India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. శనివారం సాధారణ పరిశీలకులు శేఖర్, సందీప్ కుమార్, పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా, పోలీసు పరిశీలకులు సచింద్ర పటేల్, దిగంబర్ పి. ప్రధాన్లకు ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. ఇప్పటికే సిబ్బందికి రెండు విడతల శిక్షణ పూర్తి చేశామన్నారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల రేపు సాయంత్రం 4 గంటలకు టెక్కలి రానున్నట్లు జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డా. పేడాడ పరమేశ్వరరావు తెలిపారు. స్థానిక ఇందిరాగాంధీ కూడలి వద్ద జరిగే సమావేశంలో షర్మిల ప్రసంగిస్తారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె టెక్కలి, పలాసలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు.
టెక్కలి-రావివలస రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక బర్మా కాలనీ వద్ద శనివారం రాత్రి వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం బలంగా ఢీకొనడంతో రోడ్డుపైన పడి తీవ్రంగా గాయాపడింది. క్షతగాత్రురాలిని 108లో చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో రియల్ మేనిఫెస్టో అని రాష్ట్ర శాసనసభ స్పీకర్, ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలను కష్టాల నుంచి బయటపడేసే విధంగా జగన్ మేనిఫెస్టో ఉందని, చంద్రబాబు మేనిఫెస్టో అంతా కాపీ పేస్ట్ మాదిరిగా ఉంటుందన్నారు.
ఇటీవల వైసీపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పైడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అనకాపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం శ్రీనివాసరావు, ఆయన అనుచర వర్గానికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. నేడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధికారులు రానున్న రెండు వారాలు సమన్వయంతో పనిచేసి పండుగ వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని అధికారి శేఖర్ సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, ఎస్పీ జిఆర్. రాధికతో కలిసి ముగ్గురు ఎన్నికల పరిశీలకులతో సమావేశం నిర్వహించారు.
కంచిలి మండలంలోని బూరగాం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహనదారుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారి డివైడర్ మధ్య మొక్కలకు నీరుపోసే వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం ధ్వంసం కాగా, క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కపోవడంతో సమాచారం అందుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు డ్రైవర్‌ను బయటకు తీసి అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు.
శ్రీకాకుళం రోడ్డు తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డీసీఎం కే సందీప్ తెలిపారు. మే 5, 12 తేదీల్లో రాత్రి 8.05కి తిరుపతిలో (07440) బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 8.05కి దువ్వాడ చేరుకుని మధ్యాహ్నం12.15కి శ్రీకాకుళం చేరుకుంటుంది. మే 6, 13వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం (07441) రోడ్‌లో బయలుదేరి దువ్వాడ మీదగా తర్వాత రోజు ఉదయం 8.20కి తిరుపతికి చేరుకుంటుంది.
శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 18,75,934 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ తర్వాత 26,180 మంది కొత్తగా చేరారు. డబుల్ ఎంట్రీ, మరణించారు ఇలా 10,156 మంది ఓటర్లను తొలగించారు. జిల్లాలో పురుషులు 9,29,859, మహిళలు 9,45,945, ఇతరులు 130 మంది ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో 2,73,260 మంది, అత్యల్పంగా ఆమదాలవలసలో 1,93,858 మంది ఓటర్లు ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలక ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం నిర్వహించారు. 8 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు నామపత్రాలు పరిశీలించారు. ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి 82 నామినేషన్లు ఆమోదించగా.. 25 తిరస్కరించారు. పార్లమెంట్ స్థానానికి 13 ఆమోదించగా.. 3 తిరస్కరించారు. మొత్తానికి 95 ఆమోదం పొందాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.