Srikakulam

News May 15, 2024

శ్రీకాకుళం: ఓటరు ఎటువైపు?

image

ఎన్నికలలో పోలింగ్ ప్రక్రియపై విభిన్న ఊహాగానాలు, విశ్లేషణలు చక్కర్లు కోడుతున్నాయి. శ్రీకాకుళంలో సోమవారం ఉదయం ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు బాగా పోలైందని, సాయంత్రం నుంచి ప్రభుత్వ అనుకూల ఓటింగ్ భారీగా నమోదయిందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పోలింగ్ విధానాన్ని విశ్లేషిస్తూ ఆయా పార్టీల నాయకులు విజయం తమదంటే.. తమదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరి మీ జిల్లా ఓటర్లు ఎటువైపు ఉన్నారో కామెంట్ చెయ్యండి?

News May 15, 2024

SKLM: స్ట్రాంగ్ రూముల భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన

image

ఈనెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈవీఎంలను భద్రపరిచే ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను బుధవారం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక సందర్శించే భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కేంద్ర పోలీస్ బలగాలు సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ కి నలువైపులా పోలీస్ పటిష్ఠ బందోబస్తు, 24×7 సీసీ కెమెరాల పర్యవేక్షణ పై ఎస్పీ ఆరా తీశారు.

News May 15, 2024

సంతబొమ్మాళి: APRJCలో సత్తా చాటిన విద్యార్థినులు

image

సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పెద్దిన భవానిAPRJC బైపీసీలో రాష్ట్రస్థాయిలో 53వ ర్యాంకు సాధించింది. పాలిటెక్నిక్‌లో 550 ర్యాంకు సాధించింది. అలాగే బడే నరసాపురానికి చెందిన సుంకరి రజిత ఏపీఆర్‌జె‌సీ బైపీసీలో 143 ర్యాంక్ సాధించింది. వీరికి గ్రామ సర్పంచ్ దుక్క భూషణ్ రెడ్డి, షణ్ముఖ మాస్టర్, ఫాల్గుణ రెడ్డి, సిమ్మాన్న మాస్టర్‌లు మిఠాయిలు తినిపించి అభినందించారు.

News May 15, 2024

నిప్పులకొలిమిలా శ్రీకాకుళం

image

శ్రీకాకుళం జిల్లా నిప్పులకొలిమిలా మారింది. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. రెండు రోజులుగా వాతావరణంలో వేడి ఎక్కువ కావడంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

News May 15, 2024

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

మందస మండలం బిన్నలమదనాపురం-బాలిగాం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచిలి మండలం గుండమూరుకు చెందిన లక్ష్మణరావు(43) 20 ఏళ్లుగా పలాసలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓటు వేయడానికి 13న బైక్‌పై సొంత గ్రామానికి వచ్చాడు. ఓటు వేసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆయన బైక్‌ను కారు ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య హైమావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News May 15, 2024

కొత్తూరు: స్నానానికి వెళ్లి బాలుడి మృతి

image

కొత్తూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. బూర్జ గ్రామానికి చెందిన శ్రీహరి భార్య జయమ్మ తన కుమారుడు అభితో 13న ఓటు వేసేందుకు సొంత ఊరు పారాపురం వచ్చింది. మంగళవారం సాయంత్రం రిజర్వాయరులో వారు స్నానానికి దిగారు. స్నానం చేస్తున్న సమయంలో అభి లోపలకు వెళ్లడంతో మునిగిపోయాడు. పక్కనున్న జయమ్మ రక్షించేందుకు ప్రయత్నించగా అప్పటికే అభి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 15, 2024

నందిగాం: పాము కాటుకు గురై యువకుడి మృతి

image

నందిగాం మండలంలో విషాదం నెలకొంది. పెద్దలవునిపల్లెకు చెందిన శివానందం(24) పాము కాటుకు గురు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. సోమవారం రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత శివానందం తన తల్లి, సోదరుడితో ఇంట్లో నిద్రపోయారు. ఓ కట్లపాము అర్ధరాత్రి శివానందను కరిచింది. మంగళవారం ఉదయం అతడికి వాంతులు, విరేచనాలు అవడంతో ఏం జరిగిందో తెలియని కుటుంబీకులు శ్రీకాకుళం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

News May 15, 2024

శ్రీకాకుళం జిల్లాలో 76.81శాతం పోలింగ్

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 76.81శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 18,75,934 మంది ఓటర్లు ఉండగా 14,40,885 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. వీరిలో మహిళలు 7,39,852 పురుషులు 7,01,016 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఎచ్చెర్ల నియెజకవర్గంలో 83 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు.

News May 15, 2024

శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరి పంట రైతులు ఆందోళన

image

జిల్లాలోని కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో 35వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. కొబ్బరి పంటపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వరుసగా తుఫాన్లు, తెగుళ్ల బెడదతో కొబ్బరి రైతులకు పంట నష్టం వాటిల్లుతోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కొబ్బరి పంట నాశనమైంది. నిత్యం పచ్చదనంగా కనిపించే ఉద్దానంలో కొబ్బరి మొక్కలు ఎండిపోతున్నాయి. 

News May 14, 2024

శ్రీకాకుళం: ఎండ తీవ్రతకు అల్లాడుతున్న వేతనదారులు

image

ఉపాధి పనులు చేపడుతున్న ప్రదేశాల్లో వేతదారులు ఎండలకు అల్లాడిపోతున్నారు. వసతుల్లేక వడదెబ్బకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 30 మండలాల్లో ఈ ఏడాది 2,61,832 మంది ఉపాధి వేతనదారులు పనుల్లో పాల్గొంటున్నారు. వలసలు నివారించడానికి కేంద్రం ఉపాధిహామీ పథకం చేపట్టింది. పని ప్రదేశంలో చలువపందిళ్లు, గుడారాల్లాంటివి లేకపోవడంతో ఎండవేడిమి తట్టుకోలేపోతున్నామని పలువురు కూలీలు అంటున్నారు.

error: Content is protected !!