Srikakulam

News May 2, 2024

బూర్జ: కొడుకుని చంపి.. తండ్రి ఆత్మహత్య

image

బూర్జ మండలంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని లాభాం గ్రామానికి చెందిన అప్పలనాయుడు(40) భార్య 6 నెలల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కుమారుడు రేవంత్ (12) బాగోగులు చూసుకునేవారు లేకుండా పోయారు. ఈ క్రమంలో మనస్తాపంతో ఉంటున్న అప్పలనాయుడు కుమారుడికి ఉరి వేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 2, 2024

సారవకోట: శతాధిక వృద్ధురాలి మృతి

image

సారవకోట మండలం కుమ్మరి గుంట గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు యాళ్ల సీతారావమ్మ (104) బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈమె స్వయాన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పెద్దతల్లి. ఈమె మృతితో ధర్మాన కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈమె అంత్యక్రియలను గురువారం ఉదయం నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.

News May 1, 2024

సారవకోట: శతాధిక వృద్ధురాలి మృతి

image

సారవకోట మండలం కుమ్మరి గుంట గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు యాళ్ల సీతారావమ్మ (104) బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈమె స్వయాన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పెద్దతల్లి. ఈమె మృతితో ధర్మాన కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈమె అంత్యక్రియలను గురువారం ఉదయం నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.

News May 1, 2024

శ్రీకాకుళం ఎంపీ బరిలో 13 మంది.. గెలుపెవరిది?

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 29తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. శ్రీకాకుళం లోక్‌సభ నుంచి మొత్తం 13 బరిలో ఉన్నారు. ప్రధానంగా TDP నుంచి కె.రామ్మోహన్ నాయుడు, YCP నుంచి పేరాడ తిలక్, కాంగ్రెస్ నుంచి పేడాడ పరమేశ్వరరావు బరిలో ఉన్నారు. 2014, 2019లో టీడీపీ అభ్యర్థి కె.రామ్మోహన్ నాయుడు రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. వీరిలో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు. కామెంట్ చేయండి.

News May 1, 2024

శ్రీకాకుళం: నేరుగా ఫిర్యాదు చేయవచ్చు

image

జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం కృషి చేస్తోందని శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి తెలిపారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులను, అర్జీలను రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, సాధారణ ప్రజలు సమస్య తీవ్రతను బట్టి తనను నేరుగా లేదా, ఫోన్ 9032923131 ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు.

News May 1, 2024

శ్రీకాకుళం: ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల వివరాలపై ఆరా తీశారు.

News May 1, 2024

శ్రీకాకుళం:ఈవీఎం వేర్‌హౌస్ తనిఖీ చేసిన కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో ఈవీఎం వేర్‌హౌస్‌ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ మంగళవారం తనిఖీలు చేశారు. నెలవారీ తనిఖీలో భాగంగా ఈవీఎం వేర్‌హౌస్ ను ఆయన పరిశీలించి, వివరాలను నోడల్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఈవీఎం నోడల్ అధికారి, తదితరులు ఉన్నారు.

News April 30, 2024

శ్రీకాకుళం: రూ.1.36 కోట్ల విలువైన బంగారం సీజ్

image

ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు పట్టుబడిన నగదు వివరాలను జిల్లా అధికారులు మంగళవారం వెల్లడించారు. ఎటువంటి పత్రాలు లేకుండా రూ.1,30,18,920 నగదును సీజ్ చేశారు. బంగారం విషయానికొస్తే 2,901 గ్రాముల బంగారాన్ని ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,36,80,284 గా ఉంది. అలాగే 26,581 గ్రాముల వెండిని కూడా స్వాధీనం చేసుకోగా, దీని విలువ రూ.14,41,669 గా ఉంది.

News April 30, 2024

శ్రీకాకుళం: ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ 459 మంది అరెస్టు

image

నగదు, మద్యం, గంజాయి వంటి అక్రమ రవాణా కేసులలో ఇప్పటివరకు 459 మందిని అరెస్టు చేయగా 716 కేసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు.. ఇందులో భాగంగా 36 మోటార్ సైకిళ్లు, 13 కార్లు, ఒక వ్యాను, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.87 లక్షలుగా ఉంది. అలాగే సరైన పత్రాలు లేని కారణంగా 13 మొబైల్ ఫోన్లు, 10 చేతి గడియారాలు, 14 చీరలు, పదివేల టీ షర్టులు, 2500 కరపత్రాలు సీజ్ చేశారు.

News April 30, 2024

శ్రీకాకుళం: 7,812 మంది వాలంటీర్ల రాజీనామా

image

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన ఘటనలు 93 చోటు చేసుకోగా వాటిలో 34 కేసుల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 67 మంది ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయగా 39 మందిని సర్వీస్ నుంచి తొలగించారు. 17 మందిపై ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే 7812 మంది గ్రామ, వార్డు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారు. ఇంకా ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన 26 మంది రాజకీయ నాయకులపై 17 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

error: Content is protected !!