Srikakulam

News May 10, 2024

అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం: కింజరాపు

image

పలాస మండలంలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన బాబు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలతో మాట్లాడారు. అనంతరం తనను ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు టీడీపీ, నేతలు, అధికారులు పాల్గొన్నారు.

News May 10, 2024

కోటబొమ్మాళిలో రోడ్డు ప్రమాదం

image

కోటబొమ్మాలి మండలం పాకివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్,108లలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 10, 2024

కూటమి పార్టీలకు షాక్: ధర్మాన కృష్ణదాస్

image

సంక్షేమ పథకాల పంపిణీకి హైకోర్టు అనుమతి ఇవ్వడం హర్షణీయమని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. హైకోర్టు తీర్పుతో కూటమి పార్టీలకు షాక్ ఇచ్చినట్లు అయిందని పేర్కొన్నారు. టీడీపీ ఫిర్యాదుతో సంక్షేమ పథకాలు పంపిణీ జరగకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పథకాలు కొత్తవి కాదని.. ఎప్పటి నుంచో అమలవుతున్నాయని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.

News May 10, 2024

వీరఘట్టంలో హైపర్ ఆది ఎన్నికల ప్రచారం

image

స్థానిక నియోజకవర్గ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు మద్దతుగా జబర్దస్త్‌ నటుడు హైపర్‌ ఆది పట్టణంలో గురువారం ప్రచారం నిర్వహించారు. తొలుత స్థానిక కోటదుర్గమ్మ ఆలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 7 సార్లు కరెంటు ఛార్జీలు, 3 సార్లు బస్సు ఛార్జీలు పెరిగాయన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని కోరారు.

News May 10, 2024

వజ్రపుకొత్తూరు: ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వాలంటీర్‌పై కేసు

image

వజ్రపుకొత్తూరు మండలం ఉండ్రుకుడియా గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బొత్స షణ్ముఖరావు, గ్రామ వాలంటీర్ సహాయంతో బుధవారం రాత్రి వైసీపీ ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక యువకులు ప్రశ్నించి, ఫొటోలు తీయడంతో.. వారిపై దాడికి పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదుతో కాశిబుగ్గ పోలీసులు ఉపాధ్యాయుడుతో పాటు వాలంటీర్ తోట దిలీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

News May 10, 2024

శ్రీకాకుళం: 8 నియోజకవర్గాల్లో 2358 పోలింగ్ కేంద్రాలు

image

జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 2,358 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18,92,382 మంది ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో మే 13న పోలింగ్‌‌లో పాల్గొననున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, నీరు, ఫ్యాన్లు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీ సిబ్బందికి అవగాహన కల్పించారు.

News May 10, 2024

చంద్ర‌బాబుకు శ్రీ‌కాకుళంపై అభిమానం లేదు: ధర్మాన 

image

శ్రీ‌కాకుళం న‌గ‌ర ప‌రిధిలోని అర‌స‌వ‌ల్లి, పొట్టి శ్రీరాములు మార్కెట్, దమ్మల వీధి, గుడి వీధిలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. చంద్ర‌బాబుకు శ్రీకాకుళంపై అభిమానం లేదన్నారు.  

News May 10, 2024

ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసాం: కలెక్టర్

image

సాధారణ ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఈనెల 13 న రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్సు ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.

News May 9, 2024

శ్రీకాకుళం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

పోలింగ్ ముందు 48 గంటల నుంచి ఎన్నిక ముగిసే వరకు ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. ఐదుగురికి మించి ఒకే చోట గుమికూడరాదన్నారు. సరిహద్దు చెక్ పోస్టులను మరింత పటిష్ఠం చేసి ఇతర నియోజకవర్గ వాహనాలు ప్రవేశించకుండా డబ్బు, మద్యం, కానుకలు వంటివి అక్రమ రవాణా జరగకుండా ముమ్మర తనిఖీ చేయాలన్నారు.

News May 9, 2024

శ్రీకాకుళం:ఆలయ అటెండర్ పై సస్పన్షన్ వేటు

image

జిల్లాలో ఆలయాల కౌలు భూముల పన్నులకు సంబంధించి నకిలీ రసీదుల బాగోతం బయటపడింది. నగరంలోని గుడివీధి ఉమారుద్ర కోటేశ్వరాలయం ఈవో సుకన్య వివరాల మేరకు గుడివీధిలోని ఆలయ భూములకు రెండేళ్లుగా శిస్తు చెల్లించడం లేదని ఏడుగురు రైతులకు నోటీసులు ఇవ్వగా, వారు శిస్తు చెల్లించామన్నారు. అధికారులు విచారణ చేపట్టగా అటెండర్‌గా పనిచేసిన సతీశ్ నకిలీ రసీదులు ఇచ్చినట్లు విచారణలో తేలింది. అతడిని సస్పెండ్ చేశామని ఈఓ తెలిపారు.

error: Content is protected !!