Srikakulam

News June 6, 2024

శ్రీకాకుళం జిల్లాలో వివాహిత ఆత్మహత్య

image

కొత్తూరు మండలం బత్తిలి రహదారిలో బుధవారం ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన కృష్ణారావుతో పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన ఆర్. రేవతి (27)కి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. కృష్ణారావు కొత్తూరు అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలు చక్కగా ఉండేవారని, ఆమె ఎందుకు అఘాయిత్యానికి పాల్పడిందో తెలియడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

News June 6, 2024

విధుల్లో పాల్గొన్న సిబ్బందికి అభినందనలు: ఎస్పీ

image

శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. అన్ని శాఖలు సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి చేశామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక అన్నారు. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియకు సహకరించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సమర్థవంతంగా హోంగార్డు స్థాయి నుంచి పై స్థాయి వరకు విధులు నిర్వహించిన వారికి ఎస్పీ అభినందనలు తెలిపారు.

News June 6, 2024

సిక్కోలులో పనసకు గిరాకీ తెచ్చిన ఒడిశా సంస్కృతి

image

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఈ ఏడాది పనస పంట దిగుబడి పెరిగడంతో ఇఛ్చాపురంలో విక్రయాలు జోరందుకున్నాయి. అధిక విక్రయాలకు దిగుబడి పెరగడం ఓ కారణమైతే ఒడిశా సంస్కృతి ప్రధాన కారణం. అదేంటంటే గురువారం ఒడిశా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో అంబ అమావాస్య, సావిత్రి అమావాస్య సందర్భంగా పెళ్లైన ఆడపిల్లలకు పనస పండ్లు కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. దీంతో ఉద్దానం ప్రాంతంలో విక్రయాలు మరింత జోరందుకున్నాయి.

News June 6, 2024

సిక్కోలులో పనసకు గిరాకీ తెచ్చిన ఒడిశా సంస్కృతి

image

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఈ ఏడాది పనస పంట దిగుబడి పెరిగడంతో ఇఛ్చాపురంలో విక్రయాలు జోరందుకున్నాయి. అధిక విక్రయాలకు దిగుబడి పెరగడం ఓ కారణమైతే ఒడిశా సంస్కృతి ప్రదాన కారణం. అదేంటంటే గురువారం ఒడిశా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో అంబ అమావాస్య, సావిత్రి అమావాస్య సందర్భంగా పెళ్ళైన ఆడపిల్లలకు పనస పండ్లు కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. దీంతో ఉద్దానం ప్రాంతంలో విక్రయాలు మరింత జోరందుకున్నాయి.

News June 6, 2024

శ్రీకాకుళం: శాసనసభకు ఎవరు ఎన్నోసారంటే..!

image

శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదుగురు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేయగా, ఐదుగురు తొలిసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ➤ సీనియర్లు: అచ్చెన్నాయుడు (6వ సారి), కూన రవికుమార్ (2వ సారి), బగ్గు రమణమూర్తి (2వ సారి), కోండ్రు మురళి (2వ సారి), బెందాళం అశోక్ (3వ సారి) ➤ తొలిసారి: గౌతు శిరీష, నడకుదిటి ఈశ్వర్, గొండు శంకర్, మామిడి గోవింద్, నిమ్మక జయకృష్ణ ఎన్నికయ్యారు.

News June 6, 2024

శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్‌‌ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు

image

శ్రీకాకుళం జిల్లాలో ఈసారి నోటాకు ఓట్లు భారీగా నమోదయ్యాయి. అముదాల వలస, టెక్కలి, ఇఛ్చాపురం, పాతపట్నం, శ్రీకాకుళం, పలాస నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఎచ్చెర్లలో అత్యధికంగా, ఆముదాల వలసలో అత్యల్పంగా ఓట్లు పడ్డాయి. ఈసారి శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో 4,270 ఓట్లు నోటాకు పడటం గమనార్హం. అయితే అత్యల్పంగా ఇఛ్చాపురంలో 744 ఓట్లు పోల్ అయ్యాయి.

News June 6, 2024

శ్రీకాకుళం: నేటితో ముగియనున్న ఎన్నికల నియమావళి

image

శ్రీకాకుళం జిల్లాలో సుమారు మూడు నెలల నుంచి అమల్లో ఉన్న ఎన్నికల నియమావళి నేటితో ముగియనుంది. కోడ్ నేపథ్యంలో కొత్తగా చేపట్టవలసిన పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి. అధికార యంత్రం అంతా ఎన్నికల సంఘ పరిధిలో ఉండడంతో నిబంధనలు లోబడి విధులు నిర్వహించారు. నేటితో నియమావళికి తెరపడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించడంతో అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా కోడ్ అమలు చేశారు.

News June 6, 2024

ఆమదాలవలస: గుణుపూర్ ట్రైన్ రద్దు

image

విశాఖపట్నం నుంచి గుణుపూర్ వరకు రెండు వైపులా నడిచే గుణుపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గురువారం రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయని, ఆమదాలవలస- శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ మాస్టర్ బుధవారం ప్రకటించారు. నౌపాడ, కోటబొమ్మాళి, తిలారు, పూండి వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేపడుతున్నందున ఈ ట్రైన్‌ని రద్దు చేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News June 6, 2024

నీట్‌లో సత్తా చాటిన సిక్కోలు విద్యార్థి

image

గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఆదర్శ కళాశాల, పాతపట్నంలో ఇంటర్ బైపీసీలో 953 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచి కళాశాలకే పేరు తెచ్చిన బండి గౌతమి 2024 నీట్ ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో 925వ ర్యాంకు, రీజనల్ స్థాయిలో 288వ ర్యాంకు సాధించింది. దీంతో ఆదర్శ పాఠశాల కళాశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని ప్రిన్సిపల్ రత్నకుమారి అన్నారు. గౌతమికి కళాశాల తరుపున అభినందనలు తెలిపారు.

News June 5, 2024

ఎచ్చెర్ల: పాత్రికేయుడి నుంచి ఎంపీగా..

image

రణస్థలం మండలం, వీఎన్ పురానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు పాత్రికేయ వృత్తి నుంచి ఎంపీ వరకు ఎదిగారు. రణస్థలంలో గ్రామీణ విలేకరిగా పనిచేస్తూ అప్పటి ఎచ్చెర్ల MLA స్పీకర్ కావలి ప్రతిభా భారతి అనుచరుడిగా మారారు. ఆమె అతడిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ పొందూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చేశారు. అనంతరం ఆయన TDP చేరారు. విజయనగరం YCP బెల్లాన చంద్రశేఖర్ మీద 2,38,216 ఓట్ల మెజార్టీతో కలిశెట్టి విజయం సాధించారు.