Srikakulam

News May 16, 2024

శ్రీకాకుళం: TODAY TOP NEWS

image

*టెక్కలి:130పైగా స్థానాల్లో విజయం: అచ్చెన్నాయుడు *రాజాంలో పైప్‌లైన్‌కు మరమ్మతులు *నరసన్నపేటలో అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న అధికారులు *గార:కూర్మనాథుని కల్యాణోత్సవం ప్రారంభం *భామిని: వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడి మృతి *ఇచ్ఛాపురం: బ్యాగ్ కోసం వెళ్తే.. బైక్‌లో ఉన్న డబ్బు కొట్టేశారు * కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్ *కోటబొమ్మాళి: టీడీపీ నాయకులు నా కుటుంబంపై దాడి చేశారు: వైసీపీ ఏజెంట్

News May 16, 2024

శ్రీకాకుళం: ఎన్నికల నిర్వహణ విజయవంతంపై కలెక్టర్ ప్రశంస

image

ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో జిల్లా ప్రజల సహాయ, సహకారాలు, భాగస్వామ్యం మరువలేనిదని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. ముఖ్యంగా అధికారుల సమన్వయం.. సమష్టి కృషితోనే అది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు.

News May 16, 2024

శ్రీకాకుళం: ఎన్నికలు ముగిస్తాయని నిర్లక్ష్యం వద్దు: డీఐజీ

image

ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు తరువాత జరిగిన సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై విశాఖపట్నం రేంజ్ పరిధిలోని శ్రీకాకుళం, పలు జిల్లాల ఎస్పీలతో విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని VZM జిల్లా పోలీసు కార్యాలయంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల తరువాత మన ప్రాంతం ప్రశాంతంగా ఉందన్న నిర్లక్ష్యంవద్దని, మరో 15రోజులు ప్రతీ ఒక్కరూ ఇదే స్ఫూర్తి, నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు. ఎస్పీ రాధిక ఉన్నారు.

News May 16, 2024

ఎచ్చెర్ల: స్ట్రాంగ్ రూములు ఏఎస్పీ పరిశీలన

image

ఎచ్చెర్లలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలను గురువారం ఉదయం ఏఎస్పీ ప్రేమ కాజల్ సందర్శించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత ఏర్పాట్లను, సీసీ కెమెరాలు ద్వారా నిఘాను ఆమె పర్యవేక్షించారు. అనంతరం స్ట్రాంగ్ తనిఖీ చేపట్టి రూమ్స్ వద్ద భద్రత పరమైన అంశాలపై గార్డు, సిబ్బందికి పలు అంశాలు పై దిశానిర్దేశం చేశారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు.

News May 16, 2024

శ్రీకాకుళం: నేడు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు

image

శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జి.సిగడాం మండలంలో అత్యధికంగా 38.5 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. అలాగే జిల్లాలో పాలకొండలో 35.2 మి.మీ., హిరమండలంలో 35.2 మి.మీ., పాతపట్నంలో 22.7 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైందని అన్నారు. ఇవాళ కూడా జిల్లాలో తదితర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

News May 16, 2024

విశాఖలో యాక్సిడెంట్.. వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మృతి

image

<<13252907>>మధురవాడ<<>>లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు గుమ్మడి మధు (51) మృతి చెందారు. భామిని మండలం కాట్రగడకు చెందిన మధు విశాఖలో స్థిరపడ్డారు. నగరంలో పని ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఎండాడ నుంచి ఆనందపురం వైపు వెళ్తున్న లారీ ఆయనను ఢీకొట్టింది. జీవీఎంసీ చెత్త తరలించే లారీగా సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 16, 2024

శ్రీకాకుళం: డిగ్రీ ఫలితాల్లో పాసైన వారి వివరాలు

image

డా. బి.ఆర్ అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను బుధవారం వర్శిటీ అధికారులు విడుదల చేశారు. మొత్తం 8,299 మంది విద్యార్థుల్లో 4,911 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బీఏ కోర్సులో 884 మందికి 271 మంది, బీకాంలో 1,365 విద్యార్థులు పరీక్ష రాయగా 591, బీఎస్సీలో 5,641 మందికి 3,754 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వర్శిటీ అధికారులు వెల్లడించారు.

News May 16, 2024

130పైగా స్థానాల్లో విజయం: అచ్చెన్నాయుడు

image

సార్వత్రిక ఎన్నికల్లో కూటవి విజయం తథ్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 130కి పైగా స్థానాల్లో విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు వైసీపీపై తమ వ్యతిరేకతను ఓటు ద్వారా తెలిపారన్నారు. పార్వతీపురంలో ఓ కార్యక్రమానికి బుధవారం హాజరైన ఆయన.. విలేకర్లతో ఈ వ్యాఖ్యలు చేశారు.

News May 16, 2024

SKLM: స్ట్రాంగ్ రూముల భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన

image

ఈనెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈవీఎంలను భద్రపరిచే ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను బుధవారం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక సందర్శించే భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కేంద్ర పోలీస్ బలగాలు సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ కి నలువైపులా పోలీస్ పటిష్ఠ బందోబస్తు, 24×7 సీసీ కెమెరాల పర్యవేక్షణ పై ఎస్పీ ఆరా తీశారు.

News May 15, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఎగ్జామినేషన్ డీన్ ఎస్ ఉదయ్ భాస్కర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jnanabhumi.ap.gov.in/ పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను నమోదు చేసి ఫలితాలను చూడవచ్చని ఆయన అన్నారు.

error: Content is protected !!