India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడింది వైసీపీ ప్రభుత్వమేనని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇచ్చాపురం సభలో ఆయన మాట్లాడుతూ..‘రూ.4,400 కోట్లతో మూలపేట పోర్ట్ దగ్గర పనులు, ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం, కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్, ITDA పరిధిలో 5 మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు.. ఇవన్నీ చేసింది వైసీపీ ప్రభుత్వంలోనే’ అని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు-2024 కి సంబంధించి జిల్లాలో కొత్త ఓటర్ల జాబితా ఖరారైంది. జిల్లా మొత్తం 18,75,934 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషుల ఓటర్లు 9,29,859 మంది ఉన్నారు.. కాగా 9,45,945 మంది మహిళా ఓటర్ల ఉండగా ఇతరులు 130 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త జాబితాలో పురుషుల కంటే 16,086 మంది మహిళలే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త ఓటర్ల ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో వెచి చూడాల్సిందే..!
శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస వద్ద ఎన్నికల ప్రచార సభ వాతావరణం పరిస్థితుల దృష్ట్యా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన రద్దు అయ్యిందని ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు గమనించాలని కోరారు.
జిల్లా వైద్యారోగ్య శాఖలో నలుగురు ఉద్యోగుల తీరు వివాదాస్పదమైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారుల బృందం సోమవారం పలు ఆసుపత్రులలో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో జనసేన నాయకుడు దానేటి శ్రీధర్‌కు చెందిన ఆస్పత్రులను కూడా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆయనతో ఫొటో దిగడంతో నలుగురు వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.
వాతావరణంలో వచ్చిన మార్పులతో పాలకొండ మండల పరిధిలో ఉన్న ఎం సింగుపురం, మల్లివీడు, పద్మాపురం, భాసూరు పరిసర ప్రాంత గ్రామాల్లో మంగళవారం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం రూరల్, ఆమదాలవలస, కొత్తూరు, ఇచ్ఛాపురం, పాలకొండ, నరసన్నపేట, నందిగాం తదితరు మండలంలో మంగళ, బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ MD రోణంకి కూర్మనాధ్ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఇచ్ఛాపురంలో పర్యటించనున్నారు. విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్ఛాపురం చేరుకుంటారు. స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం వద్ద నుంచి మున్సిపల్ కూడలి వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సమావేశంలో మాట్లాడతారు. 3.30 గంటలకు ఇచ్ఛాపురం నుంచి విశాఖ బయలుదేరి వెళ్తారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ తెలిపారు.
పొందూరు మండలం మజ్జిలిపేట గ్రామంలో సోమవారం సాయంత్రం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ సతీమణి ప్రమీల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తుండగా ప్రతిపక్షానికి చెందిన కొందరు కార్యకర్తలు ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆమె కారు డ్రైవర్ అడ్డుకోవడంతో ఆయనకు గాయాలయ్యాయి. కోన సత్యనారాయణ, బలగ రామశంకర్రావు, అన్నెపు రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో APSRTC హెవీ లైసెన్స్ కోసం శిక్షణ పొందుటకు అడ్మిషన్స్ జరుగుతున్నాయని జిల్లా ప్రజారవాణా అధికారి విజయ కుమార్ సోమవారం తెలిపారు. శిక్షణ కోసం లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ LMV (ఫోర్ వీలర్) లైసెన్స్ ఉండాలని అన్నారు. ఇప్పటివరకు 15 బ్యాచ్‌లలో సుమారు 250 మంది డ్రైవర్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు.
ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న డిగ్రీ మొదటి సంవత్సరం, 2వ సెమిస్టర్‌కు చెందిన స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ (Stock Market Operations) పరీక్ష షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని డా.బీఆర్ఏయూ పరీక్షలు విభాగం డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ సోమవారం స్పష్టం చేశారు. అదే రోజు ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరుకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థుల ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
నందిగాం మండలం దేవుపురం పంచాయతీ కొండతెంబూరు గ్రామంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజారాపు అచ్చెన్నాయుడు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకోలను సాగనంపడానికి ప్రజలంతా ఏకమై కూటమిని గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు.
Sorry, no posts matched your criteria.