India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణికుల సౌకర్యార్థం పలాస మీదుగా తాంబరం, సత్రాగచ్చి మధ్య స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నం.06089 తాంబరం- సత్రాగచ్చి ట్రైన్‌ను జూన్ 5 నుంచి జూలై 3 వరకూ ప్రతి బుధవారం, నం.06090 సత్రాగచ్చి- తాంబరం ట్రైన్‌ను జూన్ 6 నుంచి జూలై 4 వరకూ ప్రతి గురువారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులకు ఇచ్చే అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. UG, PG విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు 2 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులకు https://www.awards.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఎంపికైన 35 మంది అధ్యాపకులకు మెడల్, సర్టిఫికెట్‌తో పాటు రూ.50వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.
కొరియర్ పేరుతో వచ్చే కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP దీపిక తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో బుక్‌చేసిన ఐటమ్ యొక్క పార్సల్౨లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని కేసు నమోదైందని సీబీఐ లేదా పోలీసుల మంటూ సైబర్ నేరగాళ్లు బెదిరిస్తారని చెప్పారు. విచారణకు రమ్మంటారని, రాలేమంటే ఆన్లైన్లోనే రావచ్చునని చెప్పి, ఓ లింక్ పంపిస్తారని దాన్ని తెరిస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతాయని ఎస్పీ వివరించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా చెన్నై ఎగ్మోర్, సత్రాగచ్చి మధ్య స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నం.06077 చెన్నై ఎగ్మోర్- సత్రాగచ్చి ట్రైన్‌ను జూన్ 1 నుంచి 29 వరకూ ప్రతి శనివారం, నం.06078 సత్రాగచ్చి- చెన్నై ఎగ్మోర్ ట్రైన్‌ను జూన్ 3 నుంచి జూలై 1 వరకూ ప్రతి సోమవారం నడపనున్నట్లు SCR తెలిపింది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(PGECET)-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఉన్నత విద్యామండలి తెలిపింది. కాగా PGECET పరీక్షను ఈ నెల 29 నుంచి 31 వరకు నిర్వహిస్తామని APSCHE వర్గాలు స్పష్టం చేశాయి.
10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనున్నాయని జిల్లా విద్యా శాఖాధికారి వేంకటేశ్వర రావు, పరీక్షల నిర్వహణధికారి అలీ ఖాన్ తెలిపారు. జిల్లాలోని 9 పరీక్షా కేంద్రాలలో సుమారు 2100 మంది పరీక్షలు రాయనున్నారని పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
శ్రీకాకుళంలోని గూనపాలెంలో సురేశ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన భార్య తిరుమలనే ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో హత్యకు భార్య ప్లాన్ చేసింది. ఈనెల 16న రాత్రి సురేశ్ తీసుకున్న ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. తర్వాత ప్రియుడికి సమాచారం అందజేసింది. అతను తన ఫ్రెండ్‌తో కలిసి సురేశ్ ఇంటికి వచ్చారు. అక్కడ అతడి గొంతు కోసి చంపేశారు.
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం వివిధ ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు నిలిపివేసింది. శ్రీకాకుళం జిల్లాలోనే సుమారు రూ.150కోట్లు బకాయిలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఆయా ఆసుపత్రుల యాజమానులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికలు పోలింగ్ అనంతరం గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం ఎస్పీ రాధిక ఆదేశాలతో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఐలు, ఎస్సై ల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రజలకు గుర్తు చేశారు. కార్యకర్తలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం శ్రీకాకుళంలో మే 21, 1991న సాగింది. అప్పటి లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించారు. శ్రీకాకుళంలో జరిగిన భారీ బహిరంగ సభలో అభ్యర్థి డా.కణితి విశ్వనాథంకు మద్దతుగా ప్రసంగించారు. అక్కడ నుంచి విజయనగరం సభలో మాట్లాడారు. అనంతరం విశాఖ చేరుకుని అక్కడ నుంచి విమానంలో రాత్రి 10 గంటలకు తమిళనాడులోని పెరుంబుదూర్‌లో జరిగిన మానవబాంబు దాడిలో హత్యకు గురయ్యారు.
Sorry, no posts matched your criteria.