India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. సబిత అనే మహిళ బట్టలు ఉతికేందుకు చెరువు దగ్గరికి వెళ్లింది. కాలు జారి నీటిలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆమెను కాపాడడానికి వెళ్లిన ఆమె భర్త కూడా నీటిలో మునిగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు స్పందించి వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా భర్త చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ఆదివారం ఆయన పలు విషయాలను తెలిపారు. రీ-పోలింగ్‌కు అవకాశం లేకుండా సార్వత్రిక ఎన్నికలలో హింసకు తావులేకుండా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు విజయనగరం ఎంపీ స్థానానికి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు విశాఖ ఎంపీ అభ్యర్థికి ఓటు వేస్తారు. అటు అల్లూరి జిల్లాలో ఉన్న అరకు ఎంపీ అభ్యర్థికి పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గ ఓటర్లు తమ ఓటును వేయాల్సి ఉంటుంది.
జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశామని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్ తెలిపారు. ☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 18,92,457 మంది ☞ పోలింగ్ కేంద్రాలు- 2,358 ☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 520 ☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్- 18004256625 ☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం – 1950
ఇచ్ఛాపురం బస్టాండు ఎర్రన్నాయుడు కూడలి వద్ద వాహన తనిఖీల్లో రూ.1.17లక్షలు స్వాధనం చేసుకున్నారు. డొంకూరు గ్రామానికి చెందిన మొగలిపురి భాస్కరరావు వద్ద ఈ మొత్తం వెలుగు చూసింది. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఎన్నికల అధికారులు ఉపతహసీల్దారుకు అప్పగించినట్లు పట్టణ ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో డబ్బులకు తప్పనిసరిగా రశీదులు ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
మెళియాపుట్టి మండలం చందనగిరి గ్రామంలో 150 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంగా నెలబొంతు ఆశ్రమ పాఠశాలను కేటాయించారు. చందనగిరి నుంచి ఇక్కడకు చేరుకోవాలంటే మూడు కొండలు దిగి రావాల్సిందే. అది మావోయిస్తు ప్రభావిత ప్రాంతంతోపాటు అక్కడ ప్రభుత్వ భవనాలు లేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేకపోతున్నామని రెవెన్యూ అధికారులు, పోలీసులు చెబుతున్నారు.
వంశధార నదిలో మునిగి బాలిక మృతి చెందిన ఘటన శనివారం హిరమండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని కొమనాపల్లికి చెందిన తెంబూరు సంజనశ్రేయ(9) తల్లిదండ్రులతో కలిసి రుగడ గ్రామ సమీపంలోని వంశధారకు స్నానానికి వెళ్లింది. ప్రమాదవశాత్తు నదిలో లోతు ప్రాంతానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందింది. తండ్రి వసంతరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
రాజకీయ నాయకుడి జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నిన్నటితో ముగిసిన నెల రోజుల ప్రచారం ప్రిపరేషన్ అన్నమాట. ఇక నేతలందరికీ 13న పరీక్ష(ఓటింగ్). 21 రోజులకే ఫలితాలు. శ్రీకాకుళం 8 అసెంబ్లీ స్థానాలు 8 జాబ్స్ (MLA స్థానాలు) ఉండగా.. మొత్తం 73 మంది పరీక్ష రాశారు. వీరిలో టాప్ ర్యాంక్‌తో జాబ్ కొట్టేవారు ఎవరెవరో కామెంట్ చేయండి
సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శివాని ఇంజినీరింగ్ కళాశాలలో రిసెప్షన్ కేంద్రంలో ట్రయిల్ రన్‌ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జీలాని సమూన్ శనివారం రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రతీ ఒక్క సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేశారని సూచించారు.
*శ్రీకాకుళం:ఎన్నికల ప్రచారం బంద్
*టెక్కలి: అక్కవరంలో చోరీ
*లావేరు: పోలీసు కవాతు
*నందిగాం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
*శ్రీకాకుళం: రాజకీయ పార్టీలకు ఎస్పీ రాధిక సూచనలు
*మెలియాపుట్టి: అక్రమ మద్యం స్వాధీనం
*శ్రీకాకుళం: సకల సౌకర్యాలతో పోలింగ్ కేంద్రాలు:కలెక్టర్
*సంతబొమ్మాళి: వాలంటీర్ తొలగింపు
Sorry, no posts matched your criteria.