Srikakulam

News April 29, 2024

రాజాo: పెన్షన్ తీసుకుంటున్న వారికి గుడ్ న్యూస్

image

దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, చక్రాల కుర్చీకి పరిమితమైన వారు, సైనిక్ వెల్ఫేర్ పెన్షన్లను ఇంటింటికి సచివాలయం సిబ్బంది 1వ తారీఖు నుంచి అందిస్తారని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మిగిలిన వారికి DBT విధానం ద్వారా వారి వారి అకౌంట్స్‌లోనికి మే 1వ తారీఖున పెన్షన్ జమ చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ తీసుకోవడానికి ఎవ్వరూ కూడా సచివాలయం లేదా ఏ ఇతర ఆఫీస్‌లకు వెళ్లవలసిన అవసరం లేదని తెలిపారు.

News April 29, 2024

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో జవాన్‌కు తీవ్ర గాయాలు

image

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం పాగోడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నేతింటి వైకుంఠరావు ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. తన ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తుండగా.. విజయనగరం జిల్లా తగరపువలస సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 29, 2024

శ్రీకాకుళం: సూర్యనారాయణ స్వామి ఆదాయం

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయ వివరాలను అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.1,37,800లు, పూజలు విరాళాల రూపంలో రూ.53,807లు, ప్రసాదాల రూపంలో రూ.1,77,790లు, శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. నిన్న ఆదివారం రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు.

News April 28, 2024

కంచిలి: రహదారిపై అదుపుతప్పి బోల్తా పడిన కారు

image

మండలంలోని పెద్ద కొజ్జిరియా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సోంపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 28, 2024

REWIND: శ్రీకాకుళం: 20 ఏళ్లు సర్పంచ్.. ఆ తర్వాత MLA, MP

image

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన అప్పయ్యదర రాజకీయాల్లో అరుదైన ఘనత సాధించారు. గ్రామానికి 1961 నుంచి 1981 వరకు 20 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1984లో ఎంపీగా గెలుపొందారు. 1994లో టీడీపీ నుంచి, 2004లో కాంగ్రెస్ నుంచి టెక్కలి MLAగా విజయం సాధించారు. కుగ్రామంలో జన్మించిన ఆయన సర్పంచ్ మొదలు ఎమ్మెల్యే, ఎంపీగా సేవలందించడం విశేషం.

News April 28, 2024

శ్రీకాకుళం వాసి.. హైదరాబాద్‌లో మృతి

image

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని నడగాం గ్రామానికి చెందిన తమరాపు లక్ష్మణరావు (40) విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన లక్ష్మణరావు ఓ ప్రైవేటు కంపెనీలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం విధి నిర్వహణలో విద్యుత్ షాక్‌‌తో చనిపోయాడు. శనివారం విషయం తెలియడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

News April 28, 2024

నలుగురు స్పీకర్లను అందించిన సిక్కోలు

image

శ్రీకాకుళం జిల్లాది రాజకీయాల్లో చెరగని ముద్ర. జిల్లావాసులు ఎందరో రాజకీయ హేమాహేమీలతో పాటు నలుగురు స్పీకర్లను సైతం అందించారు. 1955లో టెక్కలి MLAగా గెలిచిన రొక్కం నరసింహం దొర ఆంధ్రరాష్ట్ర 2వ స్పీకర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో తంగి సత్యనారాయణ 7వ స్పీకర్‌గా, ప్రతిభాభారతి 11వ స్పీకర్‌గా సేవలు అందించారు. ఆమదాలవలస MLA తమ్మినేని సీతారాం నవ్యాంధ్రప్రదేశ్ 2వ స్పీకర్‌గా పనిచేశారు.

News April 28, 2024

శ్రీకాకుళం: ACCIDENT.. 19 ఏళ్ల యువకుడు మృతి 

image

శ్రీకాకుళం జిల్లా గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గార గ్రామానికి చెందిన ఓం దత్తకుమార్(19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మినీ లగేజి వాహనం ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. SI కృష్ణ ప్రసాద్ కేసునమోదు చేశారు.

News April 28, 2024

శ్రీకాకుళం: ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్

image

పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల ప్రవేశాలకు సంబంధించి శనివారం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన పాలిసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. శ్రీకాకుళం డివిజన్‌లోని 26 కేంద్రాల్లో 7,195 మందికి 6,492 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. టెక్కలి డివిజన్‌లోని 16 కేంద్రాల్లో 4,816 మంది విద్యార్థులకు గాను 4,362 మంది హాజరయ్యారు. మొత్తంగా 90.37శాతం హాజరైనట్టు జిల్లా సమన్వయకర్తలు గురుగుబెల్లి దామోదరరావు, గోపి తెలిపారు.

News April 28, 2024

శ్రీకాకుళం: ఒకే గ్రామం నుంచి ముగ్గురు MLAలు

image

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు నాయకులు MLAలు అవడం విశేషం. మండలంలోని మబగాం గ్రామానికి చెందిన ధర్మాన ప్రసాదరావు(1989-94, 1999-2004), కృష్ణదాస్(2004-2014), బగ్గు రమణమూర్తి(2014-2019) నరసన్నపేట నియోజకవర్గానికి MLAలుగా ప్రాతినిధ్యం వహించారు. కాగా ధర్మాన ప్రస్తుతం శ్రీకాకుళం MLAగా కొనసాగుతుండగా.. కృష్ణదాస్ నరసన్నపేట MLAగా వ్యవహరిస్తున్నారు.

error: Content is protected !!