India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలి- మెలియాపుట్టి రోడ్డులోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్న పోలాకి సుందరమ్మ అనే మహిళ శుక్రవారం విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాలయ్యాయి. మండాపోలం కాలనీకి చెందిన సుందరమ్మ మిల్లులో పని చేస్తుండగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద కరెంట్ షా్క్ తగిలింది. గమనించిన స్థానికులు మహిళను చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన వృద్ధురాలు బండి సత్యవతి (73) గురువారం రాత్రి అనారోగ్య కారణంగా మృతి చెందారు. కుమారుడు బండి నర్సింహులు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వచ్చిన వైద్యులు మృతదేహం నుంచి నేత్రాలను సేకరించారు. తాను చనిపోయినా తన కళ్లు వేరొకరికి ఉపయోగపడాలనే గొప్ప ఆశయంతో నేత్రదానం చేసిన కుటుంబ సభ్యుల ఆశయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో సాంస్కృతిక, కళలు, క్రీడలు, సమాజ సేవ, పాండిత్యం, సాహసరంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలలు https://awards. gov. in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఐ.సి.డి.ఎస్ జిల్లా పథక సంచాలకులు బి. శాంతి శ్రీ తెలిపారు. అర్హులైన బాలల ద్వారా జూలై 31వ తేదీలోగా దరఖాస్తులు పంపాలని కోరారు.
ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల (సూక్ష్మ పరిశీలకులు) పాత్ర కీలకమని కేంద్ర ఎన్నికల పరిశీలకులు, సీనియర్ శేఖర్ విద్యార్థి అన్నారు. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ అధ్యక్షతన గురువారం మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించారు. అబ్జర్వర్లు పోలింగ్ విధానాన్ని పరిశీలిస్తూ ఎక్కడైనా తప్పిదాలు ఉల్లంఘనలు జరిగితే అధికారులకు చెప్పాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్ల మ్యాప్లను ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి, తలత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్ల, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలానీ సమూన్ పరిశీలించారు. అనంతరం పలువురు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వారు పేర్కొన్నారు. వారితో పాటుగా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఎస్పీ జి.ఆర్ రాధిక ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పాలకొండ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితమే పవన్ పాలకొండకు చేరుకున్నారు. పవన్‌కు దారి పొడవున అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ ప్రజలకు అభివాదం చేస్తూ వారాహిలో ముందుకు వెలుతున్నారు. మరికొద్ది సేపట్లో పవన్ ప్రసంగించనున్నారు. పవన్ వెంట పలువురు జిల్లా నేతలు ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు సాయంత్రం 4 గంటలకు పాలకొండ నియోజకవర్గంలో ఒడమ జంక్షన్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ సభకు భారీగా జనసైనికులు రానున్నారు. ఇప్పటికే పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్, 8 నియోజకవర్గాలకు పోలింగ్ కేంద్రాల వద్ద 1700 వీల్ చైర్లు, కంటి చూపు తక్కువ ఉన్నవారికి మాగ్నిఫయింగ్ (భూతద్దాలు ) 1700 వచ్చాయని కలెక్టర్ మంజీర జిలానీ సమూన్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీల్ చైర్లు, మాగ్నిఫయింగ్ (భూతద్దాలు ) పంపించామన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం పాలకొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రాజుపేట జంక్షన్ వద్ద హెలిప్యాడ్‌లో దిగి, అక్కడి నుంచి తన కాన్వాయ్‌లో ప్రచారం చేస్తూ పాలకొండలోని వడమ సెంటర్ చేరుకుంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జన సైనికులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఆయన హెలికాప్టర్‌లో పిఠాపురం బయలుదేరనున్నారు.
జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో వేట నిషేధకాలానికి భృతి అందించేందుకు అర్హుల గుర్తింపు కోసం గురువారం నుంచి ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టనున్నామని జిల్లా మత్స్యశాఖాధికారి పీవీ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈసీ అనుమతితో ఈ సర్వేలో అధికారులే స్వయంగా మండలాల్లో అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద రూ.10 వేల నగదును ఆర్థిక సాయంగా అందజేస్తుందని ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.