Srikakulam

News May 4, 2024

సికింద్రాబాద్-బరంపురం మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

image

సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా బరంపురం ప్రాంతానికి ఈనెల 11,14 తేదీల్లో, తిరిగి 12,15 తేదీల్లో 07035 నంబరు గల వేసవి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె.శాందీప్ వివరాలు వెల్లడించారు. ఈనెల 11,14 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు బరంపురం చేరుకుంటుందని తెలిపారు.

News May 4, 2024

నరసన్నపేటకు రానున్న చంద్రబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. ఆరోజు నరసన్నపేట నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. విజయవాడ నుంచి 9న ఉదయం 11 గంటలకు నరసన్నపేట చేరుకుంటారని, అనంతరం చీపురుపల్లి వెళ్తారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకట రమణ తెలిపారు.

News May 4, 2024

పలాస: వంతెనపై వేలాడుతున్న లారీ

image

పలాస మండలం లక్ష్మీపురం సమీపంలో అర్ధరాత్రి దాటిన వేళ జాతీయ రహదారిపై ఓ లారీ అదుపు తప్పి వంతెన గోడను ఢీకొని వేలాడుతూ ఆగింది. ఈ ప్రమాదంలో సుమారు 10 అడుగుల ఎత్తు నుంచి డ్రైవర్ సర్వీస్ రోడ్లోకి ఎగిరి పడటంతో గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలం చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News May 4, 2024

లావేరు: మనస్తాపానికి గురై యువకుడి ఆత్మహత్య

image

పెళ్లి కావడం లేదని మనస్తాపానికి గురై యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన లావేరు మండలం కలవలస గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొంగం సాయి కోటి(38) మనస్తాపంతో పురుగు మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా బంధువులు చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడని జే.ఆర్ పురం పోలీసులు తెలిపారు.

News May 4, 2024

శ్రీకాకుళం: ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియ ప్రారంభం

image

ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈవీఎంలపై సీరియల్‌ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు సీసీ కెమెరాల ఎదుట పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.

News May 3, 2024

ఇచ్ఛాపురం: జీడితోటలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

image

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లోద్దపుట్టి గ్రామ సమీపంలో జీడితోటలో గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్.ఐ లక్ష్మణ్ రావు తెలిపారు. అతడు వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ వ్యక్తి వివరాలు తెలిసిన వారు 63099 90869, 63099 90827 పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

News May 3, 2024

పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూంలో భద్ర పరచాలి: కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ జాగ్రత్తగా స్ట్రాంగ్ రూం నందు భద్ర పరచాలని కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్ అన్నారు. ఎన్నికల సామగ్రి పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్, పోల్ అయ్యాక రిసెప్షన్ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు, పర్యవేక్షణ 24X7 ఉండాలని అన్నారు. పోలింగ్ కి 72 గం.ల ముందు నగదు, మద్యం, ఉచితాల పంపిణీ వంటివి జరగకుండా పటిష్ఠ నిఘా ఉండాలని అధికారులకు సూచించారు.

News May 3, 2024

శ్రీకాకుళం: హింసకు తావు లేని ఎన్నికలే లక్ష్యం

image

రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, రీ పోలింగ్ జరగకుండా ఉండేలా పని చేయడమే ప్రధాన లక్ష్యం కావాలని భారత ఎన్నికల కమిషన్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు సీనియర్ అధికారి శేఖర్ విద్యార్థి హాజరయ్యారు.

News May 3, 2024

శ్రీకాకుళం: ఈ నెల 7న నారా లోకేశ్ రాక

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం కార్యక్రమానికి ఈ నెల 7న శ్రీకాకుళం విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని 80 అడుగుల రోడ్డులో బహిరంగ ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ శుక్రవారం పరిశీలించారు. లోకేశ్ రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. యువగళం సభ విజయవంతం చేయాలని కోరారు.

News May 3, 2024

శ్రీకాకుళం: సీ-విజల్ ద్వారా 624 ఫిర్యాదులు

image

ఎన్నికల కోడ్ నుంచీ ఇప్పటి వరకూ జిల్లాలో 624 ఫిర్యాదులు సి. విజిల్ ద్వారా నమోదు అయ్యాయని అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వాటిని పరిష్కరించాయి. మొత్తం ఫిర్యాదులలో 437 మాత్రమే సరైనవని నిర్ధారించారు. మరోవైపు 187 కేసులను జిల్లా నియంత్రణ కేంద్రం ఫేక్ ఫిర్యాదులన్ని ధృవీకరించి తొలగించారు.

error: Content is protected !!