India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణలో పీవోలు, ఏపీఓల కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో 8 నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు.
ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయం కొండ దిగువన ఓటు హక్కు వినియోగానికి సంబంధించి రూపొందించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. ఈ సరికొత్త శిల్పం రూపొందించిన శిల్పి గేదెల హరికృష్ణ గురువారం మాట్లాడుతూ.. భారతదేశంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు విధిగా తమ ఓటు హక్కును సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించుకోవాలని సూచించారు. హరికృష్ణను పలువురు అభినందించారు.
2024 అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారం మరింత ఉద్ధృతం చేశాయి. గ్రామాల్లో ప్రచారానికి వచ్చి ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఆయా పార్టీల మేనిఫేస్టోల గురించి నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. పోలింగ్ రోజు ఓటు ఎవరికి వేస్తారో అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఓటర్లు చివరకు ఏ పార్టీకి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.
శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి గెలిచిన అభ్యర్థుల అత్యధిక, అత్యల్ప మెజార్టీలను గమనిస్తే.. 1971 కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బి.రాజగోపాలరావుకు వచ్చిన 1,37,461 ఓట్ల మెజార్టీనే అత్యధికం. 1952లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వివి.గిరికి వచ్చిన 6395 ఓట్ల మెజార్టీనే అత్యల్పం. – మరి ఈసారి గెలుపు, మెజారిటీపై మీ COMMENT..?
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి అలాగే 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ప్రకటించారు. నిర్దేశిత సమయంలో మద్యం దుకాణాలను మూసి ఉంచాలని విక్రేతలకు సూచించారు. జూన్ 4 వ తేదీన కౌంటింగ్ సందర్భంగా కూడా దుకాణాలను మూసి వేయాలని ఆదేశించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు గురువారం చివరి అవకాశాన్ని కల్పిస్తున్నామని.. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. గడిచిన నాలుగు రోజులుగా జిల్లాలో 41,225 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఇంకా ఓటు హక్కు వినియోగించుకొని ఉద్యోగులకు ఈరోజు అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి, ఎన్నికల కమీషన్ సూచనలను శత శాతం తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలానీ సమూన్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సెక్టోరియల్ సమావేశంలో మాట్లాడారు. సెక్టోరియల్ అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం 72 గంటలు ప్రొటోకాల్ చాలా కీలకమన్నారు.
ఎచ్చెర్ల శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ బుధవారం పరిశీలించారు. జిల్లాలో గల పార్లమెంటు, శాసన సభ నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. ఈ పరిశీలనలో జెసి ఎం. నవీన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీమా ఉన్నారు.
పాలకొండ సబ్ డివిజన్లో పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ 46 మంది హోంగార్డులకు ఓటు హక్కు కల్పించడం లేదని వాపోయారు. మూడు రోజుల నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ ఓటుపై ఎన్నికల అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల అధికారులు చొరవ తీసుకొని తమకు ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో సింగూరు కృష్ణ చైతన్య ఆల్ ఇండియా 83వ ర్యాంక్ సాధించారు. కృష్ణ చైతన్య ప్రస్తుతం EPFO డిపార్ట్మెంట్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. కృష్ణ చైతన్య సొంత ఊరు సరుబుజ్జిలి మండలం కూనజమ్మన్నపేట. ఇతని తండ్రి సింగూరు రంగనాయకులు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి మీనాకుమారి గృహిణి. స్థానిక గ్రామస్థులు కృష్ణ చైతన్యకు అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.