Srikakulam

News May 18, 2024

శ్రీకాకుళం: 23న అన్నమాచార్య జయంతి వార్షికోత్సవాలు

image

శ్రీవారికి స్వరార్చన వారి నేతృత్వంలో పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య జయంతి వార్షికోత్సవాలు పట్టణంలోని స్ధానిక కత్తెర వీధి శ్రీ రాజరాజేశ్వరీ ఆలయంలో ఈ నెల 23 తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగనుంది. శ్రీకాకుళం పరిసర ప్రాంత గాయనీ గాయకులు అన్నమాచార్య కీర్తనలతో స్వరార్చన చేస్తారని అనంతరం విశాఖపట్నానికి చెందిన కళాకారులు చే గాత్ర కచేరీ ఉంటుందని నిర్వహకులు తెలిపారు,. 

News May 18, 2024

SKLM: మెడికల్ డిప్లమా ఫలితాల్లో సిక్కోలు విద్యార్థిని సత్తా

image

మెడికల్ డిప్లమా ఫలితాల్లో సిక్కోలు విద్యార్థిని సత్తా చాటింది. ఈ రోజు విడుదలైన డిప్లమా ఇన్ క్యాత్ లాబ్ టెక్నాలజీ ఫలితాల్లో ఆమదాలవలస మండలం చీమలవలసకు చెందిన పేడాడ లలిత కుమారి 360కి 306 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచింది. రాగోలులోని జేమ్స్ ఆసుపత్రిలో లలితకుమారి ఈ కోర్స్ అభ్యసించింది. వైద్యరంగంలో మరింత సేవ చేసేందుకు ఈ ఫలితాలు అవకాశం కల్పించాయని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

News May 18, 2024

శ్రీకాకుళంలో విజిబుల్ పోలీసింగ్

image

మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని ముఖ్య కూడళ్లలో జిల్లా ఎస్పీ జీ.ఆర్ రాధిక ఆదేశాలతో ‘విజిబుల్ పోలీసింగ్’ లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అనంతరం వారు రికార్డులు పరిశీలించి, లేని వారికి జరిమానాలు విధించారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అక్రమ రవాణాకు అవకాశం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామన్నారు.

News May 17, 2024

నరసన్నపేట: కలెక్టర్‌కు ప్రత్యేక ఆహ్వానం

image

నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్‌కు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఆలయ ధర్మకర్త పొట్నూరు కృష్ణ ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.

News May 17, 2024

మలేషియాలో గోల్డ్ మెడల్ సాధించిన సిక్కోలు చిన్నారి

image

మందస మండలం దున్నవూరు గ్రామానికి చెందిన దున్న కృష్ణారావు, స్వాతి దంపతుల కుమార్తె దున్న ప్రత్యూష(7) కరాటిలో చిన్న నాటి నుంచి ప్రావీణ్యం సంపాదించింది. ఇటీవల మే 10 నుంచి 12 వ తేదీ వరకు మలేషియాలో జరిగిన ఓపెన్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ విషయం తెలియడంతో దున్నవూరు గ్రామస్థులు, తల్లిదండ్రులు చిన్నారిని అభినందించారు. కాగా తండ్రి దున్న కృష్ణారావు ఉపాధి నిమిత్తం హైదరాబాదులో ఉన్నారు.

News May 17, 2024

సీతంపేట: దారుణ హత్యకు గురైన గుర్తు తెలియని మహిళ

image

సీతంపేట మండలం పుల్లిపుట్టి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం సృష్టించింది. అటుగా వెళ్తున్న స్థానికులు మహిళలు మృతదేహాన్ని చూసి భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 17, 2024

అర్ధరాత్రి శ్రీకాకుళంలో దారుణ హత్య

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గూనపాలెంలో దారుణ హత్య జరిగింది. స్థానికంగా నివాసముంటున్న సీర సురేశ్ (34) గురువారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అతడి గొంతు కోసి హతమార్చారు. మృతుడు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

News May 17, 2024

టెక్కలి: అమ్మవారి విగ్రహాల ధ్వంసం

image

టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ పరిధిలోని జీడి పేట గిరిజన గ్రామం సమీపంలో ఉన్న శ్రీ వనదుర్గమ్మ తల్లి ఆలయంలోని విగ్రహాలను 2 రోజుల క్రితం దుండగులు ధ్వంసం చేశారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు శుక్రవారం నాటికి సామాజిక మాధ్యమాల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. విగ్రహాలు ధ్వంసం చేయడం చుట్టు పక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. టెక్కలి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం.

News May 17, 2024

SKLM: వికసించిన ‘మే’ పుష్పం

image

శ్రీకాకుళం జిల్లా నౌపడ సర్పంచ్ పిలకా బృందాదేవి, రవికుమార్ రెడ్డి ఇంటి ఆవరణలో గురువారం అరుదైన ‘మే’ పుష్పం వికసించింది. ఏడాదిలో ఒక్కసారి, ఒక పుష్పం మాత్రమే వికసిస్తుంది. విషయం తెలిసి ఈ పుష్పాన్ని చూసేందుకు గ్రామస్థులు వస్తున్నారు. ఇది ప్రతికూల వాతావరణంలో, ఇసుక నేలల్లో పెరిగి ఎండ వేడిమికి మే నెలలో మాత్రమే పూస్తుంది. అందువల్ల దీనిని మే పుష్పంగా పిలుస్తుంటారు.

News May 17, 2024

కంచిలి: మకరాంపురం క్రీడాకారుడు ఏపీఎల్‌కు ఎంపిక

image

కంచిలి మండలం మకరంపురం గ్రామానికి చెందిన బెందాళం సాత్విక్ ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ 2024 కు ఎంపికయ్యారు. ఏపీఎల్‌కు జరిగిన వేలం పాటలో బెందాళం సాత్విక్ 1.6 లక్షలకు ఉత్తరాంధ్ర లయన్స్ తరఫున ఆడబోతున్నట్లు సాత్విక్ తండ్రి భోగేశ్  తెలిపారు. ఈ మేరకు మకరంపురం గ్రామంలో పలువురు క్రీడాకారులు అభినందనలు తెలిపారు.

error: Content is protected !!