India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టెక్కలి ఆర్టీసీ డిపో కండక్టర్ బి.ధనుంజయరావును సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మార్చి 31న MLC, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయన నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో 40వ వారపు సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ప్రచార అనుమతులకు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులు ఇస్తామన్నారు.
వజ్రపుకొత్తూరు మండలం పూండి శివాలయం అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆలయాల్లోని ఆభరణలు, పంచపాత్రలు.. విలువైన వెండి పూజా సామగ్రిని ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ అర్చకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయాల్లోని సీసీ ఫుటేజీలను సైతం దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. వివరాలు తెలియాల్సి ఉంది.
పలాస మండలం లక్ష్మీపురం సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి తర్వాత ఎదురుగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి ఐచర్ వ్యాన్ అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐచర్ వ్యాన్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కొని
తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఇరుక్కున్న డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకి తీసి, చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రోగి కిడ్నీ నుంచి తొలగించిన 6 సెంటీమీటర్ల రాయి నగరంలోని గ్లోబల్ న్యూరోకేర్ ఆస్పత్రి వైద్యులు బొడ్డేపల్లి యోగేష్ (యూరాలజిస్ట్), డా.గొనప భవానిల ఆధ్వర్యంలో ఓ రోగి కిడ్నీ నుంచి ఏకంగా 6 సెంటీమీటర్ల రాయిని తొలగించారు. ఈ విషయాన్ని ఎండీ దేవిరెడ్డి గౌతమ్ మంగళవారం తెలిపారు. సాధారణంగా కిడ్నీలో 0.5 సె.మీ రాయి ఉంటేనే శస్త్రచికిత్సలు చేస్తామని, అలాంటిది అరుదుగా 6 సె.మీ ఉండడం గుర్తించి తొలగించామన్నారు.
అదనపు కట్నం కోసం వివాహితను వేదించిన కేసులో RPF కానిస్టేబుల్‌కు ఏడేళ్లు, కుటుంబీకులైన మరో నలుగురికి మూడేళ్లు జైలుశిక్ష విధిస్తూ రాజమహేంద్రవరం కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. పోలీసుల వివరాల మేరకు శ్రీకాకుళం సింగుపురానికి చెందిన లక్ష్మీ లావణ్య(27)ను సరుబుజ్జిలి మండలం రొట్టవలనకి చెందిన రవితో 2018లో వివాహమైంది. పెళ్లి తర్వాత ఆరు నెలల నుంచి ఆదనపు కట్నం కోసం వేధించాడు. దీంతో ఆమె ఉరేసుకుంది.
గార మండల పరిధి శ్రీకూర్మం పంచాయతీ నగిరెడ్లపేట, చుక్కపేట గ్రామాలమధ్య మంగళవారం రేగి కొబ్బరి, జీడి మామిడి, నీలగిరి తోటలు దగ్ధమయ్యాయి. వ్యర్థాలకు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించడంతో ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్ ఐ.అనీల్, వీఆర్వో జగదీష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
పలాస మండలం కొత్తవూరు జంక్షన్ వద్ద మంగళవారం సాయంత్రం ఎన్నికల తనిఖీలో బాగంగా వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మందస మండలం స్రవంతి రెంటికోట నుంచి పలాస వైపు ద్విచక్ర వాహనంపై వెళ్ళుతుండగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వెంకటరావు వాహనాన్ని తనిఖీ చేసి రూ.2.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న డబ్బులకు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేయడం జరిగిందని చెప్పారు.
విశాఖలో బుధవారం జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు డీఈఓ వేంకటేశ్వర రావు మంగళవారం తెలిపారు. శ్రీకాకుళంలోని తుమ్మావీధి మునిసిపల్ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న పప్పాల సత్యనారాయణ రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు వార్తా పేపర్‌లో వచ్చింది. విచారణ చేపట్టిన ఎంఈఓ దానిని ధ్రువీకరించారు. దీంతో టీచర్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.