India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం పెరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 72.41 శాతం నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో తాజా సమాచారం మేరకు 75.41 శాతం నమోదైంది. మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా గతంతో పోలిస్తే సుమారు 3 శాతం మేర ఓటింగ్ పెరిగింది. ఈ పెరిగిన ఓటింగ్‌తో అధికార, ప్రతిపక్షాలు తమకే మేలు జరుగుతున్నాయని ఆశిస్తున్నాయి.
– మరి మీ కామెంట్ ఏంటి..?
ఎండల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. రేపు ఎండల తీవ్రతతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. ప్రజలు తగుజాగ్రత్తలు పాటించాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది.
సంతబొమ్మాళి మండలం యామాలపేటకు చెందిన లొట్ల రాము ఓటు వేయడానికి ఒమన్ దేశం నుంచి రూ.40 వేలు ఖర్చు పెట్టి గ్రామానికి వచ్చారు. సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రంకు వెళ్ళగా ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓటరు జాబితాలో ఆయన పేరు లేదంటూ అధికారులు వెనక్కి పంపారు. తన ప్రమేయం లేకుండా ఎలా ఓటు తొలగించారంటూ ఆ యువకుడు మండిపడ్డాడు.
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఎన్నికలు సజావుగా సాగాయని కలెక్టర్ మనజీర్ జిలానీ సామాన్ తెలిపారు. జరిగిన ఎన్నికలకు సంబంధించి 8 నియోజకవర్గాల ఈవీఎంలను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద శ్రీశివాని ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. సోమవారం రాత్రి 9.15 గంటలకి మూడంచెల భద్రతావలయం వద్ద ఈవీఎంలను తరలించారు.
పుట్టిన రోజునే ఓ బాలుడు కాన్సర్‌తో మృతి చెందిన విషాదకర ఘటన కంచిలిలో సోమవారం జరిగింది. పెద్దఖొజ్జిరియాకు చెందిన సనీత్ కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. 10 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సనీత్ మృతి చెందారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు పుట్టిన రోజునే మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్‌లో మహిళలు భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాత్రి 10.30 గంటల సమయానికి మొత్తం 13,93,858 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా వారిలో అత్యధికంగా 7,21,692 మంది మహిళలు ఓటు వేశారు. వారి తర్వాత 6,72,149 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 74.30 శాతం పోలింగ్ నమోదైదనట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్‌లో 75.41శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా 2019లో 72.2 శాతంగా పోలింగ్ నమోదయింది. యువత, ఉద్యోగులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనడంతో ఈ సారి ఓటింగ్ శాతం పెగిరిందని అధికారులు తెలిపారు. ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శ్రీకాకుళం జిల్లాలో తాజా సమాచారం ప్రకారం అత్యధికంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో 87శాతం పోలింగ్ నమోదవ్వగా, అత్యల్పంగా శ్రీకాకుళంలో 65.85 శాతం పోలింగ్ నమోదయింది. ఇచ్ఛాపురం-69.52, నరసన్నపేట-80.50, పలాస-74.94, పాతపట్నం-70.24, టెక్కలి-78.58, పాలకొండ-74.03, రాజాం-75.53, ఆముదాలవలస 79.49 శాతంగా నమోదయింది. కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు – 2024 శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ అధ్యక్షతన ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. ఇప్పటికే ముగిసిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాలలో ఉన్న EVMలు జిల్లాలో ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో శివాని ఇంజినీరింగ్ కళాశాలలో రిసెప్షన్ సెంటర్‌కు చేరుకుంటున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం రాత్రి 8.43 గంటలకు మొత్తం 72.90 శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇచ్ఛాపురం 67.01%, పలాస 72.13%, టెక్కలి 76.51%, పాతపట్నం 68.66%, శ్రీకాకుళం 66.07%, ఆమదాలవలస 77.62%, ఎచ్చెర్ల 78.83%, నరసన్నపేట 79.18% నమోదైందని వారు పేర్కొన్నారు.. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు పూర్తి అయ్యాయాయి.
Sorry, no posts matched your criteria.