Srikakulam

News May 6, 2024

శ్రీకాకుళం: 474 మంది ఓటేశారు

image

శ్రీకాకుళంలో జిల్లాలో మొత్తం 494 మంది హోమ్ ఓటింగ్ విధానానికి నమోదు చేసుకోగా 474 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. అధికంగా నరసన్నపేట నియోజకవర్గంలో 110 మంది, అత్యల్పంగా పలాస నియోజకవర్గం నుంచి 10 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో 24 మంది ఓటేశారు.

News May 6, 2024

శ్రీకాకుళం: వాలంటీర్లకు వేతనం.. తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు

image

రాజాం మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 225 మంది వాలంటీర్లకు గాను 155 మంది రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా రాజీనామా చేసిన వారిలో 16 మందికి రూ.5వేల గౌరవవేతనం వారి అకౌంట్లలో జమఅయింది. ఈ విషయం కమిషనర్ రామప్పలనాయుడుకు తెలియగా నగదు రిటర్న్ చేయాలని ఆదేశించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News May 6, 2024

నరసన్నపేట: చంద్రబాబు నాయుడు పర్యటన రద్దు

image

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన రద్దయింది. ఈ మేరకు సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి తెలిపారు. ఈ నెల 9వ తేదీన నరసన్నపేటలో నిర్వహించాల్సిన బహిరంగ సభ రద్దు అయిందని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ విషయాన్ని గుర్తించాలని వారు స్పష్టం చేశారు.

News May 6, 2024

ఇచ్ఛాపురం: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

image

ఇచ్ఛాపురం పట్టణ పరిధిలోని పెద్దాకుల వీధికి చెందిన శ్రీదేవి సుష్మల్(43) మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఇచ్ఛాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ నడుపుకుంటున్న శ్రీదేవి ఇంట్లో చిన్నచిన్న తగాదాలతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

News May 6, 2024

సిక్కోలు నుంచి 18 మంది మంత్రులు

image

జిల్లాకు చెందిన నాయకులు 18 మంది మంత్రులుగా పని చేశారు. మొదటగా గౌతు లచ్చన్న మంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ నుంచి లుకరావు లక్ష్మణదాస్ గృహ నిర్మాణ, గొర్లె శ్రీరాములు, TDP తంగి సత్యనారాయణ రెవెన్యూ, ప్రతిభభారతి, కళా వెంకట్రావు, గుండ అప్పల సూర్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు మంత్రులుగా చేశారు. అచ్చెన్నాయుడు కార్మికశాఖ, ధర్మాన రెవెన్యూ, 2021లో సీదిరి పశువైద్యం, పాడి పరిశ్రమ మంత్రిగా, తదితరులు ఉన్నారు.

News May 6, 2024

శ్రీకాకుళం: యువగళం సభ రద్దు

image

ఈనెల 7న శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించనున్న యువగళం సభను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకటరమణ ఆదివారం ధ్రువీకరించారు.

News May 6, 2024

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ ఆదివారం తెలిపారు. అతని వయసు సుమారుగా 60-65 ఏళ్లు ఉంటుందని ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నీలం చోక్కా, లుంగీ ధరించిన్నట్లు పోలీసులు తెలిపారు.

News May 6, 2024

నరసన్నపేట ఎన్నికల అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

image

నరసన్నపేట నియోజకవర్గం లో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో భాగంగా రెండో రోజు ఆదివారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన ఆర్ వో రామ్మోహన్‌రావు, మెప్మా పీడీ కిరణ్ కుమార్, సారవకోట తాహశీల్దార్ భాగ్యలక్ష్మికి ఆదివారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై సమగ్రమైన నివేదికలో అందజేయాలంటూ నోటీసులో ఆయన స్పష్టం చేశారు.

News May 6, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి ఇంటి వద్ద ఓటింగ్

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం నుంచి ఇంటి వద్ద ఓటింగ్ జరగనుంది. 85 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు. జిల్లాలో 85 ఏళ్ల పైబడిన ఓటర్లు 11, 421 మంది, దివ్యాంగు ఓటర్లు 21, 517 మంది ఉండగా వారిలో హోం ఓటింగుకు 495 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 85 ఏళ్ల పైబడిన వారు 310 మంది దివ్యాంగులు 185 మంది ఇంటి వద్దనే ఫొటోకు వినియోగించుకోనున్నారు.

News May 6, 2024

ఈ నెల7న ఇచ్ఛాపురం రానున్న సీఎం జగన్

image

సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి ఈనెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి రానున్నారు. ఈ పర్యటనను పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఇచ్ఛాపురం మున్సిపల్ జంక్షన్ వద్ద మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించనున్నారు.

error: Content is protected !!