India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదో తరగతిలో ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలోకి వెళ్తే.. కోటబొమ్మాళి మండలం విశ్వనాథపురం పంచాయతీ సీతారాంపురానికి చెందిన వజ్రగడ్డి జానకి(16) పదిలో బక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లి సరోజనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్థానిక ఏస్‌ఐ షేక్‌మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హిరమండలం రెల్లివీధికి చెందిన కళింగపట్నం ధనుంజయ(26) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ధనుంజయకు రూ.5000 అప్పుగా ఇచ్చిన పందిరి రాజా అనే వ్యక్తి, అతని అనుచరులు అప్పు తీర్చమని ఇటీవల దారుణంగా కొట్టి, ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. వేధింపులకు భయపడి తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు తండ్రి భూలోకం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
శ్రీకాకుళం కాంగ్రెస్ అభ్యర్థిగా పైడి నాగభూషణ్ స్థానంలో అంబటి కృష్ణారావును ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ గతంలో 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా 38 నియోజకవర్గాలకు ఖరారు చేసింది. ఇందులో శ్రీకాకుళం కాంగ్రెస్ అభ్యర్థిని తాజాగా మార్చింది. అటు వైసీపీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాద్ రావు, కూటమి నుంచి గొండు శంకర్ బరిలో ఉన్నారు.
ఏపీలో విడుదలైన టెన్త్ ఫలితాలలో శ్రీకాకుళం జిల్లా 93.35 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. బాలురు 14,712 మంది పరీక్షలు రాయగా 13,489 మంది పాసయ్యారు. బాలికలు 14,033 మంది పరీక్షలు రాయగా 13,344 మంది పాసయ్యారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 28,745 మంది పరీక్షలు రాయగా 26,833 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 91.69 శాతం, బాలికలు 95.09 %మంది ఉత్తీర్ణులయ్యారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇటీవల మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 28,982 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 1592 మంది పరీక్షలు రాశారు.. విద్యార్థుల్లో బాలురు 14,843 మంది ఉండగా, బాలికలు 14,139 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 145 పరీక్షా కేంద్రాలో పది పరీక్షలు నిర్వహించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
భవనంపై నుంచి పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దిల్లేశ్వర్ రహ్మత్ నగర్‌లో ఉంటూ కూలీ పని చేసేవాడు. ఆదివారం సంజయ్ నగర్ బస్తీలోని నాల్గో అంతస్తులో పని చేస్తుండగా పైనుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో నేడు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పలాస నుంచి మంత్రి సీదిరి అప్పలరాజు, పాతపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డిశాంతితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిలో నామినేషన్ చేయనున్నారు. వీరితో పాటు తమ్మినేని సీతారాం ఆమదాలవలసలో నామినేషన్ వేయనున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈనెల 23న రాత్రి ఎచ్చెర్ల నియోజకవర్గానికి చేరుకుంటారన్నారు. అక్కడే రాత్రి బస చేసి, 24న శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో బస్సు యాత్రను చేపడతారన్నారు. టెక్కలిలో ఈ బస్సుయాత్ర ముగుస్తుందని అన్నారు.
రణస్థలం మండలం అల్లివలసలో మరో నిమిషాల్లో తాళి కట్టాల్సి ఉండగా.. ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైలపల్లి లక్ష్ముడు ఇంట్లో ఆదివారం రాత్రి జరుగుతున్న వివాహ వేడుకల్లో విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా.. 12మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జీరుపాలెంకు చెందిన అంబటి సీతమ్మ(45) మరణించగా.. గాయపడిన వారు రణస్థలంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హిరమండలంలోని దాసుపురం గ్రామానికి చెందిన సిద్ధమడుగుల శంకర్రావు (26) చవితి సీది వెళ్తుండగా కోడూరు దగ్గరలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయినట్లు హిరమండలం పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో అతని ముఖం రోడ్డును బలంగా తాకి తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన హిరమండలం ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.