Srikakulam

News June 9, 2024

శ్రీకాకుళంలో కూటమికి జైకొట్టిన ఉద్యోగులు

image

శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో 27,041 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అందులో 19,827(73.32%) ఓట్లు కూటమికి పడ్డాయి. రాష్ట్రంలోనే ఇది అత్యధికం. వైసీపీకి 6,033(22.31%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి కేవలం 448(1.66%) మంది మాత్రమే ఓటు వేశారు.

News June 9, 2024

శుద్ధ ముక్కపై రామోజీరావు కు సూక్ష్మ కళాకాండంతో శ్రద్ధాంజలి

image

ఈనాడు అధినేత రామోజీరావు మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధికి చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి రామోజీరావు సూక్ష్మ చిత్రాన్ని శుద్ధ ముక్కపై చెక్కారు. శుద్ధ ముక్కపై ఈ సూక్ష్మ కళాఖండం చెక్కేందుకు మూడు గంటల సమయం పట్టిందని కొత్తపల్లి రమేష్ తెలిపారు.

News June 8, 2024

శ్రీకాకుళం: కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా

image

ఏపీ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తోలాపి గ్రామానికి చెందిన దుంపల రామారావు 2024లో కళింగ కోఆపరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సేవలు అందించే లోపే పార్టీ అధికారం కోల్పోవడం బాధాకరమన్నారు. తన రాజీనామా పత్రాన్ని బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి పంపించానన్నారు. వైఎస్ జగన్‌కు, వైసీపీ నాయకులకు రుణపడి ఉంటానని అన్నారు.

News June 8, 2024

శ్రీకాకుళం: డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ టైం టేబుల్ విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ ‌(2015-16, 2016-17 అడ్మిట్ బ్యాచ్) పరీక్షల టైం టేబుల్‌ను ఎగ్జామినేషన్ బీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు ఈనెల 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థులు గమనించగలరని ఆయన కోరారు.

News June 8, 2024

సిక్కోలులో YCP చతికిలపడడానికి కారణం ఇదేనా..

image

సిక్కోలులో YCP ఘోరంగా చతికిలపడింది. గతంలో ఏ రాజకీయ పార్టీ ఇంత పరాభవం చెందలేదు. ప్రస్తుత ఎన్నికల్లో జిల్లాలోని ఒక MP, సహా 8 అసెంబ్లీలో ఓటమిపాలైంది. అసెంబ్లీలో జిల్లా నుంచి ఒక్క MLA కూడా లేరు. ఐదేళ్లలో జిల్లాలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయకపోవడం, రోడ్లు శిథిలమైనా కనీసం మరమ్మతుల ఊసే లేకపోవడం, జిల్లా అభివృద్ధిని విస్మరించడంతో దాని ప్రభావం ఫలితాల్లో కనిపిస్తోందని ప్రజలు నుంచి వినిపిస్తోంది.

News June 8, 2024

శ్రీకాకుళం: అందుబాటులోకి పోలీస్ సేవ వాహన యాప్

image

పోలీస్ సేవా యాప్ కొన్నిరోజులుగా పనిచేయకపోవడంతో దాని స్థానంలో కొత్త యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్రం ఈ యాప్ తెచ్చింది. ప్రస్తుతం దీని ద్వారానే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి అపరాధ రుసుం విధిస్తున్నారు. వాహన బీమా సొల్యూషన్, కేసులు గత బకాయిలు దీనిలోనే తెలుస్తాయి. కొత్త యాప్‌లోనే అపరాధ రుసుం విధిస్తున్నట్లు శ్రీకాకుళం నగర ట్రాఫిక్ ఎస్సై వి.సందీప్ చెప్పారు.

News June 8, 2024

పలాస: వైసీపీ ఎంపీటీపీపై దాడి

image

పలాస మండలం లక్ష్మీపురం YCP ఎంపీటీసీ గోండు మోహన్, ఆయన భార్య, మేనల్లుడు సురేష్ పై శుక్రవారం TDP కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. ఇంటికి వెళ్లి ముగ్గురిపై ఆయుధాలతో దాడి చేశారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. ఇలాంటి భౌతిక దాడులు సరైన పద్ధతి కాదని, ప్రజలు అధికారం కట్టబెట్టింది దాడులు చేయడానికి కాదని హితవు పలికారు.

News June 8, 2024

శ్రీకాకుళం: కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు..!

image

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో అధిక స్థానాలు రావడంతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలు కొలువు తీరనున్నాయి. శ్రీకాకుళం ప్రతినిధి కేంద్ర కేబినెట్‌లో టీడీపీ వాటా కింద రాష్ట్ర ఎంపీలో రామ్మోహన్ నాయుడుకి కేంద్రమంత్రి పదవి రావచ్చని టీడీపీ నాయకులు ఆశిస్తున్నాను. శ్రీకాకుళం ఎంపీగా మూడుసార్లు గెలుపొందారు. వాజ్ పేయీ హయాంలో ఆయన తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు.

News June 8, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ముస్తాబాద్-గన్నవరం రైల్వే సెక్షన్ మధ్య ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నం.11019 కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ శుక్రవారం నుంచి జూన్ 29 వరకు విజయవాడ-ఏలూరు- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ మార్గం గుండా ఈ ట్రైన్ నిడదవోలు చేరుకుంటుందన్నారు. జూన్ 29 వరకు ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.

News June 8, 2024

శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ఛాన్స్ ఎవరికో..?

image

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. శ్రీకాకుళం జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో 26 జిల్లాలకు కేటాయించాల్సిన నేపథ్యంలో జిల్లాకు ఒకటి లేదా రెండు కంటే మించి మంత్రి పదవులు దక్కకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. ఐతే మంత్రి రేసులో అచ్చెన్న, కూన, అశోక్‌లు ఉన్నట్లు సమాచారం.