India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును వారి రిజిస్టర్ లతో సంబంధం లేకుండా ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు తమ రిజిస్టర్లలో పక్కగా నమోదు చేస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి తెలిపారు. ఏజెంట్లతో కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి మన జిలాని సమూన్ తో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రతి ఒక్కరు లావాదేవీలను తెలపాలన్నారు.
➣ కింజరాపు రామ్మోహన్ నాయుడు: TDP
➣ తిలక్ పేరాడ: YCP
➣ పేడాడ పరమేశ్వరరావు: కాంగ్రెస్
➣ ఇప్పిలి సీతారాజు : JBNP
➣ నాయుడుగారి రాజశేఖర్ : BSP
➣ కాయ దుర్గారావు : నవరంగ్ కాంగ్రెస్ పార్టీ
➣బొమ్మాలి తిరుపతి రావు : PPI
➣ బోరుభద్ర చంద్రకళ : BCYP
➣ స్వతంత్ర అభ్యర్థులుగా చెల్లూరి డానియల్, బేత వివేకానంద మహా రాజ్, యెద్దు లక్ష్మీనారాయణ, వాబ యోగేశ్వరరావు, సనపల శ్రవణ్ కుమార్ పోటీలో ఉన్నారు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించామన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ అభ్యర్థులు అధికారులు పాల్గొన్నారు.
బూర్జ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బొడ్డేపల్లి శ్యాంకు డాక్టరేట్‌కు ఎంపికయ్యారు. ఊటీలో ఐక్యరాజ్యసమితి శాంతి సంస్థ ఈ గౌరవ డాక్టరేట్‌ను అందించారు. పౌరాణిక నాటకాల్లో హరిశ్చంద్ర, గయోపాఖ్యానంలలో రాష్ట్ర స్థాయిలో విశేషంగా రాణిస్తున్నారు. నాటక రంగంలో చేస్తున్న ఈ విశేష కృషికి గుర్తింపుగా పీస్ కౌన్సిల్ వారు ఈ డాక్టరేట్ పట్టాను బహుకరించారు.
జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సంబంధించి డిగ్రీ 6వ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ మూల్యాంకన షెడ్యూల్ ను యూనివర్సిటీ డీన్ ఎస్ ఉదయ్ భాస్కర్ సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు విద్యార్థులు ఈనెల 29వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.500 అపరాధ రుసుముతో మే 7వ తేదీ వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో మే 8వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. కావున విద్యార్థులు గమనించాలని కోరారు.
పాలకొండ జూనియర్ సివిల్ జడ్జి విజయరాజ్ కుమార్ సోమవారం సబ్ జైలును సందర్శించారు. జైలులో మౌలిక వసతుల పట్ల ఆరాతీశారు. జైలు సూపరింటెండెంట్ డి. జోగులు వేసవి దృష్ట్యా జైలు గదుల ఉపరితలాలపై కూల్ పెయింట్ వేయించినట్లు తెలియజేసారు. సారా అక్రమ వ్యాపార దుష్ప్రభావాలపై జూనియర్ సివిల్ జడ్జి ఖైదీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, న్యాయవాదులు బొడ్డు రామ్మోహన్ రావు పాల్గొన్నారు.
NCC, NSS వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరిగే ఒక్కరోజు సామాజిక సేవ, స్వచ్ఛంద ప్రాతిపదికన వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధికతో కలిసి కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
టెక్కలి-మెళియాపుట్టి రోడ్డులో సోమవారం విద్యుత్ షాక్‌కు గురై ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఫైబర్ నెట్ పనుల నిమిత్తం విద్యుత్ స్తంభం భం ఎక్కిన సమయంలో ప్రమాదవశాత్తూ.. విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు టెక్కలి పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది జనవరి 1 నుంచి 28 వరకూ 252.99 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు రాజాం సెబ్ సీఐ బి. శ్రీధర్ వెల్లడించారు. 70 కేసులు నమోదు చేసి 78 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. 2,700 లీటర్ల పులిసిన బెల్లం ఊటలను ధ్వంసం చేసి మూడు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 120 మందిని బైండోవర్ చేయడంతోపాటు 9 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు వెల్లడించారు.
మే 13న జరిగే ఎలక్షన్‌కు సంబంధించిన ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. వచ్చేనెల ఏడవ తేదీలోగా పంపిణీ పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్రతి ఓటరుకు ఈ స్లిప్పులు అందే విధంగా జిల్లా స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు బాధ్యతగా పనిచేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.