India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం నగరంలోని బాదుర్లపేటకు చెందిన పి.రమేశ్(18) మృత్యువాత పడ్డాడు. నగరంలోని నాగావళి నదికి స్నేహితులతో కలిసి రమేశ్ ఆదివారం స్నానానికి వెళ్లాడు. నదిలో స్నానం చేస్తూ ఊబిలో చిక్కుకొని ప్రమాదవశాత్తు అతడు మునిగిపోయాడు. నీటిలో మునగడంతో వెంటనే అతడిని బయటకు తీసి హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే రమేశ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
శ్రీకాకుళం జిల్లా నిప్పులకొలిమిలా మారింది. మే నెల కావడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం తీవ్రమైన ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏకంగా 35-40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పలాసలో తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. పలు మండలాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.
ఎన్నికల ఫలితాలు మరో 15రోజుల్లో వెలువడనున్నాయి. మన MLA ఎవరనేది తేలిపోనుంది. అంతలోనే నియోజకవర్గాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులు గెలుపోటములు, మెజారిటీలపై పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం రూ.లక్షల్లో సాగుతుందని టాక్. మరోవైపు పలు పార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు. – మరి మీ MLA ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?
ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం శివాని కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన అక్కడి సిబ్బందికి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీ ఒక్కరూ కౌంటింగ్ ప్రక్రియ వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, ఎస్పీ రాధిక, డిఎస్పీ వై.శ్రుతి ఉన్నారు.
ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులందరికీ డ్యూటీ ధ్రువపత్రాలు మంజూరు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్ కుమార్ కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో మనజీర్ జిలానీ సమూన్‌ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన కలెక్టర్‌ను సంఘం తరుపున అభినందనలు తెలిపారు.
తెలంగాణ ఈఏపీసెట్‌లో పాలకొండ మండలం ఎరకరాయపురం గ్రామానికి చెందిన విద్యార్థి పతివాడ జ్యోతిరాధిత్య ( H.NO.2423U01806) ఉత్తమ ప్రతిభ కనబరిచి ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు సాధించారు. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపై విద్యార్థి తల్లిదండ్రులు మోహన్‌రావు, హైమావతి హర్షం వ్యక్తం చేశారు. పలువురు స్థానికులు అభినందనలు తెలిపారు.
కిర్గిస్థాన్ దేశంలో జరుగుతున్న గొడవలు నేపథ్యంలో జిల్లాకు చెందిన సుమారు 250 మంది వైద్య విద్యార్థులు, రాష్ట్రానికి చెందిన సుమారు 2 వేల మంది చదువుకుంటున్న నేపథ్యంలో వారికి భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రిత్వ శాఖకు జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం లేఖ రాశారు. కిర్గిస్థాన్‌లో ఉన్న ఏపీ విద్యార్థులకు రక్షణ కల్పించాలని వాటికి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జీలాని సమూన్ సూచించారు. ఈ మేరకు ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ జి.ఆర్ రాధికా పాల్గొన్నారు.
వరకట్న వేధింపుల కేసులో భర్త, అత్తకు ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ సోంపేట సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి.భాస్కరరావు శుక్రవారం తీర్పు చెప్పారు. హిరమండలం మండలం, తంప గ్రామానికి చెందిన హారతి అనే వివాహిత 2020లో భర్త తిరుమలరావు, అత్త లిమ్మమ్మ వేధింపులకు ఆత్మహత్య చేసుకుంది. పుట్టింటి వారి ఫిర్యాదు మేరకు డీఎస్పీ రారాజు కేసు నమోదు చేశారు. ఎస్సై నారాయణస్వామి నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఉమామహేశ్వరరావు పలువురికి మంచిని బోధించారు.
తెలిసో తెలియక చేసిన తప్పులు కారణంగా సమాజంలో రౌడీషీటర్లుగా ముద్రపడే వారంతా నడవడిక మార్చుకుంటే రౌడీ షీట్లు ఎత్తివేస్తామన్నారు. ఎస్పీ రాధిక ఆదేశాలతో శుక్రవారం స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లతో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఉన్న మాదిరిగానే మిగతా సమయంలోను ప్రశాంతంగా కుటుంబంతో గడపాలన్నారు.
Sorry, no posts matched your criteria.