India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి అవసరమయ్యే జీడిపప్పును సరఫరా చేసేందుకు పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోశ్ టెండర్లు దక్కించుకున్నారు. మూడు రోజుల కిందట గ్లోబల్ విధానంలో టెండర్లు పిలిచారని అన్నారు. రోజుకు మూడు టన్నుల జీడిపప్పు తిరుపతి లడ్డూ తయారీకి అవసరమవుతుందన్నారు. సుమారు 45 సంవత్సరాల క్రితం తిరుపతికి పలాస జీడిపప్పు సరఫరా అయిందని ఆయన గుర్తు చేశారు.

శ్రీకాకుళంలోని శ్రీసూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు స్వామివారి పులిహోర 10 వేల ప్యాకెట్లు, 10 వేల వాటర్ బాటిళ్లు సిద్ధం చేశారు. ఈ మేరకు వాటిని విజయవాడకు ప్రత్యేక వాహనంలో తరలించామని ఆలయ ఈవో రమేశ్ బాబు వెల్లడించారు. ఇలా శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆరాధ్య దైవమైన స్వామివారి వరద బాధితుల ఆకలి తీర్చుతుండటంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పోషణ మహా పోస్టర్ ఆవిష్కరించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో పోషణ్ అభియాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ పోషణ మహా కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న నెల రోజులు కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేయాలన్నారు. ఆయనతో పాటు ఆ శాఖ పీడీ శాంతి శ్రీ, నోడల్ ఆఫీసర్ మణి ఉన్నారు.

రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఐటిఐ కళాశాలలో ఈనెల సెప్టెంబర్ 4 నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి పి.బి.సాయి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, పరిశ్రమల అనుమతుల రుణాలకు సంబంధించి పరిశ్రమలు స్థాపించేందుకు గాను ఎనిమిది రోజులపాటు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు.

తుఫాను కారణంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఎక్కడైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లిన పంటనష్టం జరిగినా వెంటనే నివేధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై ఆర్డీఓలు, తహశీల్దార్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంతబొమ్మాళి మండలం గొల్లసీతాపురానికి చెందిన బొమ్మాళి బాలరాజు(30)అనే యువకుడు బ్రెయిన్‌డెడ్ కావడంతో మంగళవారం కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. టెక్కలి పంచాయతీ కార్యాలయం పరిధిలో కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న అతడు గత నెల 31వ తేదీన విద్యుత్ స్తంభం నుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

శ్రీకాకుళం జి ఆర్ పి పరిధి రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందినట్లు శ్రీకాకుళం జీఆర్పీ ఎస్ఐ మధు తెలిపారు. ఈ ఘటన విజయనగరం రైల్వే స్టేషన్‌కు దగ్గర్లో జరిగిందన్నారు. మృతుని వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందన్నారు. సదరు మృతి చెందిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే ఎస్సై నంబర్ 94934 74582కు సంప్రదించాలని కోరారు.

గార మండలం జొన్నలపాడు గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ పండా జాతీయ నంది పురస్కారానికి ఎంపికయ్యారు. కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ నంది పురస్కారానికి ఎంపికైనట్లు ఆ సంస్థ ఛైర్మన్ పాలోజు రాజ్ కుమార్ మంగళవారం తెలిపారు. డివోషనల్ సినీ జానపద గాయకుడిగా విశిష్ట సేవలందించిన దుర్గాప్రసాద్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లో జరిగిన జాబ్ మేళాలో 63 మంది వివిధ కంపెనీలలో ఎంపిక అయ్యారని ప్రిన్సిపల్ కె సూర్యచంద్రరావు తెలిపారు. మంగళవారం స్థానిక కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో భాగంగా 167 మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు. విద్యార్థినులు కూడా ఉద్యోగమేళాలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. విద్యార్థినులు 65 మంది పాల్గొనగా 32 మంది ఎంపిక అయ్యారని ఆయన స్పష్టం చేశారు.

విజయవాడలో వరద బాధితులకు చేస్తున్న సహాయక చర్యలపై శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేశ్ NDEF, వైమానికదళాలతో కలిసి చర్చించారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయడంపై పలు సూచనలు చేశారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందజేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.