India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సోమవారం పరిశీలించారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా గదుల్లో తిరుగుతూ.. పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు. విద్యార్థుల హాజరును కలెక్టర్ ఆరా తీశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఎలాంటి పొరపాట్లకు తావివొద్దన్నారు.
సీతంపేట మండలం కడగండి గ్రామ యువకుడు పాలక కళ్యాణ్, మరో ఇద్దరు 15వ తేదీ ఇంటర్ పరీక్ష రాసి అనంతరం స్నేహితుని రూమ్‌లో ఉండి.. ఆదివారం భామిని నుంచి ఇంటికి వచ్చే క్రమంలో లారీ ఢీకొంది. స్థానికులు వెంటనే 108లో శ్రీకాకుళం రిమ్స్‌కి తీసుకువెళ్లారు. మార్గమధ్యలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమలులో ఉన్నందున, శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన పోలీసు స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక సోమవారం తెలియజేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతకాలం స్పందన కార్యక్రమం నిర్వహించబడదని ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా.. పాఠశాలల్లో నేటినుంచి ఒంటి పూట నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే వెంకటేశ్వరరావు ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని స్పష్టం చేశారు. పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయని పేర్కొన్నారు.
టెక్కలిలోని ఐదు గ్రామ సచివాలయాల సిబ్బందితోపాటు, మండలంలోని పలువురు గ్రామీణ ప్రాంత పంచాయతీ కార్యదర్శులకు ఆదివారం టెక్కలి ఎంపీడీఓ కె. విజయలక్ష్మి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టెక్కలి మేజర్ పంచాయతీతో పాటు గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలుకు సంబంధించిన విధులకు గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు హాజరుకాకపోవడంపై నోటీసులు జారీ చేశారు. ఇదే అంశాన్ని టెక్కలి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నివేదించారు.
నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు డీఆర్ఓ ఎం.గణపతి రావు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న వినతుల స్వీకరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత తదుపరి తేదీ ప్రకటిస్తామని తెలిపారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ అన్నారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, జెండాలు వంటివన్నీ తొలగిస్తున్నామన్నారు. అనంతరం ఎన్నికల నియమావళికి సంబంధించిన బుక్‌లెట్‌ను వారికి అందజేశారు.
ఫోన్‌కు వచ్చే గుర్తింపు లేని లింకులను క్లిక్ చేసి, వాటిని ఇన్‌స్టాల్ చేసుకొని సైబర్ నేరాలకు గురికావద్దని ఎస్పీ రాధిక సూచించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఏదైనా లోన్‌యాప్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను డౌన్లోడ్ కోసం యాప్ అఫీషియల్ యాప్ స్టోర్ నుంచి చేసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్నారు.
ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామపంచాయతీ ఎ.బలరాంపురం గ్రామానికి చెందిన ఎ.నీలాద్రి 2024 గేట్ ఎగ్జామ్‌లో ఆల్ ఇండియాలో 343వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఒక వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చిన నీలాద్రి కఠోర సాధనతో అత్యుత్తమ ర్యాంక్ సాధించడం పై పలువురు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ స్నేహితుడు శంకర్ సహాయంతో ఈ విజయం సాధించినట్లు నీలాద్రి తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో గ్రూప్-1 పరీక్షలు సజావుగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పేపర్ -1 కు సంబంధించి మొత్తం 6,403 మందికి గానూ పరీక్షలకు 4,124 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. 2,279 మంది పరీక్షలకు హాజరుకానట్లు వెల్లడించారు. పేపర్-2కు సంబంధించి 6,403 మందికి 4088 మంది హాజరయ్యారు. 2,315 మంది పరీక్షలకు హాజరు కాలేదు.
Sorry, no posts matched your criteria.