Srikakulam

News April 30, 2024

ఎన్నికల విధులు సజావుగా సాగాలి: కలెక్టర్ 

image

సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. పి.ఓలు, ఎపీఓల శిక్షణా తరగతులకు ఆయన హాజరయ్యారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులపై ఉందన్నారు.

News April 30, 2024

 మెలియాపుట్టి: 17 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

image

మెలియాపుట్టి మండలంలోని మర, బాలేరు గ్రామాలతో పాటు ఒడిశాలోని మర్రిగుడ్డి, కొయ్యర గ్రామంలో ఎస్ఈబీ, పాతపట్నం, మెలియాపుట్టి, ఒడిశా పోలీసు బృందాలు నాటుసారాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 వేల లీటర్ల బెల్లం ఊట, 370 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. ఎస్ఈబీ ఉన్నతాధికారులు టీ.తిరుపతినాయుడు, ఐ.ఏ బేగం తదితర సిబ్బంది పాల్గొన్నారు.

News April 30, 2024

పలాసలో వడదెబ్బతో వ్యక్తి మృతి

image

మండలంలోని బ్రాహ్మణతర్ల- కేదారిపురం గ్రామాలకు వెళ్లే రహదారి పక్కన పొలంలో మంగళవారం ఓ వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎండకు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టెక్కలిలోనూ మరో వ్యక్తి వడ దెబ్బతో మృతి చెందారు. స్థానికులు చుట్టు పక్కల గ్రామస్థులకు సమాచారం అందించారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కుటుంబ సభ్యులకు తెలపాలని కోరారు.

News April 30, 2024

కోటబొమ్మాళి: టీడీపీలో చేరిన వాలంటీర్లు

image

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల వాలంటీర్ విధులకు రాజీనామా చేసిన 17 మంది అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మాట్లాడుతూ.. నెలకు రూ. 5 వేలు భృతితో నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న తమ వద్ద బలవంతంగా రాజీనామా పత్రాలు రాయించుకున్నారని వాపోయారు.

News April 30, 2024

టెక్కలిలో వడదెబ్బతో వ్యక్తి మృతి

image

టెక్కలి మండలం బన్నువాడ గ్రామానికి చెందిన పోలాకి రామారావు(70) అనే వృద్ధుడు మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. మంగళవారం ఉదయం గ్రామంలో పొలంకి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News April 30, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయంటే?

image

శ్రీకాకుళం జిల్లాలో సాధారణ ఎన్నికల్లో భాగంగా మే 13న జిల్లా వ్యాప్తంగా 2,049 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో 299, పలాస పరిధిలో 284, టెక్కలి పరిధిలో 315, పాతపట్నం పరిధిలో 323, శ్రీకాకుళం పరిధిలో 279, ఆమదాలవలస పరిధిలో 259, ఎచ్చెర్ల పరిధిలో 309, నరసన్నపేట పరిధిలో 290 చొప్పున పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.

News April 30, 2024

ఇచ్ఛాపురంలో పిడుగుపాటుకు ఐదుగురికి గాయాలు

image

పట్టణంలో సోమవారం పిడుగులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. బహుదానదీ తీరంలో ఒడిశా గ్రామం వద్ద ఇటుకల పరశ్రమలో పనిచేసే కార్మికులు , తమ గుడిసెల్లో ఉండగా పిడుగు పడడంతో ఐదుగురు గాయపడ్డారు.కుటుంబీకులు ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

News April 30, 2024

శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక అభ్యర్థులు బరిలో ఉన్నది ఇక్కడే..!

image

శ్రీకాకుళం జిల్లాలో మే13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. కాగా జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గాను అత్యధికంగా ఆమదాల వలస నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా టెక్కలి,శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

News April 30, 2024

నరసన్నపేటలో నిచ్చెనపై నుంచి పడి వ్యక్తి మృతి

image

మండలంలోని గొనపపేట గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కోడి శ్రీధర్(39) నిచ్చెనపై నుంచి పడి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు పశువుల శాల నిర్మాణ పనులు నిచ్చెన ఎక్కి చేస్తుండగా జారి పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ బాబు తెలిపారు.

News April 30, 2024

శ్రీకాకుళం: ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పరిశీలన

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమితులైన వ్యయ పరిశీలకులు, నవీన్ కుమార్ సోనీ సోమవారం కలెక్టరేట్ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ (ఎన్నికల నియంత్రణ కేంద్రం) ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ ఇంచార్జి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్ని విభాగాలను పరిచయం చేశారు. సీజర్స్, సువిధ, గ్రీవిన్స్ రిడ్రెసల్ సెల్ మొదలైన విభాగాల సిబ్బంది వివరించారు.

error: Content is protected !!