India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆరసవల్లి సూర్యనారాయణ ఆలయ ఈవో ఎస్.చంద్రశేఖర్‌రెడ్డిపై దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ మండిపడ్డారు. రావివలసకు చెందిన అటెండర్ శ్రీనివాసరావు డిప్యూటేషన్‌పై ఆదిత్యాలయంలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందట గడువు ముగియడంతో ఆయన మరోసారి కమిషనర్ ఆర్డర్ తీసుకుని వెళ్లగా ఆరసవెళ్లి ఈవో విధుల్లోకి తీసుకోలేదు. విషయం కమిషనర్‌కు తెలిసి అటెండర్‌ను తక్షణమే విధుల్లోకి తీసుకోకుంటే సస్పెండ్ చేస్తా అంటూ హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మొత్తం 29,243 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,785 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 458 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. దక్షిణ తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా.. పశ్చిమ విదర్భ వివిధ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీంతో ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు మరో ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్నందున లైసెన్స్ ఉన్న తుపాకులను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ సూచించారు. బ్యాంకు భద్రత సిబ్బంది, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సిబ్బంది వద్ద ఉన్న 75 మినహా మిగిలినవి అప్పగించాలన్నారు. జిల్లాలో 254 లైసెన్సులపై 273 తుపాకీలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఉన్న మిగతా తుపాకిలు అప్పగించాలన్నారు.
జిల్లా సరిహద్దుగా ఉన్న కంచిలి మండలంలో గాటి ముకుందపురం, ఇచ్ఛాపురం మండలంలో పురుషోత్తపురం అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక, అదనపు ఎస్పీ జి.ప్రేమ కాజల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల రాకపోకలు, తనిఖీలను కాసేపు పరిశీలించి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెక్ పోస్టు సిబ్బంది ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. ఆమదాలవలస రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఎన్నికల నియమావళి పై నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. పోటీలో నిలిచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను సక్రమంగా సమర్పించాలన్నారు. సమస్యలుంటే 90323 18521 నెంబర్ కు సంప్రదించాలన్నారు.
ఓటర్లు తమ ఓటుహక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. కోటబొమ్మాళి మండలంలో ఆయన రిజర్వు పోలీసు దళాల ఫ్లాగ్ మార్చ్ లో సోమవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఓటర్లు ఎటువంటి భయబ్రాంతులకు, ప్రలోభాలకు గురికావద్దని సూచించారు.
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించడానికి మాజీ సైనిక ఉద్యోగస్థులు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక కోరారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో సైనిక బోర్డులో సభ్యత్వం ఉన్న మాజీ సైనిక ఉద్యోగస్థులతో ఎన్నికల విధులపై సమీక్షించారు. జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల బందోబస్తు విధులకు 60ఏళ్ల లోపు మాజీ సైనికులు వివరాలతో ఈ నెల 25లోగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు.
టెక్కలిలో సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సామున్ పర్యటించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రెవెన్యూ అధికారులు, పోలీసులతో సమీక్షించిన ఆయన ఎన్నికల కోడ్ అమలుపై అధికారులకు సూచనలు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈయనతో పాటు టెక్కలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూరుల్ కమర్, జిల్లా పోలీసు అధికారులున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఆమదాలవలస బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా కనితి విజయలక్ష్మి భాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి సాధు ధనుంజయరావు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికైన తొలి మహిళ అధ్యక్షురాలుగా ఆమె రికార్డు సృష్టించారు. ఉపాధ్యక్షులుగా రమణమూర్తి, కార్యదర్శిగా ఎ.విజయ్ కుమార్, సహాయ కార్యదర్శిగా బీ.మోహన్‌రావు ఎన్నికైనట్లు ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.