పాలక సంస్థ పరిధి గూనపాలెంలో హత్యకు గురైన సీర సురేశ్ (34) మర్డర్ మిస్టరీ వీడింది. అనుమానంగా ఉన్న మృతుడు భార్య తిరుమలను ఈ మర్డర్లో కీలక సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. ఈ కోణంలో దర్యాప్తు చేసి నిందితురాలు తిరుమలను బుధవారం సీఐ సన్యాసినాయుడు, 1 టౌన్ ఎస్సై బలివాడ గణేశ్ అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య తిరుమలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు వారు స్పష్టం చేశారు.

News May 23, 2024

మెలియాపుట్టి: ఆర్టీసీ బస్సు కిందపడి మహిళ మృతి

image

పాతపట్నం మండలం ద్వారకాపురి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మెలియాపుట్టి మండలం తుమ్మకొండ రామచంద్రపురం గ్రామానికి చెందిన అప్పల నరసమ్మ (45) ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందినట్లు ఎస్సై మహమ్మద్ యాసిన్ తెలిపారు. తన కన్నవారిని చూసేందుకు జగన్నాధపురం వెళ్లి తిరిగి వచ్చే క్రమంలోఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

News May 22, 2024

మెలియాపుట్టి: ఆర్టీసీ బస్సు కిందపడి మహిళ మృతి

image

పాతపట్నం మండలం ద్వారకాపురి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మెలియాపుట్టి మండలం తుమ్మకొండ రామచంద్రపురం గ్రామానికి చెందిన అప్పల నరసమ్మ (45) ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందినట్లు ఎస్సై మహమ్మద్ యాసిన్ తెలిపారు. తన కన్నవారి సృష్టి జగన్నాధపురం వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఆర్టీసీ బస్సు క్రాస్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

News May 22, 2024

శ్రీకాకుళం: ఎస్పీని సత్కరించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు

image

లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు జిల్లా ఎస్పీ రాధికను అభినందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు గాను అధిక ఓటింగ్ శాతం నమోదు, ఎన్నికలు సజావుగా శాంతియుతంగా నిర్వహించినందుకు గాను లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు బుధవారం సాయంత్రం ఆమెను సత్కరించి, అభినందనలు తెలిపారు. వారిలో ప్రతినిధులు సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్, తదితరులు ఉన్నారు.

error: Content is protected !!